రూ.30 వేల‌లోపు గేమింగ్ స్మార్ట్ ఫోన్ల కోసం ఓ లుక్కేయండి!

|

నేటి కాలంలో స్మార్ట్ ఫోన్‌ల వినియోగం భారీగా పెరిగింది. చిన్న పిల్ల‌ల నుంచి పెద్ద వారి దాకా ముఖ్యంగా యువ‌తలో ఎక్కువ మంది స్మార్ట్ ఫోన్ల‌లో గేమింగ్ పై ఆస‌క్తి క‌న‌బ‌రుస్తున్నారు. స్మార్ట్ ఫోన్ల‌లో గేమింగ్స్ ద్వారా మంచి అనుభూతి పొందాల‌ని తాప‌త్ర‌య ప‌డుతుంటారు. అలా గేమింగ్ పై ఆస‌క్తి ఉన్న వారి కోసం ర‌క‌ర‌కాల ఫీచ‌ర్ల‌తో ధ‌ర‌కు త‌గ్గ‌ట్టు ప‌లు స్మార్ట్ ఫోన్లు అందుబాటులో ఉన్నాయి. ఇందుకు సంబంధించి రూ.30 వేల‌లోపు మ‌న‌కు అందుబాటులో ఉన్న మంచి గేమింగ్ స్మార్ట్ ఫోన్ల (Gaming Smartphones) గురించి వాటిల్లోని ఫీచ‌ర్ల గురించి మ‌నం ఇప్పుడు తెలుసుకుందాం. అంతేకాకుండా ఆ ఫోన్ల యొక్క పెర్ఫార్మెన్స్‌, ఛార్జింగ్ ఇత‌ర‌త్రా విష‌యాల గురించి చ‌ర్చించుకుందాం.

iQOO Neo 6:

iQOO Neo 6:

iQOO Neo 6 స్మార్ట్‌ఫోన్ Snapdragon 870 SoC ర‌న్ అవుతుంది. ఈ మొబైల్‌ 5జీ ఫీచ‌ర్ల‌ను క‌లిగి ఉంటుంది. ఈ మొబైల్ 6.62-అంగుళాల ఫుల్ హెచ్‌డీ+అమోల్డ్‌ డిస్‌ప్లేను కలిగి ఉండి, 120Hz రిఫ్రెష్ రేటుతో ప‌నిచేస్తుంది. ఆప్టిక్స్ విషయానికొస్తే ఇది వెన‌క వైపున ట్రిపుల్ కెమెరాను కలిగి ఉంది. ప్ర‌ధాన కెమెరా 64MP క్వాలిటీతో, ముందు భాగంలో 16MP సెల్ఫీ కెమెరాను కలిగి ఉంది. బ్యాటరీ విషయానికొస్తే ఇది 4700mAh బ్యాటరీతో 66వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ స‌పోర్ట్‌తో ప్యాక్ చేయబడి వస్తుంది. భార‌త్లో ఈ iQOO Neo 6 మొబైల్ ధ‌ర రూ.29,999 గా ఉంది.

Xiaomi 11i హైప‌ర్ ఛార్జ్‌:

Xiaomi 11i హైప‌ర్ ఛార్జ్‌:

Xiaomi 11i హైప‌ర్ ఛార్జ్‌ స్మార్ట్‌ఫోన్ వేగ‌వంత‌మైన ఛార్జింగ్ ఫీచ‌ర్ ను క‌లిగి ఉంది. బ్యాటరీ విషయానికొస్తే ఇది 4500mAh బ్యాటరీతో 120వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ స‌పోర్ట్‌తో ప్యాక్ చేయబడి వస్తుంది. ఇది MediaTek Dimensity 920 SoC ద్వారా ర‌న్ అవుతుంది. మొబైల్ 6.67-అంగుళాల ఫుల్ హెచ్‌డీ+అమోల్డ్‌ డిస్‌ప్లేను కలిగి ఉండి, 120Hz రిఫ్రెష్ రేటుతో ప‌నిచేస్తుంది. ఆప్టిక్స్ విషయానికొస్తే ఇది వెన‌క వైపున ట్రిపుల్ కెమెరాను కలిగి ఉంది. ప్ర‌ధాన కెమెరా 108MP క్వాలిటీతో, భార‌త్లో ఈ Xiaomi 11i మొబైల్ ధ‌ర రూ.26,999 గా ఉంది.

