మొబైల్‌ ఫోన్‌లు అంతరించుపోనున్నాయా..?

Posted By: Super

మొబైల్‌ ఫోన్‌లు అంతరించుపోనున్నాయా..?

 

అవును.. తాజా సర్వే నివేదికలను చూస్తుంటే  మొబైల్ ఫోన్ భవిష్యత్ అంధకారమేననిపిస్తుంది. ఓ అంతర్జాతీయ సర్వేలో వెల్లడైన పలు సంచలన అంశాలు సర్వత్రా ఉత్కంఠను రేపుతున్నాయి.

ఇటీవల నిర్వహించిన ఓ అధ్యయనం ప్రకారం స్మార్ట్ ఫోన్‌ల సంస్కృతి  ఊహించని స్థాయిలో విస్తరించింది. అది ఎంతగా అంటే..? సాధారణ ఫోన్‌లను మించిపోయేంత!

తేటతెల్లమవుతున్న అంశం ఆర్డినరీ మొబైల్ ఫోన్‌లను కనమరగు చేసేదిగా ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. ప్రస్తుత ఆధునిక యుగంలో స్మార్ట్‌ఫోన్‌లకు ఆదరణ అనూహ్య రీతిలో పెరిగింది. అన్ని విధాలైన ఫీచర్లు ఈ డివైజుల్లో నిక్షిప్తం కాబడి ఉండటంతో అన్ని వర్గాలు ప్రజలు ఆదరిస్తున్నారు. రోజు రోజుకి వీటి ధరలు తగ్గుముఖం పట్టటంతో స్మార్ట్‌ఫోన్ లక్షణాలు లేని మొబైల్

ఫోన్‌లకు క్రేజ్ తగ్గిపోతోంది. మరో కీలకమైన సమాచారాన్ని ఈ సర్వే ద్వారా రాబట్టగలిగారు.  యునైటెడ్ స్టేట్స్, యునైటెడ్ కింగ్డమ్ కు చెందిన 50 శాతం జనాభా సొంత స్మార్ట్‌ఫోన్లు కలిగి ఉన్నారంట.

స్మార్ట్‌ఫోన్‌ల సంస్కృతి ఈ విధంగా అభివృద్ధి చెందటానికి ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టం ఓ కారణం. ఈ వోఎస్‌లో యూజర్ ఫ్రెండ్లీతత్వం అధికంగా ఉండటంతో ఎక్కువ మంది ఆండ్రాయిడ్ ఆధారిత స్మార్ట్‌ఫోన్‌లనే ఎంపిక చేసుకుంటున్నారు. తరువాతి స్థానంల ఆపిల్ ఉంది. రానున్న కాలంలో స్మార్ట్‌పోన్‌ల ధరలు మరింత తగ్గుముఖం పట్టే అవకాశముందని విశ్లేషకులు అంచాన వేస్తున్నారు. ఇదే గనుక జరిగితే సాధారణ మొబైల్ ఫోన్లు కనుమరుగు కాక తప్పదు.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot