Home
Mobile

కొత్త స్మార్ట్‌ఫోన్‌ల కోసం ఎదురుచూస్తున్నారా.. జూన్‌ నెలలో విడుదలయ్యే ఫోన్‌ల లిస్ట్‌ ఇదిగో..!

Smartphone Launches in June 2025 : భారత్‌ మార్కెట్లో మే నెలలో అనేక ఫోన్‌లు లాంచ్‌ అయ్యాయి. జూన్‌లో మరిన్ని ఫోన్‌లు విడుదల అయ్యేందుకు సిద్ధంగా ఉన్నాయి. ఇందులో వన్‌ప్లస్‌, షియోమీ, మోటోరోలా, పోకో, ఇన్ఫినిక్స్‌, ఒప్పో, వివో వంటి అనేక బ్రాండ్‌ల ఫోన్‌లు విడుదల కానున్నాయి. ఈ ఫోన్‌కు సంబంధించిన అనేక వివరాలు ఇప్పటికే వెల్లడయ్యాయి. ఈ ఫోన్‌ల విడుదల తేదీ స్పెసిఫికేషన్‌లు, ఫీచర్‌ల పూర్తి వివరాలు. త్వరలో మరిన్ని వివరాలు వెల్లడయ్యే అవకాశం కూడా ఉంది.

ఇన్ఫినిక్స్ GT 30 ప్రో :
ఈ ఫోన్‌ భారత్‌ మార్కెట్‌లో (Infinix GT 30 Pro) జూన్‌ 3 వ తేదీ లాంచ్‌ కానుంది. గేమింగ్‌ను దృష్టిలో పెట్టుకొని ఈ ఫోన్‌ను విడుదల చేస్తున్నారు. ఈ హ్యాండ్‌సెట్‌ 144Hz రీఫ్రెష్‌ రేట్‌తో 6.78 అంగుళాల 1.5K అమోలెడ్‌ డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. మరియు 45W వైర్‌, 30W వైర్‌లెస్‌ ఛార్జింగ్‌ సపోర్టుతో 5500mAh బ్యాటరీ, 108MP కెమెరాను కలిగి ఉంటుందని తెలుస్తోంది. రూ.25 వేల ధర రేంజ్‌లో అందుబాటులోకి వస్తుందని భావిస్తున్నారు.

Smartphone Launches in June 2025

వన్‌ప్లస్‌ 13s :
ఈ హ్యాండ్‌సెట్‌ (OnePlus 13s) జూన్‌ 5 వ తేదీన విడుదల కానుంది. ఈ ఫోన్ 6.32 అంగుళాల 1.5K OLED డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. ఈ ఫోన్ శక్తివంతమైన స్నాప్‌డ్రాగన్ 8 Elite చిప్‌సెట్‌ను కలిగి ఉంటుంది. మరియు 90W ఛార్జింగ్‌ సపోర్టుతో 6260mAh బ్యాటరీతో పనిచేస్తుంది.

ఈ ఫోన్‌ 50MP ప్రైమరీ కెమెరాతోపాటు 16MP సెల్ఫీ కెమెరాను కలిగి ఉంటుంది. ఈ ఫోన్‌ ప్రత్యేకంగా ప్లస్‌ కీ ను కలిగి ఉంటుంది. ఈ వన్‌ప్లస్ 13s స్మార్ట్‌ఫోన్‌ భారత్‌ మార్కెట్‌లో రూ.50 వేల నుంచి రూ.55 వేల ధరలో అందుబాటులోకి రానుందని తెలుస్తోంది.

వివో T4 అల్ట్రా :
వివో T4 సిరీస్‌లో (Vivo T4 Ultra) భాగంగా ఈ T4 అల్ట్రా వేరియంట్‌ విడుదల కానుంది. అయితే కచ్చితమైన విడుదల తేదీ వెల్లడి కాలేదు. ఈ ఫోన్‌ 6.67 అంగుళాల pOLED డిస్‌ప్లే, మీడియాటెక్ డైమెన్సిటీ 9300 చిప్‌సెట్ పనిచేస్తుందని భావిస్తున్నారు. రెండు 50MP కెమెరాలను కలిగి ఉండే అవకాశం ఉంది. మరిన్ని వివరాలు త్వరలో వెల్లడయ్యే అవకాశం ఉంది.

ఒప్పో రెనో 14 సిరీస్‌ :
ఈ సిరీస్‌ ఇటీవలే చైనాలో అందుబాటులోకి వచ్చింది. ఈ సిరీస్‌లో (Oppo Reno 14 Series) భాగంగా ఒప్పో రెనో 14, ఒప్పో రెనో 14 ప్రో మోడల్స్‌ లాంచ్‌ కానున్నాయి. భారత్‌లో ఈ సిరీస్‌ ట్రిపుల్‌ కెమెరాలను కలిగి ఉంటుంది. దీంతోపాటు అనేక మెరుగైన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌ ఫీచర్‌లతో లాంచ్‌ కానుందని భావిస్తున్నారు. అయితే ఈ ఫోన్‌ ఫీచర్‌లు, స్పెసిఫికేషన్‌ల వివరాలు తెలియాల్సి ఉంది. దీంతోపాటు విడుదల తేదీ వెల్లడి కావాల్సి ఉంది.