Poco F3 GT
 

Poco F3 GT

Poco F3 GT స్మార్ట్‌ఫోన్ 6.67-అంగుళాల ఫుల్ హెచ్‌డీ+అమోల్డ్‌ డిస్‌ప్లేను కలిగి ఉండి, 120Hz రిఫ్రెష్ రేటుతో ప‌నిచేస్తుంది. బ్యాటరీ విషయానికొస్తే ఇది 4060mAh బ్యాటరీతో 67వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ స‌పోర్ట్‌తో ప్యాక్ చేయబడి వస్తుంది. ఈ మొబైల్ MediaTek Dimensity 1200 SoC ద్వారా ర‌న్ అవుతుంది. ఆప్టిక్స్ విషయానికొస్తే ఇది వెన‌క వైపున ట్రిపుల్ కెమెరాను కలిగి ఉంది. ప్ర‌ధాన కెమెరా 64MP క్వాలిటీతో, 16MP సెల్ఫీ కెమెరాను కలిగి ఉంది. భార‌త్లో ఈ మొబైల్ ధ‌ర రూ.28,999 గా ఉంది.

Oppo Reno 7 5G

Oppo Reno 7 5G

ఈ మొబైల్ Mediatek Dimensity 900 SoC ద్వారా ర‌న్ అవుతుంది. 6.4-అంగుళాల ఫుల్ హెచ్‌డీ+అమోల్డ్‌ డిస్‌ప్లేను కలిగి ఉండి, 90Hz రిఫ్రెష్ రేటుతో ప‌నిచేస్తుంది. బ్యాటరీ విషయానికొస్తే ఇది 4500mAh బ్యాటరీతో 65వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ స‌పోర్ట్‌తో ప్యాక్ చేయబడి వస్తుంది. ఆప్టిక్స్ విషయానికొస్తే ఇది వెన‌క వైపున ట్రిపుల్ కెమెరాను కలిగి ఉంది. ప్ర‌ధాన కెమెరా 64MP క్వాలిటీతో కెమెరాను కలిగి ఉంది. భార‌త్లో ఈ మొబైల్ ధ‌ర రూ.28,999 గా ఉంది.

Bonus: Poco F4 5G

Bonus: Poco F4 5G

ఈ మొబైల్ భార‌త్‌లో జూన్ 23న విడుద‌ల కానుంది. napdragon 870 SoC ద్వారా ర‌న్ అవుతుంది. 6.67-అంగుళాల ఫుల్ హెచ్‌డీ+అమోల్డ్‌ డిస్‌ప్లేను కలిగి ఉండి, 120Hz రిఫ్రెష్ రేటుతో ప‌నిచేస్తుంది. బ్యాటరీ విషయానికొస్తే ఇది 4500mAh బ్యాటరీతో 67వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ స‌పోర్ట్‌తో ప్యాక్ చేయబడి వస్తుంది. ఆప్టిక్స్ విషయానికొస్తే ఇది వెన‌క వైపున ట్రిపుల్ కెమెరాను కలిగి ఉంది. ప్ర‌ధాన కెమెరా 64MP క్వాలిటీతో కెమెరాను కలిగి ఉంది. భార‌త్లో ఈ మొబైల్ ధ‌ర రూ.30,000 గా ఉంది.

Best Mobiles in India

English summary
Smartphones for gaming under Rs 30,000 in India

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X