Home
Mobile

రూ.10,000 కంటే తక్కువ ధర కలిగిన 5G స్మార్ట్‌ఫోన్‌లు.. స్పెసిఫికేషన్‌లు, ఫీచర్‌లు, సేల్‌ వివరాలు..!

స్మార్ట్‌ఫోన్‌ మార్కెట్‌లో భారత్‌ మొదటి వరుసలో ఉంది. ప్రముఖ స్మార్ట్‌ఫోన్‌ తయారీ సంస్థలు భారత్‌లోనే తయారీ చేస్తున్నాయి. ఎంట్రీ లెవల్ నుంచి ప్లాగ్‌షిప్‌ వరకు ప్రస్తుతం అనేక హ్యాండ్‌సెట్‌లు అందుబాటలో ఉన్నాయి. అయితే భారత్‌ తరహా అభివృద్ధి చెందుతున్న దేశాల్లో ఎంట్రీ, మిడ్‌ రేంజ్‌ ఫోన్లకు భారీగా డిమాండ్‌ ఉంటుంది. ముఖ్యంగా రూ.10,000 లోపు ఫోన్లకు మంచి డిమాండ్ ఉంది. ఈ జాబితాలో రెడ్‌మి, రియల్‌మి, ఐకూ సహా అనేక బ్రాండ్లు ఎంట్రీ లెవల్ 5G స్మార్ట్‌ఫోన్‌లను (Smartphones Under RS10,000 Price) అందిస్తోంది.

మోటో G45 5G స్మార్ట్‌ఫోన్ :
మోటో G45 5G స్మార్ట్‌ఫోన్‌ 120Hz రీఫ్రెష్‌ రేట్, 1600*720 పిక్సల్‌ రిజల్యూషన్‌తో 6.45 అంగుళాల HD+ డిస్‌ప్లేను కలిగి ఉంది. మరియు 500 నిట్స్‌ గరిష్ఠ బ్రైట్‌నెస్‌తో అందుబాటులో ఉంది. డిస్‌ప్లే రక్షణ కోసం కార్నింగ్ గొరెల్లా గ్లాస్ 3 రక్షణను కలిగి ఉంటుంది. క్వాల్‌కామ్‌ స్నాప్‌డ్రాగన్‌ 6s జెన్‌ 3 ప్రాసెసర్‌, ఆండ్రాయిడ్ 14 ఆధారిత మోటోరోలా UX Skin పైన పనిచేస్తుంది.

Smartphones under RS10 000 price range in india

ఈ హ్యాండ్‌సెట్ ఒక OS అప్‌డేట్, 3 సంవత్సరాలపాటు సెక్యూరిటీ అప్‌డేట్‌లను పొందనుందని తెలిపింది. ఈ స్మార్ట్‌ఫోన్‌ 18W ఫాస్ట్‌ ఛార్జింగ్ సపోర్టుతో 5000mAh బ్యాటరీని కలిగి ఉంటుంది. 50MP+ 2MP కెమెరాలను కలిగి ఉంటుంది. అదే ముందువైపు 16MP సెల్ఫీ కెమెరాను కలిగి ఉంటుంది. ఈ హ్యాండ్‌సెట్‌ ప్రారంభ ధర రూ.9,999 గా ఉంది.

ఐకూ Z9 లైట్‌ 5G :
ఐకూ Z9 లైట్‌ 5G స్మార్ట్‌ఫోన్‌ 6.56 అంగుళాల HD+ డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. 90Hz రీఫ్రెష్‌ రేట్‌, 840 నిట్స్‌ గరిష్ఠ బ్రైట్‌నెస్‌తో అందుబాటులో ఉంది. ఈ హ్యాండ్‌సెట్ ఆండ్రాయిడ్‌ 14 ఆధారిత Funtouch OS 14, మీడియాటెక్‌ డైమెన్సిటీ 6300 చిప్‌సెట్‌ పైన పనిచేస్తుంది. 2 సంవత్సరాలపాటు OS అప్‌డేట్‌లు, 3 సంవత్సరాలపాటు సెక్యూరిటీ అప్‌డేట్‌లను పొందనుంది.

Smartphones under RS10 000 price range in india

కెమెరా విభాగం పరంగా 50MP ప్రైమరీ కెమెరా, 2MP డెప్త్‌ కెమెరాను కలిగి ఉంటుంది. మరియు 8MP సెల్ఫీ కెమెరాను కలిగి ఉంటుంది. భద్రత కోసం సైడ్‌ మౌంటెడ్‌ ఫింగర్‌ ప్రింట్‌ సెన్సార్‌ను కలిగి ఉంటుంది. ఈ స్మార్ట్‌ఫోన్‌ ప్రారంభ ధర రూ.10,498 గా ఉంది. ఎంపిక చేసిన బ్యాంకు కార్డుల ద్వారా రూ.500 తగ్గింపును పొందవచ్చు.

రియల్‌మి C63 5G :
రియల్‌మి C63 5G స్మార్ట్‌ఫోన్‌ 6.67 అంగుళాల HD+ డిస్‌ప్లేను కలిగి ఉంది. ఆక్టాకోర్ మీడియాటెక్‌ డైమెన్సిటీ 6300 ప్రాసెసర్‌, ఆండ్రాయిడి 14 ఆధారిత రియల్‌మి UI 5.0 పైన పనిచేస్తుంది. 10W ఛార్జింగ్‌ సపోర్టుతో 5000mAh బ్యాటరీని కలిగి ఉంది. ఈ హ్యాండ్‌సెట్ ధర రూ.10999 గా ఉంది. ఎంపిక చేసిన బ్యాంకు కార్డుల ద్వారా రూ.1000 తగ్గింపును పొందవచ్చు.

Smartphones under RS10 000 price range in india

ఇన్ఫినిక్స్‌ హాట్‌ 50 5G :
ఈ హ్యాండ్‌సెట్ 120Hz రీఫ్రెష్‌ రేట్‌తో 6.7 అంగుళాల HD+ LCD డిస్‌ప్లేను కలిగి ఉంది. ఆండ్రాయిడ్‌ 14 ఆధారిత XOS 14.5 OS పైన పనిచేస్తుంది. మీడియాటెక్‌ డైమెన్సిటీ 6300 Soc చిప్‌సెట్‌ను కలిగి ఉంటుంది. 18W ఫాస్ట్‌ ఛార్జింగ్‌ సపోర్టుతో 5000mAh బ్యాటరీపైన పనిచేస్తుంది.

ఇన్ఫినిక్స్ హాట్ 50 5G స్మార్ట్‌ఫోన్‌ 48MP సోనీ IMX582 కెమెరా, f/2.4 అపేచర్‌తో మరో AI కెమెరాను కలిగి ఉంటుంది. దీంతోపాటు డ్యూయల్‌ LED ఫ్లాష్‌ లైట్‌ను అమర్చారు. ఈ స్మార్ట్‌ఫోన్‌ 8MP కెమెరాను కలిగి ఉంది. ఈ స్మార్ట్‌ఫోన్‌ 4GB ర్యామ్ వేరియంట్ ధర రూ.9,999 గా ఉంది. ఎంపిక చేసిన బ్యాంకు కార్డుల ద్వారా రూ.1000 డిస్కౌంట్‌ను పొందవచ్చు.

Best Mobiles in India

English summary
Smartphones under RS10,000 price range in india specs and features and sale details
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X