ఇక డైమెండ్ డిస్‌ప్లేతో స్మార్ట్‌ఫోన్‌లు

స్మార్ట్‌‌ఫోన్‌లలో నిత్యం సరికొత్త మార్పులు చోటుచేసుకుంటూనే ఉన్నాయి. ఇప్పటికే అనేక కొత్త ఫీచర్లను నేటి ఆధునిక జనరేషన్ ఫోన్‌లలో మనం చూసాం. భవిష్యత్‌లో మరిన్ని చూడబోతున్నాం. తాజాగా తెలుస్తోన్న సమాచారం ప్రకారం, త్వరలో డైమెండ్ డిస్‌ప్లేలతో స్మార్ట్‌ఫోన్‌లు రాబోతున్నాయట. అవును, మీరు వింటున్నది నిజమే.. వజ్రంతో తయారు చేయబడిన స్మార్ట్‌ఫోన్ డిస్‌ప్లేలు త్వరలో సాకారం కాబోతున్నాయి.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

ఇప్పటికే సఫైర్ క్రిస్టల్ డిస్‌ప్లేలతో

ఇప్పటికే స్మార్ట్‌ఫోన్‌లలో సఫైర్ క్రిస్టల్ డిస్‌ప్లేలను వాడేస్తున్నారు. హెచ్‌టీ‌సీ యూ అల్ట్రా, Kyocera Brigadier వంటి స్మార్ట్‌ఫోన్‌లు ఇప్పటికే ఖరీదైన సఫైర్ క్రిస్టల్ డిస్‌ప్లేలతో మార్కెట్లో పరిచయమయ్యాయి.

Akhan Semiconductor

Akhan Semiconductor అనే కంపెనీ డైమెండ్ గ్లాస్ డిస్‌ప్లే ఫోన్‌లను త్వరలో అందుబాటులోకి తీసకురానుందట. డైమెండ్ గ్లాస్ ఆధారిత స్మార్ట్ ఫోన్స్ అలానే వేరబుల్స్‌ను లాంచ్ చేసేందుకు ప్రముఖ తయారీ సంస్ధలతో చర్చలు జరుపుతున్నట్లు ఆ కంపెనీ సీఈఓ ఒక ప్రకటనలో తెలిపారు.

డైమెండ్ గ్లాస్ వల్ల ప్రయోజనాలు ఏంటి..?

ప్రస్తుతం అందుబాటులో ఉంటున్న గ్లాస్ డిస్‌ప్లేలు ట్రెండీగా అనిపిస్తున్నప్పటికి మన్నిక విషయానికి వచ్చేసరికి ప్రశ్నార్ధకంగ మారాయి. ముఖ్యంగా ఫోన్ చేజారి క్రిందపడినప్పుడు గ్లాస్ డిస్‌ప్లేలు పగిలిపోతున్నాయి. డైమెండ్ గ్లాస్ డిస్‌ప్లే విషయానికి వచ్చేసరికి ఇటువంటి సమస్య ఉండదు. ఎందుకంటే డైమెండ్ అనేదే బలమైన పదార్థాల్లో ఒకటి. గ్లాస్ డిస్‌ప్లేలతో పోలిస్తే డైమెండ్ డిస్ ప్లేలు 10 రెట్లు బలంగా ఉంటాయి. కాబట్టి వీటిని ఎక్కువ కాలం ఉపయోగించుకోవచ్చు.

డైమెండ్ గ్లాస్ వల్ల ప్రయోజనాలు ఏంటి..?

డైమెండ్ గ్లాస్ డిస్‌ప్లేల వల్ల ఇంకో లాభం ఏంటంటే, ఇవి ఫోన్ హీటింగ్‌ను త్వరగా లాగేసుకుని చల్లబరిచే ప్రయత్నం చేస్తాయి. సాధారణ గ్లాస్ డిస్‌ప్లే ఫోన్‌తో పోలిస్తే డైమెండ్ గ్లాస్ డిస్‌ప్లే 800 రెట్లు అధికంగా ఫోన్‌ను చల్లబరిచే ప్రయత్నం చేస్తుందట. అయితే, డైమెండ్ క్రిస్టల్స్ ఏ మాత్రం వాటర్ రెసిస్టెంట్ కాదు. ఈ డిస్‌ప్లేలు నీటి ప్రమాదాలను ఏమాత్రం తట్టుకోలేవు. కాబట్టి, వీటిని నీటికి దూరంగా ఉంచుకోవాలి.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే


English summary
Smartphones with diamond glass displays coming soon: All you need to know. Read More in Telugu Gizbot..
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot