Home
Mobile

జూన్‌ నెలలో విడుదల కానున్న స్మార్ట్‌ఫోన్‌ల లిస్ట్‌ ఇదే.. స్పెసిఫికేషన్‌లు, లాంచ్‌ వివరాలు..!

స్మార్ట్‌ఫోన్‌ మార్కెట్‌ గణనీయంగా వృద్ధి చెందుతోంది. వినియోగదారుల అవసరాలకు అనుగుణంగా స్మార్ట్‌ఫోన్‌ తయారీ సంస్థలు కూడా వివిధ మోడళ్లను విడుదల చేస్తున్నాయి. మే నెలలో అనేక స్మార్ట్‌ఫోన్‌లను విడుదల చేశాయి. శాంసంగ్‌ గెలాక్సీ F55, టెక్నో కెమెన్ 30, పోకో F6, రియల్‌మి GT 6T, ఇన్ఫినిక్స్‌ GT 20 ప్రో వంటి స్మార్ట్‌ఫోన్‌లు లాంచ్‌ అయ్యాయి. అయితే జూన్‌లోనే అనేక హ్యాండ్‌సెట్‌లు (Upcoming Smartphones in June) విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. షియోమీ, వివో వంటి సంస్థలు తమ ఫ్లాగ్‌షిప్‌ మోడళ్లను భారత్‌లో లాంచ్‌ చేయనున్నట్లు తెలుస్తోంది.

వివో X ఫోల్డ్‌ 3 ప్రో స్మార్ట్‌ఫోన్‌ : వివో సంస్థ భారత్‌లో తన తొలి ఫోల్డబుల్‌ స్మార్ట్‌ఫోన్‌ X ఫోల్డ్‌ 3 ప్రోను జూన్ 6న విడుదల చేస్తున్నట్లు ఇప్పటికే ప్రకటన చేసింది. ఈ హ్యాండ్‌సెట్‌ 8.03 అంగుళాల LTPO అమోలెడ్‌ ఇన్నర్‌ డిస్‌ప్లేను కలిగి ఉంటుందని తెలుస్తోంది. మరియు 6.53 అంగుళాల ఔటర్‌ డిస్‌ప్లేను కలిగి ఉంటుందని పేర్కొంది.

vivo X fold 3 pro

దీంతోపాటు ఈ హ్యాండ్‌సెట్‌ 4nm క్వాల్‌కాం స్నాప్‌ డ్రాగన్‌ 8 జెన్‌ 3 చిప్‌సెట్‌ పైన పనిచేస్తుందని తెలిపింది. మరియు Adreno 750 GPU తో జతచేయబడి ఉంటుందని తెలుస్తోంది. ఈ హ్యాండ్‌సెట్ 16GB LPDDR5X ర్యామ్ మరియు 1TB UFS 4.0 UFS స్టోరేజీని కలిగి ఉంటుంది.

షియోమీ 14 CIVI : షియోమీ సంస్థ భారత్‌లో జూన్‌ 12న షియోమీ 14 సివీ స్మార్ట్‌ఫోన్‌ లాంచ్‌ కానుంది. ఈ హ్యాండ్‌సెట్ 6.55 అంగుళాల 12 బిట్‌ OLED డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. మరియు 120Hz రీఫ్రెష్‌ రేట్‌, 3000 నిట్స్‌ గరిష్ఠ బ్రైట్‌నెస్‌తో రానుంది. డిస్‌ప్లే రక్షణ కోసం కార్నింగ్‌ గొరిల్లా గ్లాస్‌ విక్టస్‌ 2 రక్షణను కలిగి ఉంటుంది.

దీంతోపాటు ఈ హ్యాండ్‌సెట్ క్వాల్‌కాం స్నాప్‌ డ్రాగన్‌ 8s జెన్‌ చిప్‌సెట్‌ పైన పనిచేస్తుంది. మరియు Adreno 735 GPU తో జతచేయబడుతుంది. ఈ హ్యాండ్‌సెట్ 16GB LPDDR5X ర్యామ్‌ మరియు 512GB UFS 4.0 స్టోరేజీని కలిగి ఉంటుందని తెలుస్తోంది.

రియల్‌మి GT 6 : ఇటీవల వచ్చిన సమాచారం ఆధారంగా ఈ స్మార్ట్‌ఫోన్‌ త్వరలో భారత్‌ సహా అనేక దేశాల్లో విడుదల కానుంది. అన్ని కొన్ని నివేదికల ప్రకారం జూన్‌ 20న ప్రపంచవ్యాప్తంగా లాంచ్‌ కానుందని తెలుస్తోంది. అయితే రియల్‌మి సంస్థ ఈ హ్యాండ్‌సెట్ సంబంధించిన స్పెసిఫికేషన్‌లు, లాంచ్‌ వివరాలు వెల్లడించలేదు.

vivo X fold 3 pro

పోకో M6 ప్లస్‌ : ఈ హ్యాండ్‌సెట్‌ ఇటీవలే బ్యూరో ఆఫ్‌ ఇండియన్‌ స్టాండర్డ్స్‌ (BIS) సర్టిఫికేషన్‌ వెబ్‌సైట్‌లో కనిపించింది. దీని ఆధారంగా త్వరలో లాంచ్‌ కానుందని తెలుస్తోంది. ఈ హ్యాండ్‌సెట్‌ 120Hz రీఫ్రెష్‌ రేట్‌తో 6.79 అంగుళాల పుల్‌ HD+ LCD డిస్‌ప్లేను కలిగి ఉంటుందని తెలుస్తోంది. మరియు 50MP+2MP వెనుక కెమెరాలు మరియు 8MP సెల్ఫీ కెమెరాను కలిగి ఉంటుందని తెలుస్తోంది.

హానర్‌ 200, మేజిక్‌ 6 ప్రో స్మా్ర్ట్‌ఫోన్‌ : హానర్ 200 మరియు మేజిక్‌ 6 ప్రో హ్యాండ్‌సెట్‌లు త్వరలో లాంచ్‌ కానున్నాయి. హానర్‌ మేజిక్‌ 6 ప్రో 6.8 అంగుళాల పుల్‌ HD+ కర్వడ్‌ OLED డిస్‌ప్లే కలిగి ఉంటుందని తెలుస్తోంది. మరియు క్వాల్‌కాం స్నాప్‌ డ్రాగన్ 8 జెన్‌ 3 చిప్‌సెట్‌ ను కలిగి ఉంటుంది. మరియు Adreno 750 GPU చిప్‌తో జతచేయబడి ఉంటుంది.

హానర్‌ 200 సిరీస్‌ ఇటీవలే చైనాలో లాంచ్‌ అయింది. భారత్‌లోనూ త్వరలో లాంచ్‌ కానుంది. హానర్‌ 200 స్మార్ట్‌ఫోన్‌ 6.7 అంగుళాల పుల్‌ HD+ కర్వడ్‌ OLED డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. క్వాల్‌కాం స్నాప్‌ డ్రాగన్‌ 7 జెన్‌ 3 చిప్‌సెట్‌ పైన పనిచేస్తుంది. Adreno 720 GPU తో జతచేయబడి ఉంటుంది. 16GB ర్యామ్ మరియు 512GB స్టోరేజీని కలిగి ఉంటుంది.

Best Mobiles in India

English summary
smartphones launching in june 2024 in india here is the list and details
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X