Home
Mobile

స్మార్ట్‌ఫోన్‌ కొనుగోలు చేయాలనుకుంటున్నారా.. జనవరిలో విడుదల కానున్న ఫోన్లు ఇవే.. లిస్ట్‌!

2023 సంవత్సరం మరికొన్ని రోజుల్లో ముగిసి.. కొత్త సంవత్సరం ప్రారంభం కానుంది. ఈ సంవత్సరం మాదిరిగానే నూతన సంవత్సరంలోనూ అనేక కొత్త స్మార్ట్‌ఫోన్లు లాంచ్‌ (Smartphones launches in january 2024) కానున్నాయి. ఈ జాబితాలో ప్రముఖ సంస్థలైన శాంసంగ్‌, వివో, వన్‌ప్లస్‌ రెడ్‌మీ, ఆసుస్ వంటి అనేక ఫోన్లు ఉన్నాయి. ఆయా స్మార్ట్‌ఫోన్ల స్పెసిఫికేషన్లు, ఫీచర్లు, ధరల పూర్తి వివరాలు మీకోసం.

వివో X100 సిరీస్‌: Vivo X100 సిరీస్‌ స్మార్ట్‌ఫోన్‌లను త్వరలో విడుదల చేయనున్నట్లు వివో ఇప్పటికే అధికారికంగా ప్రకటన చేసింది. జనవరి 2024లో విడుదలయ్యే అవకాశం ఉంది. ఈ ఫోన్‌ మీడియాటెక్ డైమెన్సిటీ 9300 SoC పైన పనిచేస్తుంది. ఈ ప్రాసెసర్‌ మెరుగైన పనితీరును కనబరుస్తుంది. ఈ సిరీస్‌ స్మార్ట్‌ఫోన్లు వివో X100 మరియు X100 ప్రో హ్యాండ్‌సెట్లు వెనుకవైపు ట్రిపుల్‌ కెమెరాలను కలిగి ఉంటాయి.

vivo X100

ఈ కెమెరాలు అత్యంత నాణ్యమైన ఫొటోగ్రఫీ అనుభూతిని ఇస్తుందని తెలుస్తోంది. ఈ కెమెరా సిస్టమ్ V3 ఇమేజింగ్ చిప్‌తో రానున్నాయి. మరియు ఈ వివో కొత్త స్మార్ట్‌ఫోన్లు 8T LTPO డిస్‌ప్లేను కలిగి ఉంటాయని తెలుస్తోంది. వినియోగదారులకు మెరుగైన అనుభూతిని కలిగిస్తాయని తెలుస్తోంది.

శాంసంగ్‌ గెలాక్సీ S24 సిరీస్‌ : ఈ శాంసంగ్‌ స్మార్ట్‌ఫోన్‌ జనవరి 17న లాంచ్‌ అయ్యే అవకాశం ఉంది. ఈ సిరీస్‌ మూడు మోడళ్లను కలిగి ఉంటుంది. S24, S24 ప్లస్‌, S24 అల్ట్రా ఫోన్లు అందుబాటులోకి రానున్నాయి. ఈ మూడు హ్యాండ్‌సెట్‌లు క్వాల్‌కాం స్నాప్‌డ్రాగన్‌ 8 జెన్‌ 3 ప్రాసెసర్‌ను కలిగి ఉంటుంది.

కెమెరా విభాగం విషయానికి వస్తే శాంసంగ్‌ గెలాక్సీ S24 అల్ట్రా స్మార్ట్‌ఫోన్‌ 200MP ప్రధాన కెమెరాను కలిగి ఉంటుంది. అదే S24, S24 ప్లస్‌ హ్యాండ్‌సెట్లు 50MP ప్రధాన కెమెరాను కలిగి ఉంటాయి. ఈ ఫోన్లు 10MP టెలీఫొటో లెన్స్‌ను కలిగి ఉంటుంది. దీంతోపాటు మూడు మోడల్‌ ఫోన్లు 12MP అల్ట్రావైడ్‌ లెన్స్‌లతో రానున్నాయి. మరియు 12MP సెల్ఫీ కెమెరాను కలిగి ఉంటాయి.

