నోకియా 6కు పోటీ ఇచ్చే 5 ఫోన్స్ ఇవే

HMD Global లీడర్ షిప్‌లో నోకియా తన మొట్టమొదటి ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌లను ఇండియన్ మార్కెట్లో లాంచ్ చేసింది. నోకియా 6, నోకియా 5, నోకియా 3 పేర్లతో విడుదలైన ఈ ఫోన్‌లు వేరువేరు ధర ట్యాగ్‌లతో వివిధ మార్కెట్ సెగ్మెంట్‌లను టార్గెట్ చేసేవిగా ఉన్నాయి. వీటిలో హై-ఎండ్ మోడల్ అయిన నోకియా 6 ధర రూ.14,999గా ఉంది. అమెజాన్ ఇండియాలో మాత్రమే ఈ ఫోన్ దొరుకుతుంది. జూలై 14 నుంచి సేల్ ప్రారంభమవుతుంది.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

నోకియా 6 స్పెసిఫికేషన్స్..

5.5 అంగుళాల ఫుల్ హైడెఫినిషన్ ఐపీఎస్ డిస్‌ప్లే (రిసల్యూషన్ 1920 x 1080పిక్సల్స్) విత్ 2.5డి కార్నింగ్ గొరిల్లా గ్లాస్ ప్రొటెక్షన్, ఆండ్రాయిడ్ 7.1.1 నౌగట్ ఆపరేటింగ్ సిస్టం, క్వాల్కమ్ స్పాప్‌డ్రాగన్ 430 ప్రాసెసర్, 3జీబి ర్యామ్, 32జీబి ఇంటర్నల్ స్టోరేజ్, మైక్రోఎస్డీ స్లాట్ ద్వారా ఫోన్ స్టోరేజ్ కెపాసిటీని 128జీబి వరకు విస్తరించుకునే అవకాశం, 16 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా, 8 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, ఫింగర్ ప్రింట్ సెన్సార్, 4జీ ఎల్టీఈ సపోర్ట్, వై-ఫై,NFC సపోర్ట్, మైక్రో యూఎస్బీ, 3000 mAh బ్యాటరీ.

ధర కాస్త ఎక్కువే..?

రూ.14,999 ధరలో అందుబాటులోన్న ఉన్న నోకియా 6 ఫోన్‌ను ఇతర ఫోన్‌లతో కంపేర్ చేసి చూసినట్లయితే, అంతకన్నా తక్కువ ధరలకే పలు శక్తివంతమైన ఫోన్‌లు మార్కెట్లో దొరుకుతున్నాయి. నోకియా 6కు రియల్ పోటీగా భావిస్తోన్న 5 స్మార్ట్‌ఫోన్‌ల వివరాలను ఇప్పుడు చూద్దాం...

మోటరోలా మోటో జీ5 ప్లస్

నోకియా 6 ఫోన్‌కు ప్రధాన పోటీగా నిలిచే ఫోన్‌లలో మోటో జీ5 ప్లస్ ఒకటి. ఈ ఫోన్ లేటెస్ట్ అప్‌డేట్‌లతో కూడిన ఆండ్రాయిడ్ 7.0 నౌగట్ ఆపరేటింగ్ సిస్టం పై బూట్ అవుతుంది. స్పెసిఫికేషన్స్ పరిశీలించినట్లయితే.. 5.2 అంగుళాల ఫుల్ హైడెఫినిషన్ డిస్‌ప్లే, స్నాప్‌డ్రాగన్ 625 సాక్, ర్యామ్ వేరియంట్స్ (3జీబి, 4జీబి), స్టోరేజ్ వేరియంట్స్ (16జీబి, 32జీబి), 12 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా, 5 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, 3000 ఎమ్ఏహెచ్ బ్యాటరీ. మీరు స్టాక్ ఆండ్రాయిడ్ ఫోన్‌ను గనుక కోరుకుంటున్నట్లయితే రూ.15000 బడ్జెట్‌లో మోటో జీ5 ప్లస్ బెస్ట్ ఆప్షన్.

