Home
Mobile

Upcoming Smartphones in April ఈ వారంలో విడుదల కానున్న ఒక స్మార్ట్‌ఫోన్‌లో ప్రత్యేకత ఉంది.. మీకు తెలుసా?

భారత్‌ స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థలకు పెద్ద మార్కెట్‌గా ఉంది. దేశంలో ఇప్పటికే భారీ సంఖ్యలో స్మార్ట్‌ఫోన్‌ యూజర్‌లు ఉన్నారు. ఈ సంవత్సరం ఇప్పటికే అనేక ఫోన్‌లు విడుదల అయ్యాయి. మొదటి మూడు నెలల్లో శాంసంగ్‌ ఎక్కువ హ్యాండ్‌సెట్‌లను లాంచ్‌ చేసింది. ఏప్రిల్‌లోనూ (Upcoming Smartphones in April) ఎక్కువ ఫోన్లు అందుబాటులోకి రానున్నాయి. ఇప్పటికే వివిధ సంస్థలు లాంచ్ తేదీలను ప్రకటన చేశాయి. ఇప్పటి వరకు అందుబాటులో ఉన్న వివరాల ఆధారంగా ఈ వారంలో మూడు సంస్థల ఫోన్‌లు విడుదల కానున్నాయి. అయితే ఈ ఫోన్‌లలో ఓ ప్రత్యేకత ఉంది.

ఈ వారంలో ఏయే ఫోన్‌లు లాంచ్ కానున్నాయి? :
ఈ వారంలో రియల్‌మి నార్జో 80 సిరీస్‌, వివో V50e స్మార్ట్‌ఫోన్‌, ఐకూ Z10 సిరీస్‌ భారత్‌లో విడుదల కానున్నాయి. రియల్‌మి నార్జో 80 సిరీస్‌లో భాగంగా నార్జో 80 ప్రో, నార్జో 80x హ్యాండ్‌సెట్‌లు మరియు ఐకూ Z10 సిరీస్‌లో భాగంగా ఐకూ Z10 తోపాటు Z10x ఫోన్‌లు లాంచ్‌ కానున్నాయి.

Smartphones launching in this week

రియల్‌మి ఫోన్‌లు :
రియల్‌మి నార్జో 80 ప్రో, 80X స్మార్ట్‌ఫోన్‌లు (Realme Narzo 80 Series) ఏప్రిల్‌ 9వ తేదీన విడుదల కానున్నాయి. ఇప్పటికే ఈ ఫోన్‌లకు సంబంధించిన అనేక వివరాలు వెల్లడయ్యాయి. నార్జో 80 ప్రో 7.5mm థిక్‌నెస్‌తో స్లీక్‌ డిజైన్‌, ఈ డిస్‌ప్లే 4500 నిట్స్‌ గరిష్ఠ బ్రైట్‌నెస్‌ను కలిగి ఉంటుంది. మీడియాటెక్‌ డైమెన్సిటీ 7400 SoC చిప్‌సెట్‌తో పనిచేస్తుంది. 6050mm2 VC కూలింగ్ సిస్టమ్‌ను కలిగి ఉంటుంది. 80W ఫాస్ట్‌ ఛార్జింగ్ సామర్థ్యంతో 6000mAh బ్యాటరీని కలిగి ఉంటుందని పేర్కొంది. ఈ ఫోన్ రూ.20 వేల ధరలో అందుబాటులోకి రానుంది.

రియల్‌ నార్జో 80x 5G స్మార్ట్‌ఫోన్‌ 120Hz రీఫ్రెష్‌ రేట్‌ డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. మిలిటరీ గ్రేడ్‌ సర్టిఫికేషన్‌తోపాటు, IP69 రేటింగ్‌తో డస్ట్ మరియు వాటర్‌ రెసిస్టెంట్‌గా అందుబాటులోకి రానుంది. మీడియాటెక్‌ డైమెన్సిటీ 6400 SoC చిప్‌సెట్‌తో లాంచ్ కానుందని రియల్‌మి తెలిపింది. 45W ఫాస్ట్‌ ఛార్జింగ్ సపోర్టుతో 6000mAh బ్యాటరీని కలిగి ఉంటుంది. ఈ హ్యాండ్‌సెట్ ధర రూ.15 వేల ధర సెగ్మెంట్‌లో లభిస్తుందని రియల్‌మి తెలిపింది.

