Home
Mobile

Upcoming Smartphones ఫిబ్రవరిలో లాంచ్‌ కానున్న స్మార్ట్‌ఫోన్లు ఇవే.. లిస్ట్‌..!

భారత్‌ స్మార్ట్‌ఫోన్‌ మార్కెట్‌లోకి జనవరి నెలలో అనేక ప్రముఖ సంస్థల స్మార్ట్‌ఫోన్లు లాంచ్‌ అయ్యాయి. శాంసంగ్‌ గెలాక్సీ S24 సిరీస్‌, వన్‌ప్లస్‌ 12 సిరీస్‌ వంటి ఫోన్లు విడుదల అ‌య్యాయి. అయితే ఫిబ్రవరిలోనూ (Upcoming Smartphones in February 2024) శాంసంగ్‌, వివో, ఐకూ, నథింగ్‌, షియోమీ వంటి ప్రముఖ సంస్థల ఫోన్లు లాంచ్‌ అయ్యే అవకాశం ఉంది.

నథింగ్ ఫోన్‌ 2a : ఈ స్మార్ట్‌ఫోన్‌ MWC 2024 కార్యక్రమంలో లాంచ్‌ అవుతుందని తెలుస్తోంది. ఈ నథింగ్‌ ఫోన్‌ 2a (Nothing Phone 2a) స్మార్ట్‌ఫోన్‌ 8GB ర్యామ్‌, 128GB అంతర్గత స్టోరేజీని కలిగి ఉంటే అవకాశం ఉంది. మరియు బ్లాక్‌, వైట్ రంగుల్లో లభిస్తుందని తెలుస్తోంది. ఈ ఫోన్‌ ధర సుమారుగా రూ.37000 కు అందుబాటులోకి రానుందని సమాచారం.

smartphones expected to launch in india

ఐకూ నియో 9 ప్రో : ఈ ఐకూ స్మార్ట్‌ఫోన్‌ 144Hz రీఫ్రెష్‌ రేట్‌తో 6.78 అంగుళాల OLED డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. ఈ ఐకూ నియో 9 ప్రో హ్యాండ్‌సెట్‌ (iQoo Neo 9 pro) స్నాప్‌ డ్రాగన్‌ 8 జెన్‌ 2 చిప్‌సెట్‌తో రానుంది. ఆండ్రాయిడ్‌ 14 ఆధారిత OSపైన పనిచేస్తుందని. మరియు వెనుకవైపు డ్యూయల్‌ కెమెరాలను కలిగి ఉంటుందని సమాచారం.

హానర్‌ X9B 5G : హానర్‌ సంస్థ తన భారత్‌లో తన ఉత్పత్తులను విస్తరించే పనిలో భాగంగా హానర్‌ X9B 5G స్మార్ట్‌ఫోన్‌ను (Honor X9B 5G) ఆవిష్కరించనుంది. ఈ స్మార్ట్‌ఫోన్‌ ప్రత్యేక టెక్నాలజీతో కూడిన డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. మరియు 12GB ర్యామ్‌, 256GB అంతర్గత స్టోరేజీ వేరియంట్‌లో అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది.

smartphones expected to launch in india

షియోమీ 14 అల్ట్రా : షియోమీ 14 సిరీస్‌ను MWC 2024 ఈవెంట్‌లో విడుదల చేస్తారని తెలుస్తోంది. షియోమీ 14 అల్ట్రా మోడల్‌ మెరుగైన ఫీచర్లను కలిగి ఉంటుందని తెలుస్తోంది. ఈ 14 సిరీస్‌ మోడల్‌ స్మార్ట్‌ఫోన్‌ను (xiaomi 14 Ultra) కొన్నినెలల క్రితమే చైనాలో షియోమీ సంస్థ లాంచ్ చేసింది.

శాంసంగ్‌ గెలాక్సీ M55 : ఈ శాంసంగ్‌ గెలాక్సీ స్మార్ట్‌ఫోన్‌ (Samsung Galaxy M55) 45W ఫాస్ట్‌ ఛార్జింగ్ సపోర్టుతో 5000mAh బ్యాటరీ సామర్థ్యాన్ని కలిగి ఉంటుందని తెలుస్తోంది. మరియు స్నాప్‌ డ్రాగన్‌ 7 జెన్‌ 1 SoC చిప్‌సెట్‌ పైన పనిచేస్తుందని సమాచారం. మరియు 8GB ర్యామ్‌తో లభిస్తుందని తెలుస్తోంది.

smartphones expected to launch in india

ఒప్పో F25 5G : ఈ స్మార్ట్‌ఫోన్‌ రెనో 11F 5G (Oppo F25 5G) రీబ్రాండెడ్‌ వెర్షన్‌గా తెలుస్తోంది. మరియు ఈ హ్యాండ్‌సెట్‌ ఆండ్రాయిడ్‌ 14 ఆధారిత ColorOS 14 పైన పనిచేస్తుందని తెలుస్తోంది. ఈ ఒప్పో స్మార్ట్‌ఫోన్‌ 67W ఫాస్ట్‌ ఛార్జింగ్‌ సపోర్టుతో 5000mAh బ్యాటరీ సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది.

వివో V30 5G : వివో కొత్త స్మార్ట్‌ఫోన్‌ 3D కర్వడ్‌ డిస్‌ప్లేను కలిగి ఉంటుందని సమాచారం. మరియు ఈ వివో V30 5G హ్యాండ్‌సెట్‌ (Vivo V30 5G) స్నాప్‌ డ్రాగన్‌ 7 జెన్‌ 3 చిప్‌సెట్‌ పైన పనిచేస్తుంది. 12GB ర్యామ్ మరియు 12GB వర్చువల్‌ ర్యామ్‌ను కలిగి ఉంటుంది. ఫలితంగా మెరుగైన ఫనితీరును కనబరుస్తుంది. ఈ స్మార్ట్‌ఫోన్‌ ధర రూ.30000 లోపు ఉండే అవకాశం ఉంది.

Best Mobiles in India

English summary
smartphones expected to launch in india in February 2024
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X