Take a Poll

పోకో F7 5G :
ఈ ఫోన్ ఇటీవలే యూఎస్‌ ఫెడరల్‌ కమ్యూనికేషన్స్‌ కమిషన్‌ వెబ్‌సైట్‌లో కనిపించింది. దీని ఆధారంగా గ్లోబల్‌గా లాంచ్ కానుందని తెలుస్తోంది. పోకో F7 స్మార్ట్‌ఫోన్‌ (Poco F7 5G).. రెడ్‌మి టర్బో 4 ప్రో హ్యాండ్‌సెట్‌కు రీబ్రాండెడ్‌ వెర్షన్‌గా లాంచ్‌ కానుందని భావిస్తున్నారు. ఇదే నిజమైతే పోకో ఫోన్‌ స్నాప్‌డ్రాగన్ 8s జెన్‌ 4 చిప్‌సెట్‌తో పనిచేస్తుంది.

మరియు ఈ ఫోన్‌ 7550mAh భారీ బ్యాటరీతో అందుబాటులోకి రానుందని భావిస్తున్నారు. మరియు 1.5K OLED డిస్‌ప్లేతో విడుదల కానుందని తెలుస్తోంది. ఈ ఫోన్‌ కచ్చితమైన విడుదల తేదీ వివరాలు వెల్లడి కాలేదు. త్వరలోనే మరిన్ని వివరాలు వెల్లడయ్యే అవకాశం ఉంది.

మోటోరోలా ఎడ్జ్‌ 60 :
భారత్‌ మార్కెట్‌లో మోటోరోలా ఎడ్జ్‌ 60 సిరీస్‌లో (Motorola Edge 60) భాగంగా ఇప్పటికే ఎడ్జ్‌ 60 ఫ్యూజన్‌, ఎడ్జ్‌ 60 స్టైలస్‌, ఎడ్జ్‌ 60 ప్రో మోడల్స్‌ లాంచ్‌ అయ్యాయి. జూన్‌ రెండు లేదా మూడో వారంలో మోటో ఫోన్‌ విడుదల అయ్యే అవకాశం ఉంది. ఈ ఫోన్ స్నాప్‌డ్రాగన్ 7 జెన్‌ 3 చిప్‌సెట్‌, 6000mAh బ్యాటరీతో పనిచేస్తుందని భావిస్తున్నారు.

వన్‌ప్లస్‌ నార్డ్ CE 5 :
ఈ ఫోన్‌ (OnePlus Nord CE5 మీడియాటెక్‌ డైమెన్సిటీ 9400e చిప్‌సెట్‌తో పనిచేస్తుందని తెలుస్తోంది. ఈ ఫోన్‌ 100W ఫాస్ట్‌ ఛార్జింగ్ సపోర్టుతో 5500mAh బ్యాటరీతో అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. మరియు 6.7 అంగుళాల అమోలెడ్ డిస్‌ప్లే, 50MP ప్రైమరీ కెమెరాతో లాంచ్ కానుందని భావిస్తున్నారు.

ఒప్పో K13 టర్బో :
ఈ స్మార్ట్‌ఫోన్ 7300mAh భారీ బ్యాటరీతో (Oppo K13) లాంచ్‌ కానుందని తెలుస్తోంది. మరియు స్నాప్‌డ్రాగన్‌ 8s జెన్ 4 చిప్‌సెట్‌ను కలిగి ఉంటుందని తెలుస్తోంది. గేమింగ్‌ కోసం ప్రత్యేకంగా ఇన్‌బిల్ట్‌ కూలింగ్ ఫ్యాన్‌ను కలిగి ఉంటుందని సమాచారం. దీంతోపాటు కస్టమైజబుల్‌ RCB లైట్స్‌ కూడా అందించనున్నారని తెలుస్తోంది.

వివో X200 FE :
ఈ స్మార్ట్‌ఫోన్ (Vivo X200 FE) ఇప్పటికే అనేక సర్టిఫికేషన్‌ వెబ్‌సైట్స్‌లో కనిపించింది. ఈ ఫోన్ మీడియాటెక్‌ డైమెన్సిటీ 9400e చిప్‌సెట్‌తో పనిచేస్తుందని భావిస్తున్నారు. మరియు 6.31 అంగుళాల LTPO OLED డిస్‌ప్లేతో అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. 90W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్టుతో 6500mAh తో పనిచేస్తుందని భావిస్తున్నారు.

More from GizBot

Best Mobiles in India

English summary
smartphones launching in june 2025 in india here is the list and specifications and features
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X