Home
Mobile

ఫిబ్రవరిలో విడుదల కానున్న స్మార్ట్‌ఫోన్‌లు.. ఆపిల్, గూగుల్‌, శాంసంగ్‌, ఐకూ, వివో, ఒప్పో, పోకో సహా..!

Smartphones Launches in February : భారత్ మార్కెట్‌లో జనవరి నెలలో అనేక స్మార్ట్‌ఫోన్‌లు లాంచ్‌ అయ్యాయి. ఎంట్రీ లెవల్ నుంచి ప్రీమియం మోడల్స్‌ వరకు అనేక మోడల్స్‌ లాంచ్‌ అయ్యాయి. వివో, మోటోరోలా వంటి బ్రాండ్స్‌ ప్రీమియం సెగ్మెంట్‌లో స్మార్ట్‌ఫోన్‌లను తీసుకొచ్చాయి. రెడ్‌మి, రియల్‌మి వంటి సంస్థలు ఏకంగా 200MP కెమెరాలతో స్మార్ట్‌ఫోన్‌లను విడుదల చేశాయి. అయితే ఫిబ్రవరిలోనూ అనేక స్మార్ట్‌ఫోన్‌లు లాంచ్ కానున్నాయి.

ఫిబ్రవరిలో ఆపిల్‌, గూగుల్‌, శాంసంగ్‌, వివో, ఐకూ, ఒప్పో, పోకో, టెక్నో వంటి బ్రాండ్‌ల నుంచి వివిధ మోడల్స్‌ లాంచ్‌ కానున్నాయి. ఇప్పటికే అనేక మోడల్స్ విడుదల తేదీలు కూడా వెల్లడయ్యాయి. మరికొన్నింటి వివరాలు వెల్లడి కానున్నాయి.

smartphones launches in february 2026

ఐఫోన్ 17e స్మార్ట్‌ఫోన్ :
ఆపిల్‌ నుంచి గత సంవత్సరం ఫిబ్రవరిలో ఐఫోన్‌ 16e స్మార్ట్‌ఫోన్ విడుదల అయింది. ఈ ఫిబ్రవరిలో ఐఫోన్‌ 17e మోడల్‌ (iPhone 17e) లాంచ్‌ అయ్యే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. ఈ హ్యాండ్‌సెట్‌ A19 చిప్‌సెట్‌తో పనిచేస్తుందని, 48MP కెమెరా, 120Hz OLED డిస్‌ప్లేను కలిగి ఉంటుంది.

గూగుల్‌ పిక్సల్‌ 10a స్మార్ట్‌ఫోన్ :
గూగుల్‌ నుంచి పిక్సల్‌ 10a స్మార్ట్‌ఫోన్‌ (Google Pixel 10a Smartphone) ఫిబ్రవరి చివర్లో లేదా మార్చి నెల ప్రారంభంలో అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. గూగుల్‌ పిక్సల్ 9a ఫోన్‌ లో ఉపయోగించిన Tensor G4 SoC చిప్‌సెట్‌నే పిక్సల్‌ 10a మోడల్‌ కూడా కలిగి ఉంటుందని అంచనా వేస్తున్నారు.

ఈ గూగుల్‌ ఫోన్ వెనుక వైపు రెండు కెమెరాలుంటాయని తెలుస్తోంది. ఇందులో 48MP ప్రైమరీ కెమెరాను కలిగి ఉంటుందని అంచనా వేస్తున్నారు. 120Hz రీఫ్రెష్‌ రేట్‌తో OLED డిస్‌ప్లేను కలిగి ఉండే అవకాశం ఉంది. 23W వైర్ ఫాస్ట్‌ ఛార్జింగ్ సపోర్టుతో 5100mAh బ్యాటరీతో పనిచేసే అవకాశం ఉంది.

శాంసంగ్‌ నుంచి ఫిబ్రవరి నెలలో అనేక మోడల్స్‌ అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. ఇందులో గెలాక్సీ S26 సిరీస్‌, గెలాక్సీ A57, గెలాక్సీ A37 మోడల్స్‌, గెలాక్సీ F70 సిరీస్‌ మోడల్స్‌ విడుదల కానున్నాయని అంచనా వేస్తున్నారు. అన్‌ప్యాక్డ్‌ ఈవెంట్‌లో గెలాక్సీ S26 సిరీస్‌ లాంచ్‌ అయ్యే అవకాశం ఉంది. ఫిబ్రవరి 25 న విడుదల కానుందని లీక్స్‌ ద్వారా తెలుస్తోంది.