వివో హ్యాండ్‌సెట్ :
ఏప్రిల్‌ 10 మధ్యాహ్నం 12 గంటలకు వివో V50e స్మార్ట్‌ఫోన్‌ (Vivo V50e Smartphone) విడుదల కానుంది. క్వాడ్‌ కర్వడ్‌ డిస్‌ప్లే ను కలిగి ఉంటుంది. మరియు IP68, IP69 రేటింగ్‌తో డస్ట్‌. వాటర్ రెసిస్టెంట్‌గా ఉంటుందని తెలిపింది. AI Note Assist, AI Image Expander, సర్కిల్ టూ సెర్చ్ వంటి AI ఫీచర్‌లను కలిగి ఉంటుంది.

ఈ ఫోన్ 50MP సోనీ IMX882 (OIS) కెమెరాతోపాటు 116 డిగ్రీల ఫీల్డ్‌ వ్యూతో అల్ట్రావైడ్‌ యాంగిల్‌ లెన్స్‌, 50MP సెల్ఫీ కెమెరాను కలిగి ఉంటుంది. దీంతోపాటు వెనుక వైపు ఈ ఫోన్‌ సర్కులర్‌ Aura లైట్‌ను అమర్చి ఉంటుంది. లీక్స్‌ ఆధారంగా ఈ ఫోన్‌ ధర రూ.25,000 నుంచి రూ.30,000 మధ్య ఉండే అవకాశం ఉంది.

ఐకూ Z10 సిరీస్‌ ఫోన్‌లు :
ఐకూ నుంచి ఏప్రిల్‌ 11 న ఐకూ Z10 సిరీస్‌ (iQOO Z10 Series) ఫోన్‌ లాంచ్‌ కానుంది. ఐకూ Z10 ఫోన్‌ తొలిసారిగా ఏకంగా 7300mAh బ్యాటరీలో లాంచ్ కానుంది. మరియు ఐకూ Z10x హ్యాండ్‌సెట్ 6500mAh బ్యాటరీతో విడుదల కానుంది.

ఐకూ Z10x స్మార్ట్‌ఫోన్ మీడియాటెక్‌ డైమెన్సిటీ 7300 చిప్‌సెట్‌తో పనిచేస్తుందని రియల్‌మి తెలిపింది. అదే ఐకూ Z10 హ్యాండ్‌సెట్‌ స్నాప్‌డ్రాగన్‌ 7s జెన్‌ 3 చిప్‌సెట్‌తో లాంచ్‌ కానుంది. ఐకూ Z10 ఫోన్‌ ఏకంగా 5000 నిట్స్‌ పీక్ బ్రైట్‌నెస్‌తో క్వాడ్ కర్వడ్‌ డిస్‌ప్లేను కలిగి ఉంటుంది.

ఐకూ Z10 హ్యాండ్‌సెట్‌ భారత్ మార్కెట్‌లో సుమారుగా రూ.20 వేల ధరకు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. అదే ఐకూ Z10x ఫోన్‌ సుమారుగా రూ.15 వేల ధరకు లాంచ్‌ కానుందని తెలుస్తోంది. ఈ ఐకూ Z10 ఫోన్ భారీ బ్యాటరీతో లాంచ్ కానుంది. ఈ వారంలో విడుదల కానున్న ఫోన్‌లలో బ్యాటరీ పరంగా ఈ ఫోన్ ఆకట్టుకొనే అవకాశం ఉంది.

More from GizBot

Best Mobiles in India

English summary
Smartphones launching in this week, here is the most awaited smartphone with 7300mAh battery in india
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X