రూ. 500 స్మార్ట్‌ఫోన్‌కి ఖర్చు రూ.3 వేలు, మరి ఆ నష్టాన్ని భర్తీ చేసే రహస్యం ఏంటీ..?

Written By:

దేశీయ టెలికాం దిగ్గజాలు ఇప్పటిదాకా టెలికాం వార్‌తో కుమ్మేసుకుంటే ఇకపై అత్యంత తక్కువ ధరలకే స్మార్ట్‌ఫోన్ అంటూ మరో యుద్ధానికి తెరలేపుతున్న సంగతి అందరికీ తెలిసే ఉంటుంది. దిగ్గజ టెల్కోలన్నీ టారిఫ్ వార్లతో వినియోగదారులను కట్టిపడేస్తున్నాయి. ఇప్పుడు అదే ఊపులో వీలైనంతమందిని తమ నెట్‌వర్క్ పరిధిలోకి చేర్చుకునేందుకు తక్కువ ధరలకే స్మార్ట్‌ఫోన్ అంటూ వినియోగదారులను ఆకట్టుకునేందుకు రెడీ అయ్యాయి. వీటి ఖర్చు రూ. 3 వేల వరకు ఉంటే కంపెనీలు కేవలం రూ.500కే అందిస్తున్నాయి. మరి వీటి వెనక రహస్యం ఏంటి అనేదానిపై ఓ స్మార్ట్ లుక్కేయండి.

దుమ్మురేపిన BSNL, ఏడాది పాటు 1 జిబి డేటా, అపరిమిత కాల్స్

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

గత ఏడాది ఆగస్టులో..

గత ఏడాది ఆగస్టులో రిలయన్స్ జియో దేశీయ టెలికాం దిగ్గజాలను మట్టి కరిపిస్తూ అత్యంత తక్కువ ధరకు స్మార్ట్‌ఫోన్‌ను మార్కెట్లోకి తీసుకువచ్చిన సంగతి విదితమే. అయితే జియోకు ఆఫోన్ నుంచి ఆదాయం ఎలా వస్తుందనే దానిపై టెక్ విశ్లేషకులు బుర్రలు బద్దలు కొట్టుకున్న సంగతి తెలిసిందే. అయితే దానికి జియో వేసిన స్కెచ్ అందరినీ నోరెళ్లబెట్టేలా చేసింది.

అనేక షరతులను..

ఈ ఫోన్ మీద అనేక షరతులను కంపెనీ ప్రవేశపెట్టింది. ముఖ్యంగా జియో టారిఫ్ ప్లాన్లతోనే ఈ ఫోన్ నడుస్తుందని తెలిపింది. ఈ ఫోన్ కొన్న వారు తప్పనిసరిగా జియో ప్లాన్లు వేసుకోవాల్సి ఉంటుంది. ఈ ప్లాన్ల ద్వారా జియో తన ఆదాయాన్ని కొంతమేర రాబట్టుకునే ఆలోచన చేసిందని టెక్ విశ్లేషకులు సైతం అభిప్రాయాలను వెలిబుచ్చారు.

రూ.500 కన్నా తక్కువ ధరలో..

ఇక జియో దెబ్బకు కుదేలయిన దిగ్గజాలన్నీ రూ.500 కన్నా తక్కువ ధరలో 4జీ స్మార్ట్‌ఫోన్‌లను మార్కెట్‌లోకి తీసుకురావడానికి కసరత్తు చేస్తున్నాయి. ఎయిర్‌టెల్‌, వొడాఫోన్‌, ఐడియా సెల్యులార్‌లు ఈ కసరత్తు చేస్తున్నాయని తెలిసింది.

అసలెంత భారం..?

500 రూపాయలకే స్మార్ట్‌ఫోన్లను తీసుకొస్తున్న ఈ కంపెనీలకు, అసలెంత భారం పడుతుందో వివరిస్తూ.. టెలికాం ఇండస్ట్రీ అంచనాలు విడుదల చేసింది. ఈ అంచనాల్లో కంపెనీ భరించబోయే భారం చాలా పెద్ద మొత్తంలోనే ఉన్నట్టు తేలింది.

సగటును 3వేల రూపాయల మేర ఖర్చు..

ఎంట్రీ-లెవల్‌ 4జీ ఎనాబుల్డ్‌ స్మార్ట్‌ఫోన్‌ను తయారు చేయడానికి సగటును 3వేల రూపాయల మేర ఖర్చు అవుతుంది. ఈ డివైజ్‌లకు కనుక ఎక్కువ మొత్తంలో ఆర్డర్‌ చేస్తే.. దీని ఖర్చు 2700 రూపాయలకు తగ్గవచ్చు. కానీ దీని కంటే ఐదింతల తక్కువ రేటుకు అంటే 500 రూపాయలకే 4జీ స్మార్ట్‌ఫోన్‌ను ఆఫర్‌ చేస్తామని కంపెనీలు చెబుతున్నాయి.

26వేల కోట్ల భారాన్ని..

ఇలా 500 రూపాయలకే స్మార్ట్‌ఫోన్లను అందించడం వల్ల టెలికాం కంపెనీలు దాదాపు 26వేల కోట్ల భారాన్ని భరించాల్సి వస్తుందని తెలుస్తోంది. 

ఆర్థికంగా చితికి పోయిన టెలికాం పరిశ్రమకు..

ఇప్పటికే ఆర్థికంగా చితికి పోయిన టెలికాం పరిశ్రమకు, ఈ సబ్సిడీ అదనపు భారమని, కాస్త జాగ్రత్తగా వ్యవహరించాలని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అంతేకాక రుణాలు కూడా మరో రూ.5 లక్షల కోట్లకు పెరుగుతాయని పేర్కొంటున్నారు.

ఆదాయాన్ని భర్తీ చేసుకునేందుకు..

కాగా ఈ ఆదాయాన్ని భర్తీ చేసుకునేందుకు నెలకు 60 రూపాయల రీఛార్జ్‌ ప్లాన్‌తో ఈ డివైజ్‌లను టెలికాం కంపెనీలు ప్రవేశపెట్టబోతున్నాయి. అంటే ఏడాదికి 117 మిలియన్‌ యూజర్ల నుంచి రూ.8,424 కోట్లను టెలికాం కంపెనీలు రికవరీ చేసుకోవచ్చు.

రికవరీ చేసుకోవాలంటే ..

దీని ప్రకారం కంపెనీలు ఆఫర్‌ చేసిన మొత్తం సబ్సిడీని రికవరీ చేసుకోవాలంటే దాదాపు మూడేళ్లకు పైగానే సమయం పట్టే అవకాశం కనిపిస్తోంది. అదీ కూడా కస్టమర్‌ ఒకే ఆపరేటర్‌ను వాడితే తప్ప, ఆ రికవరీ సాధ్యం కాదు.

భారీగా పెరుగుతున్న పోటీతర వాతావరణ నేపథ్యంలో..

మరోవైపు భారీగా పెరుగుతున్న పోటీతర వాతావరణ నేపథ్యంలో, రికవరీ కాలం మరింత పెరిగినా ఆశ్చర్యం పోక్కర్లేదని తెలుస్తోంది.

780 మిలియన్ల మంది..

దేశంలో మొత్తం 1.2 బిలియన్‌ మంది వైర్‌లెస్‌ సబ్‌స్క్రైబర్లుండగా.. 780 మిలియన్ల మంది ఫీచర్‌ ఫోన్‌ వాడుతున్నారు.

దేశీయ మార్కెట్‌లో..

దేశీయ మార్కెట్‌లో స్మార్ట్‌ఫోన్‌ వాడకం తక్కువగా ఉందని, ఇంటర్నెట్‌ ఎనాబుల్డ్‌ ఫోన్లను ఎక్కువగా ప్రజలకు ఆఫర్‌ చేయాల్సినవసరం ఉందని ఐడీసీ ఇండియా సీనియర్‌ మార్కెట్‌ అనాలిస్ట్‌ జైపాల్‌ సింగ్‌ తెలిపారు.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Smartphones at Rs. 500? Their true cost may be Rs 26,000 crore More News at Gizbot Telugu
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot