ధర రూ.15,000 లో స్మార్ట్‌ఫోన్‌ల జాబితా.. స్పెసిఫికేషన్‌లు, ఫీచర్‌లు, సేల్ వివరాలు..!
స్మార్ట్ ఫోన్ మార్కెట్ లో భారత్ టాప్ లిస్ట్ లో ఉంది. అయితే స్మార్ట్ ఫోన్ వినియోగదారుల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. అయితే ఎంట్రీ లెవల్ ఫోన్ లతోపాటు బడ్జెట్ రేంజ్ హ్యాండ్‌సెట్ ల వైపు ఎక్కువ మంది మొగ్గు చూపుతున్నారు. అయితే ఈ ధరల రేంజ్ లో అనేక ఫోన్లు ఉన్నాయి. అయితే రూ.15000 ధర సెగ్మెంట్ లో (Smartphones Under RS15,000 Price) ప్రస్తుతం శాంసంగ్, మోటో, వివో, పోకో, CMF హ్యాండ్‌సెట్ లు ఉన్నాయి. ఈ స్మార్ట్‌ఫోన్ ల పూర్తి వివరాలు మీకోసం.
శాంసంగ్ గెలాక్సీ F15 5G : ఈ స్మార్ట్‌ఫోన్ 90Hz రీఫ్రెష్ రేట్ తో 6.5 అంగుళాల పుల్ HD+ సూపర్ అమోలెడ్ డిస్‌ప్లేను కలిగి ఉంది. మీడియాటెక్ డైమెన్సిటీ 6100+ ప్రాసెసర్ తో పనిచేస్తుంది. 6GB ర్యామ్, 128GB అంతర్గత స్టోరేజీతో జతచేయబడుతుంది. ఈ హ్యాండ్‌సెట్ 4GB ర్యామ్ + 128GB స్టోరేజీ వేరియంట్ ధర రూ.12,999 గా ఉంది.

మోటో G64 స్మార్ట్‌ఫోన్ : ఈ హ్యాండ్‌సెట్ 6.5 అంగుళాల FHD+ IPC LCD డిస్‌ప్లేను కలిగి ఉంది. డిస్‌ప్లే 120Hz రీప్రెష్ రేట్, 560 నిట్స్ గరిష్ఠ బ్రైట్‌నెస్‌ను కలిగి ఉంటుంది. ఈ హ్యాండ్‌సెట్ మీడియాటెక్ డైమెన్సిటీ 7025 ప్రాసెసర్, ఆండ్రాయిడ్ 14 OS పైన పనిచేస్తుంది. 33W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్టుతో 6000mAh బ్యాటరీని కలిగి ఉంది. ఈ ఫోన్ ప్రారంభ ధర రూ.14,999 గా ఉంది.
CMF ఫోన్ 1 : ఈ హ్యాండ్‌సెట్ 6.67 అంగుళాల డిస్‌ప్లేను కలిగి ఉంది. మీడియాటెక్ డైమెన్సిటీ 7300 చిప్‌సెట్, ఆండ్రాయిడ్ 14 నథింగ్ OS 2.6 పైన పనిచేస్తుంది. ఈ ఫోన్ 8GB LPDDR 4X ర్యామ్, 256GB UFS 2.2 స్టోరేజీని కలిగి ఉంటుంది. 6GB ర్యామ్ + 128GB స్టోరేజీ వేరియంట్ ధర రూ.15,999 గా ఉంది. బ్యాంకు ఆఫర్లతో తగ్గింపును పొందవచ్చు.
వివో T3x స్మార్ట్‌ఫోన్ : ఈ హ్యాండ్‌సెట్ 6.72 అంగుళాల FHD+ LCD డిస్‌ప్లేను కలిగి ఉంది. 120Hz రీప్రెష్ రేట్, 1000 నిట్స్ గరిష్ఠ బ్రైట్‌నెస్‌తో అందుబాటులో ఉంది. ఆండ్రాయిడ్ 14 ఆధారిత Funtouch OS 14, స్నాప్‌డ్రాగన్ 6 జెన్ 1 SoC పైన పనిచేస్తుంది. 44W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్టుతో 6000mAh బ్యాటరీ పైన పనిచేస్తుంది. ఈ హ్యాండ్‌సెట్ ప్రారంభ ధర రూ.13499 గా ఉంది.
పోకో M6 ప్లస్ స్మార్ట్‌ఫోన్ : ఈ హ్యాండ్‌సెట్ 6.79 అంగుళాల LCD డిస్‌ప్లేతో పనిచేస్తుంది. 120Hz రీఫ్రెష్ రేట్‌ను కలిగి ఉది. క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 4 జెన్ 2 AE చిప్‌సెట్, ఆండ్రాయిడ్ 14 Hyper OS పైన పనిచేస్తుంది. 5030mAh బ్యాటరీని కలిగి ఉంది. ఈ హ్యాండ్‌సెట్ 108MP కెమెరాను కలిగి ఉంది. ఈ హ్యాండ్‌సెట్ ప్రారంభ ధర రూ.13499 గా ఉంది.


Click it and Unblock the Notifications