అయితే అన్‌ప్యాక్డ్ ఈవెంట్‌ 2026 కంటే ముందుగానే గెలాక్సీ A57, గెలాక్సీ A37 మోడల్స్‌ లాంచ్‌ అయ్యే అవకాశం ఉంది. గెలాక్సీ F70 సిరీస్‌ ప్రారంభ ధర రూ.10000 నుంచి రూ.15000 మధ్యలో ఉండే అవకాశం ఉంది. టాప్‌ ఎండ్‌ వేరియంట్‌ రూ.30 వేల కంటే తక్కువ ధరలో లాంచ్‌ కానుందని తెలుస్తోంది.

వివో V70 సిరీస్‌ :
వివో V70, వివో V70 Elite మోడల్స్‌ (Vivo V70 Series) ఫిబ్రవరిలోనే విడుదల కానున్నాయి. ఈ సిరీస్‌ ఫోన్‌లు ZEISS భాగస్వామ్యంతో కెమెరాలను కలిగి ఉంటుంది. క్వాల్‌కాం స్నాప్‌డ్రాగన్‌ ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. 6500mAh బ్యాటరీతో ఈ సిరీస్ పనిచేస్తుంది. ఫ్లాగ్‌షిప్‌ స్థాయిలో వాటర్‌ రెసిస్టెంట్‌గా ఉంటుందని తెలుస్తోంది. ఈ ఫోన్ కచ్చితమైన విడుదల తేదీ వెల్లడి కావాల్సి ఉంది.

ఐకూ 15R స్మార్ట్‌ఫోన్ :
ఈ స్మార్ట్‌ఫోన్ (iQOO 15R Smartphone) భారత్‌ మార్కెట్‌లో ఫిబ్రవరి 24 న విడుదల కానుంది. ఈ ఫోన్ స్నాప్‌డ్రాగన్‌ 8 జెన్‌ 5 చిప్‌సెట్‌తో పనిచేస్తుంది. ఈ ఫోన్‌ అమెజాన్‌ ద్వారా అందుబాటులోకి వస్తుంది. ప్రస్తుతం చైనాలో అందుబాటులో ఉన్న ఐకూ Z11 టర్బో మోడల్‌కు రీబ్రాండెడ్‌ వెర్షన్‌గా లాంచ్ కానుందని తెలుస్తోంది.

ఒప్పో K15 సిరీస్‌ :
ఈ నెలలోనే ఒప్పో K15 సిరీస్‌ (OPPO K15 Series) లాంచ్‌ కానుందని తెలుస్తోంది. ఇందులో భాగంగా ఒప్పో K15, K15x మోడల్స్ లాంచ్‌కానున్నాయని భావిస్తున్నారు. ఈ సిరీస్‌ ఫ్లిప్‌కార్ట్‌ ద్వారా అందుబాటులోకి వస్తుంది.

పోకో X8 ప్రో సిరీస్‌ :
ఈ సిరీస్‌ (Poco X8 Pro Series) ఫోన్లు భారత్ సహా గ్లోబల్‌ మార్కెట్‌లో ఫిబ్రవరిలో లాంచ్ కానుందని భావిస్తున్నారు. ఇందులో భాగంగా పోకో X8 ప్రో, పోకో X8 ప్రో మ్యాక్స్ మోడల్‌ లాంచ్ కానున్నాయని తెలుస్తోంది. రెడ్‌మి టర్బో 5 సిరీస్‌ కు రీబ్రాండెడ్‌ వేరియంట్‌గా వచ్చే అవకాశం ఉంది.

టెక్నో పోకో కర్వ్‌ 2 స్మార్ట్‌ఫోన్‌ :
ఈ ఫోన్‌ (Tecno Poco Curve 2 Smartphone) టీజర్ ఇటీవలే విడుదల అయింది. కర్వడ్‌ ఎడ్జ్‌ డిజైన్‌ను కలిగి ఉంటుంది. కొన్ని రిపోర్టులు, లిస్టింగ్స్‌ ఆధారంగా మీడియాటెక్ డైమెన్సిటీ 7100 SoC చిప్‌సెట్‌, ఆండ్రాయిడ్‌ 16 పైన పనిచేస్తుందని తెలుస్తోంది. ఈ హ్యాండ్‌సెట్‌ ఏకంగా 7750mAh బ్యాటరీ తో లాంచ్‌ కానుందని అంచనా వేస్తున్నారు.

Best Mobiles in India

English summary
smartphones launches in february 2026 in india here is the list
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X