షియోమీ రెడ్మీ నోట్ 4

2017కు బెస్ట్ బడ్జెట్ ఫ్రెండ్లీ స్మార్ట్‌ఫోన్‌గా నిలిచిన రెడ్మీ నోట్ 4, నోకియా 6 ఫోన్‌కు మరో ప్రధాన కాంపిటీటర్. మార్కెట్లో రెడ్మీ నోట్ 4 ప్రారంభ వేరియంట్ ధర రూ.9,999గా ఉంది (నోకియ3 ధర కంటే రూ.500 ఎక్కువన్నమాట). రెడ్మీ నోట్ 4 స్పెసిఫికేషన్స్ పరిశీలించినట్లయితే.. 5.5 ఇంచ్ డిస్ ప్లే, స్నాప్ డ్రాగన్ 625 సాక్, ర్యామ్ వేరియంట్స్ (2జీబి, 3జీబి, 4జీబి), స్టోరేజ్ వేరియంట్స్ (32జీబి, 64జీబి), 13 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా, 5 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, 4100mAh బ్యాటరీ. సాఫ్ట్‌వేర్ విషయానికి వచ్చేసరికి రెడ్మీ నోట్ 4 హెవీ స్కిన్ కలిగిన MIUI 8 ప్లాట్ ఫామ్ పై రన్ అవుతుంది. రెడ్మీ నోట్ 4 హెవీ యూజర్ ఇంటర్‌ఫేస్‌ను హ్యాండిల్ చేసేందుకు మీరు సిద్ధంగా ఉన్నట్లయితే నోకియా 6 కంటే రెడ్మీ నోట్ 4 బెస్ట్ ఆప్షన్.

లెనోవో పీ2

మార్కెట్లో దొరుకుతోన్న బెస్ట్ బ్యాటరీ బ్యాకప్ ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్ ఏదైనా ఉందంటే అది లెనోవో పీ2నే. ఈ డివైస్‌ను నోకియా 6కు మరో ప్రధాన కాంపిటీటర్‌గా భావించవచ్చు. 5100mAh బ్యాటరీతో వస్తోన్న ఈ ఫోన్‌ను సింగిల్ ఛార్జ్ పై మూడు రోజులు వాడుకోవచ్చు. లెనోవో పీ2 స్పెసిఫికేషన్స్ పరిశీలించినట్లయితే.. 5.5 అంగుళాల ఫుల్ హైడెఫినిషన్ అమోల్డ్ డిస్‌ప్లే, Snapdragon 625 చిప్‌సెట్, ర్యామ్ వేరియంట్స్ (3జీబి, 4జీబి), 32జీబి ఇన్‌బిల్ట్ స్టోరేజ్ ఆప్షన్, ఆండ్రాయిడ్ 7.0 నౌగట్ ఆపరేటింగ్ సిస్టం విత్ స్టాక్ ఆండ్రాయిడ్ ఇంటర్‌ఫేస్.

లెనోవో జెడ్2 ప్లస్

Snapdragon 820 SoCతో దొరుకుతోన్న చవకమైన ఆండ్రాయిడ్ ఫోన్ ఏదైనా ఉందంటే అది లెనోవో జెడ్2 ప్లస్‌నే. ప్రస్తుతానికి ఈ ఫోన్ రూ.14,999 ధర ట్యాగ్‌తో ట్రేడ్ అవుతోంది (పండుగ ఆఫర్ల సమయంలో రూ.13,000కు కూడా విక్రయించారు). నోకియా 6తో తలపడే ఫోన్‌లలో లెనోవో జెడ్2 ప్లస్ కూడా ఒకటి. లెనోవో ఫోన్ స్పెసిఫికేషన్స్ పరిశీలించినట్లయితే.. 5 అంగుళాల ఫుల్ హైడెఫినిషన్ డిస్‌ప్లే, స్నాప్‌డ్రాగన్ 820 సాక్, ర్యామ్ వేరియంట్స్ (3జీబి, 4జీబి), స్టోరేజ్ వేరియంట్స్ (32జీబి, 64జీబి), 13 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా, 8 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, 3500mAh బ్యాటరీ. ఆండ్రాయిడ్ నౌగట్ ఆపరేటింగ్ సిస్టం విత్ లెనోవో ZUI స్కిన్.

లీఇకో లీమాక్స్ 2

నోకియా 6 స్మార్ట్‌ఫోన్‌తో తలపడుతోన్న మరొక స్మార్ట్‌ఫోన్ లీఇకో లీమాక్స్ 2. ఈ ఫోన్ స్పెసిఫికేషన్స్ పరిశీలించినట్లయితే.. 5.7 అంగుళాల క్వాడ్ హైడెఫినిషన్ డిస్‌ప్లే, స్నాప్‌డ్రాగన్ 820 సాక్, ర్యామ్ వేరియంట్స్ (4జీబి, 6జీబి), స్టోరేజ్ వేరియంట్స్ (32జీబి, 64జీబి), 21 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా, 8 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, 3100mAh బ్యాటరీ, ఆండ్రాయిడ్ మార్ష్‌మల్లో ఆపరేటింగ్ సిస్టం విత్ లీఇకో EUI స్కిన్.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Smartphones Which Will Give a Tough Competition to the Nokia 6 in India. Read More in Telugu Gizbot..
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot