Home
Mobile

స్మార్ట్‌ఫోన్‌లతో పెను ముప్పే..?

By Sivanjaneyulu Bommu

స్మార్ట్‌ఫోన్‌లు అందుబాటులోకి రాకముందు మానవ సంబంధాలు ఉన్నత విలువలను సంతరించుకుని ఉండేవి. మొబైల్ ఫోన్‌లు అందుబాటులోకి వచ్చాకా మనషి మనిషితో నేరుగా మాట్లాడటమే మానేసాడు. ఏదో కొత్త ట్రెండును అనుసరిస్తున్నట్లు స్మార్ట్‌ఫోన్‌లు అందుబాటులోకి వచ్చాక మనుషుల్లో సహజసిద్ధమైన ఆప్యాయత అనురాగాలు పూర్తిగా కొరవడుతున్నాయనే చెప్పాలి.

Read More : రిలయన్స్ జియో 4జీ సిమ్‌లను సపోర్ట్ చేసే ఫోన్‌లు ఇవే!

ఇదిలా ఉంటే కమ్యూనికేషన్ విభాగంలో కొత్త సంస్కరణలకు నాంది పలుకుతూ అవతరించిన స్మార్ట్‌ఫోన్‌లు మనిషి జ్ఞాపకశక్తిని హరించివేస్తున్నాయని ప్రముఖ నివేదికలు చెబుతున్నాయి. స్మార్ట్‌ఫోన్ మత్తులో జోగుతున్న మనిషి తన మెదడును ఆశ్రద్ధ చేస్తున్నాడనన్నది ఈ అధ్యయనాలు సారాంశం. స్మార్ట్‌ఫోన్ మనిషి జీవిత అలవాట్ల ఏ విధమైన ప్రభావం చూపుతందనే దాని పై పలు ఆసక్తికర వాస్తవాలు..

 కొత్త కొత్త ప్రమాదాలను కొని తెచ్చుకుంటున్నాడు

కొత్త కొత్త ప్రమాదాలను కొని తెచ్చుకుంటున్నాడు

స్మార్ట్‌ఫోన్‌ల కారణంగా మనిషి కొత్త కొత్త ప్రమాదాలను కొని తెచ్చుకుంటున్నాడు. చార్జ్ అవుతోన్న ఫోన్ ద్వారా, ఇయర్ ఫోన్స్ సహాయంతో పాటల వింటోన్న మహిళ ఆకస్మాత్తుగా సంభవించిన విద్యుత్ షాక్ కారణంగా ఇలా విగతజీవిలా మారింది.

తెలియని ఒత్తిడికి లోనవుతున్నాడు

తెలియని ఒత్తిడికి లోనవుతున్నాడు

స్మార్ట్‌ఫోన్‌లు మనిషిని తెలియని ఒత్తిడికి లోను చేస్తున్నాయి. ఉదాహరణకు.. ‘సోషల్ నెట్‌వర్కింగ్ సైట్స్' స్మార్ట్‌ఫోన్‌లను వినియోగిస్తున్న యువతలో అత్యధిక శాతం మంది సోషల్ నెట్‌వర్కింగ్‌లో గడిపేందుకు ఇష్టపడుతున్నారు. ఈ క్రమంలో నిద్రకు దూరమవుతున్నారు. ఆహారం వేళ కాని వేళల్లో తీసుకుంటున్నారు. పర్యావసానంగా అధిక ఒత్తిడిని అనుభవిస్తున్నారు.

పట్టుమని పది నెంబర్లు కూడా గుర్తుండటం లేదు

పట్టుమని పది నెంబర్లు కూడా గుర్తుండటం లేదు

ఫోన్ నెంబర్‌లను మొదలుకుని వ్యక్తిగత విషయాల వరకు స్మార్ట్‌ఫోన్‌లలోనే స్టోర్ చేసుకుంటున్నాం. తద్వార మెదడుకు పనిలేకుండా పోతుంది. స్మార్ట్‌ఫోన్ లేదా మొబైల్ ఫోన్ యూజర్లు తమ ఫోన్‌ల వైపు చూడకుండా పది మంది మొబైల్ నెంబర్లు చెప్పగలిగితే గొప్పే.

చిన్నారులకు దూరంగా

చిన్నారులకు దూరంగా

స్మార్ట్‌ఫోన్‌లను చిన్నారులకు దూరంగా ఉంచాల్సిన అవసరం ఎంతైనా ఉంది. చిన్నతనం నుంచే వారికి స్మార్ట్‌ఫోన్‌లను అలవాటు చేయటం ద్వారా ప్రాక్టికల్‌గా అవగాహన చేసుకోవల్సిన అంశాలను వారు ఆదమరుస్తారు. తద్వారా వారు మానసికంగా వెనుకబడిపోయే అవకాశముంది.

ఆలోచించటమే మనేసాం

ఆలోచించటమే మనేసాం

ఇంటర్నెట్ సెర్చ్ ఇంజెన్‌లు అందుబాటులోకి రావటంతో మనుషులు ఆలోచించటమే మనేసారు. మనకూ ఓ మెదడుందన్న విషయాన్ని ఆదమరుస్తున్న ఆధునిక మనుషులు ప్రతి చిన్న విషయానికి గూగుల వంటి సెర్చ్ ఇంజన్‌లను ఆశ్రయిస్తున్నారు.

ఎవరికి వారే యమునా తీరే

ఎవరికి వారే యమునా తీరే

ఎవరికి వారే యమునా తీరే అన్నట్లు పక్క పక్కనే ఉన్నప్పటికి స్మార్ట్‌ఫోన్‌లలోనే సంభాషించుకునేందుకే ఇష్టపడుతున్నారు.

ఆత్మీయ పలకరింపులు  లేవు

ఆత్మీయ పలకరింపులు లేవు

స్మార్ట్‌ఫోన్‌లు అందుబాటులోకి వచ్చాక మనుషుల్లో సహజసిద్ధమైన ఆత్మీయ పలకరింపులు పూర్తిగా కొరవడ్డాయనే చెప్పాలి.

చేతులారా చావును కొనితెచ్చుకుంటున్నాం..

చేతులారా చావును కొనితెచ్చుకుంటున్నాం..

పలువురు  రోడ్లు దాటుతోన్న సమయంలోనూ తమ ద్యాసను ఫోన్ పైనే ఉంచుతున్నారు. ఈ కారణంగా అనేక ప్రమాదాలు చోటు చేసుకోవటం మనం చూస్తూనే ఉన్నాం.. 

టెక్నాలజీకి నేటి యువత దాసోహం

టెక్నాలజీకి నేటి యువత దాసోహం

ఏదేమైనప్పటికి నేటి కమ్యూనికేషన్ టెక్నాలజీకి యువత దాసోహమంటోంది.

Best Mobiles in India

English summary
Smartphones Destroying the Quality of Human Interaction!. Read More in Telugu Gizbot...
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X