vivo X100

రెడ్‌మీ నోట్‌ 13 5G సిరీస్‌ : రెడ్‌మీ నోట్‌ 13 5G సిరీస్‌ ఫోన్లు జనవరి 4న విడుదల కానున్నాయి. లీక్‌ అయిన వివరాల ఆధారంగా ఈ ఫోన్‌ 2400*1080 పిక్సల్‌ రిజల్యూషన్‌తో 6.67 అంగుళాల అమోలెడ్‌ డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. మరియు 120Hz రీఫ్రెష్‌ రేట్‌, 240Hz టచ్‌ శాంప్లింగ్‌ రేట్‌తో రానున్నాయి.

ఈ రెడ్‌మీ స్మార్ట్‌ఫోన్‌ 6nm మీడియాటెక్‌ డైమెన్సిటీ 6080 చిప్‌సెట్‌ను కలిగి ఉంటాయని తెలుస్తోంది. Mali- G57 MC2 GPU చిప్‌ మెరుగైన గ్రాఫిక్స్‌ను అందిస్తుంది. 8GB ర్యామ్‌తో LPDDR4X మరియు 256GB స్టోరేజీ వరకు UFS 2.2 తో జతచేయబడుతుంది.

కెమెరా విభాగం విషయానికి వస్తే.. 108MP ప్రధాన కెమెరా, 8MP అల్ట్రావైడ్‌ లెన్స్‌, 2MP మ్యాక్రో సెన్సార్‌ను కలిగి ఉంటుంది. దీంతోపాటు ఈ రెడ్‌మీ నోట్‌ 13 5G స్మార్ట్‌ఫోన్‌ సెల్ఫీ, వీడియో కాల్స్‌ కోసం 16MP కెమెరాను కలిగి ఉంటుంది.

వన్‌ప్ల్‌ 12 స్మార్ట్‌ఫోన్‌: వన్‌ప్లస్‌ 12 జనవరి 23న భారత్‌లో అధికారికంగా ప్రారంభం కానుంది. ఈ ఫోన్‌ డిసెంబర్ 5న చైనాలో లాంచ్‌ అయింది. 12GB ర్యామ్‌ + 256GB అంతర్గత స్టోరేజీ, 16GB ర్యామ్‌+ 512GB స్టోరేజీ, 16GB ర్యామ్‌+ 1TB స్టోరేజీతో రానుంది. వన్‌ప్లస్‌ తొలిసారిగా స్నాప్‌డ్రాగన్‌ 8 జెన్‌ 3 చిప్‌సెట్‌ ప్రాసెసర్‌ను కలిగి ఉంటుంది.

ఆసుస్ ROG 8 సిరీస్‌ : ఈ స్మార్ట్‌ఫోన్‌ను జనవరి 9న ప్రపంచవ్యాప్తంగా లాంచ్‌ చేస్తామని ఆసుస్‌ సంస్థ ఇప్పటికే ప్రకటన చేసింది. జనవరి 9న జరగనున్న కన్జ్యూమర్‌ ఎలక్ట్రానిక్స్‌ షో కార్యక్రమంలో విడుదల చేస్తామని తెలిపింది. లీక్‌ అయిన వివరాల ఆధారంగా ఈ ఫోన్ బాక్సీ డిజైన్, పంచ్‌ హోల్ డిస్‌ప్లేను కలిగి ఉంటుంది.

దీంతోపాటు ఆసుస్‌ ROG ఫోన్‌ 8 సిరీస్‌ ఆండ్రాయిడ్‌ 14 ఆధారిత ROG UIని కలిగి ఉంటుంది. మరియు 6.78 అంగుళాల పుల్‌ HD+ అమోలెడ్‌ డిస్‌ప్లే సహా కార్నింగ్‌ గొరెల్లా క్లాస్‌ విక్టస్‌ 2 భద్రతతో వస్తుంది. మరియు ROG ఫోన్‌ 8 ప్రో 165Hz రీప్రెష్‌ రేట్‌ సహా HDR10 సపోర్టుతో వస్తుంది.

More from GizBot

Best Mobiles in India

English summary
Smartphones launches in January 2024 here are the features
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X