జనవరి నెలలో ఏయే స్మార్ట్‌ఫోన్‌లు విడుదల కానున్నాయో తెలుసా.. లిస్ట్, స్పెసిఫికేషన్‌లు, ఫీచర్‌లు..!
భారత్ మార్కెట్‌లో 2024 సంవత్సరంలో అనేక స్మార్ట్‌ఫోన్‌లు లాంచ్ అయ్యాయి. 2025 లోనూ వివిధ బ్రాండ్‌లు తమ ఉత్పత్తులను విడుదల చేసేందుకు సిద్ధం అవుతున్నాయి. జనవరి నెలలో కొన్ని స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థలు తమ హ్యాండ్‌సెట్‌ల విడుదల తేదీని ఇప్పటికే ప్రకటన చేశాయి. ఈ జాబితాలో శాంసంగ్, వన్‌ప్లస్, రియల్‌మి, పోకో వంటి సంస్థలు ఉన్నాయి. త్వరలో మరిన్ని స్మార్ట్‌ఫోన్‌ల జాబితా కూడా విడుదల అయ్యే అవకాశం ఉంది.
వన్‌ప్లస్ 13 సిరీస్ : ఈ సిరీస్‌లో (OnePlus 13 series) భాగంగా వన్‌ప్లస్ 13 మరియు వన్‌ప్లస్ 13R స్మార్ట్‌ఫోన్‌లు విడుదల కానున్నాయి. ఈ రెండు ఫోన్‌లు జనవరి 7 వ తేదీన భారత్‌లో లాంచ్ కానున్నాయి. వన్‌ప్లస్ 13 స్మార్ట్‌ఫోన్ స్నాప్‌డ్రాగన్ 8 Elite చిప్‌సెట్ తో పనిచేస్తుంది. అదే వన్‌ప్లస్ 13R స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 3 ప్రాసెసర్ ను కలిగి ఉంటుంది. లైఫ్‌టైం డిస్‌ప్లే వారంటీని అందిస్తున్నట్లు వన్‌ప్లస్ తెలిపింది.

వన్‌ప్లస్ 13 ఫోన్ 120Hz రీఫ్రెష్ రేట్‌తో కూడిన LTPO 4.1 టెక్నాలజీతో 2K డిస్‌ప్లేను కలిగి ఉంది. ఈ డిస్‌ప్లే ఆక్వాటచ్ 2.0 ఫీచర్‌ను సపోర్టు చేస్తుంది. వన్‌ప్లస్ 13 హ్యాండ్‌సెట్ AI డిటేల్ బూస్ట్, AI అన్‌బ్లర్, AI రిఫ్లక్షన్ ఎరేజర్ వంటి ఫీచర్‌ను కలిగి ఉంటుంది. ఈ ఫోన్ 100W వైర్ ఫాస్ట్ ఛార్జింగ్, 50W వైర్‌లెస్ ఛార్జింగ్ సపోర్టుతో 6000mAh బ్యాటరీతో పనిచేస్తుంది. దీంతోపాటు ట్రిపుల్ కెమెరాలను కలిగి ఉంది. అదే వన్‌ప్లస్ 13R స్మార్ట్‌ఫోన్ 6400mAh బ్యాటరీతో పనిచేస్తుంది.
పోకో X7 సిరీస్ : ఈ సిరీస్ (Poco X7 Series) జనవరి 9వ తేదీన విడుదల కానుంది. ఈ సిరీస్‌లో భాగంగా పోకో X7, పోకో X7 ప్రో హ్యాండ్‌సెట్‌లు అందుబాటులోకి రానున్నాయి. బేస్ వేరియంట్ 6.67 అంగుళాల 1.5K రిజల్యూషన్ డిస్‌ప్లే, ప్రో మోడల్ 6.67 అంగుళాల క్రిస్టల్Rez 1.5K అమోలెడ్ డిస్‌ప్లేను కలిగి ఉండే అవకాశం ఉంది.
బేస్ వేరియంట్ మీడియాటెక్ డైమెన్సిటీ 7300 అల్ట్రా చిప్‌సెట్, మీడియాటెక్ డైమెన్సిటీ 8400 అల్ట్రా SoC ప్రాసెసర్‌తో పనిచేస్తాయని తెలుస్తోంది. ఆండ్రాయిడ్ 15 ఆధారిత HyperOS 2.0 తో పనిచేస్తుంది. రెండు మోడళ్లు 50MP ప్రైమరీ కెమెరాను కలిగి ఉండే అవకాశం ఉంది.
శాంసంగ్ గెలాక్సీ S25 సిరీస్ : ఈ సిరీస్ స్మార్ట్‌ఫోన్‌లు (Samsung Galaxy S25 Series) జనవరి 22 న విడుదల అయ్యే అవకాశం ఉంది. ఈ సిరీస్‌లో భాగంగా గెలాక్సీ S25, గెలాక్సీ S25 ప్లస్, గెలాక్సీ S25 అల్ట్రా మోడళ్లు అందుబాటులోకి రానున్నాయి. ఈ సిరీస్ హై ఎండ్ వేరియంట్ స్నాప్‌డ్రాగన్ 8 Elite చిప్‌సెట్‌తో పనిచేసే అవకాశం ఉంది.
రియల్‌మి 14 ప్రో స్మార్ట్‌ఫోన్ : ఈ హ్యాండ్‌సెట్ (Realme 14 Pro 5G) ఈ నెలలోనే విడుదల కానుంది. విడుదల తేదీ త్వరలో వెల్లడయ్యే అవకాశం ఉంది. అయితే ఈ ఫోన్ నాణ్యమైన కెమెరాలను కలిగి ఉంటుందని తెలుస్తోంది. దీంతోపాటు IP69 రేటింగ్‌తో కూడిన డస్ట్ మరియు వాటర్ రెసిస్టెన్స్‌తో అందుబాటులోకి రానుంది.
ఒప్పో రెనో 13 5G సిరీస్ : ఈ సిరీస్‌లో భాగంగా (Oppo Reno 13 5G Series) ఒప్పో రెనో 13 మరియు ఒప్పో రెనో 13 ప్రో 5G మోడళ్లు అందుబాటులోకి రానున్నాయి. మిడ్ రేంజ్ ధర సెగ్మెంట్‌లో విడుదల కానున్నాయి. రెండు వేరియంట్‌లు మీడియాటెక్ డైమెన్సిటీ 8350 చిప్‌సెట్‌తో పనిచేస్తాయని తెలుస్తోంది.


Click it and Unblock the Notifications