విప్లవాత్మక స్మార్ట్‌ఫోన్‌లు...

Posted By:

స్మార్ట్‌ఫోన్ ప్రపంచంలో పలు విప్లవాత్మక ఆవిష్కరణలు చరిత్రపుటల్లో చెరగని ముద్రవేస్తాయి. సామ్‌సంగ్, నోకియా, ఎల్‌జి, ఏసర్, లెనోవో, సోనీ వంటి బ్రాండ్‌లు విప్లవాత్మక ఫీచర్లతో కూడిన స్మార్ట్‌ఫోన్‌లను ఇటీవల కాలంలో మార్కెట్లో ఆవిష్కరించాయి. ప్రపంచ స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో విప్లవాత్మక ఫీచర్లతో విడుదలై ప్రత్యేక హోదాను దక్కించుకున్న పలు శక్తివంతమైన స్మార్ట్ హ్యాండ్‌సెట్‌ల వివరాలను మీతో షేర్ చేసుకుంటున్నాం..

మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.
వివిధ మోడళ్ల స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

విప్లవాత్మక స్మార్ట్‌ఫోన్‌లు...

సామ్‌సంగ్, తన ఫ్లాగ్‌షిప్ స్మార్ట్ మొబైలింగ్ డివైస్ గెలాక్సీ ఎస్5లో ‘హార్ట్-రేట్ సెన్సార్' పేరుతో సరికొత్త ఫీచర్‌ను ఈ డివైస్‌లో ఏర్పాటు చేసింది. ఈ సెన్సార్‌ను ఫోన్ వెనుక భాగంలో కెమెరా ఫ్లాష్ క్రింది ప్రాంతంలో నిక్షిప్తం చేసారు. యూజర్ ఈ సెన్సార్ పై తన వేలిని కొద్ది సెకన్లు ఉంచినట్లయితే ఎల్ఈడి లైట్ రక్త ప్రసరణను నమోదు చేసి ఆ వివరాలను సెన్సార్‌కు పంపుతుంది. తద్వారా మీ హార్ట్ రేట్ ఫోన్ తెర పై ప్రత్యక్షమవుతుంది. ఈ హార్ట్-రేట్ సెన్సార్ ఫీచర్ ఎస్ హెల్త్ అప్లికేషన్‌లో ఓ భాగంగా స్పందిస్తుంది.

విప్లవాత్మక స్మార్ట్‌ఫోన్‌లు...

ఓప్పో ఎన్1 :

ఓప్పో ఎన్1 ప్రపంచపు మొట్టమొదటి రోటేటింగ్ ఫీచర్‌తో విడుదలైన మొట్టమొదటి స్మార్ట్‌ఫోన్‌గా చరిత్రకెక్కింది.

ఫోన్ కీలక ఫీచర్లు: రోటేటింగ్ ఫీచర్‌తో కూడిన 13 మెగా పిక్సల్ స్వైవిల్ కెమెరా, 5.9 అంగుళాల హైడెఫినిషన్ ఐపీఎస్ కెపాసిటివ్ టచ్‌స్ర్కీన్, ఆండ్రాయిడ్ వీ4.2 ఆపరేటింగ్ సిస్టం, 1.7గిగాహెట్జ్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగెన్ 600 క్వాడ్‌కోర్ ప్రాసెసర్, 2జీబి ర్యామ్, అడ్రినో 320 గ్రాఫిక్ ప్రాసెసింగ్ యూనిట్, 16జీబి రోమ్, 3జీ, యూఎస్బీ ఓటీజీ, వై-ఫై, బ్లూటూత్, జీపీఎస్, 3610 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

 

విప్లవాత్మక స్మార్ట్‌ఫోన్‌లు...

నోకియా లూమియా 1020

నోకియా నుంచి ఇటీవల విడుదలైన లూమియా 1020 విండోస్ ఫోన్ 8 స్మార్ట్ హ్యాండ్‌సెట్ ప్రపంచపు మొట్టమొదటి 41 మెగా  పిక్సల్ ప్యూర్ వ్యూ కెమెరా స్మార్ట్‌ఫోన్‌గా చరిత్రకెక్కింది.

ఫోన్ స్పెసిఫికేషన్‌లను పిరిశీలించినట్లయితే:

లూమియా 1020 ప్రధాన స్పెసిఫికేషన్‌లు: 4.5 అంగుళాల ఆమోల్డ్  WXGA స్ర్కీన్ (రిసల్యూషన్1280x 768పిక్సల్స్), గొరిల్లా గ్లాస్ 3 డిస్‌ప్లే, విండోస్ ఫోన్ 8 ఆపరేటింగ్ సిస్టం, 1.5గిగాహెట్జ్ డ్యూయల్ కోర్ స్నాప్‌డ్రాగెన్ ఎస్4 ప్రాసెసర్, 2జీబి ర్యామ్, 32జీబి ఇంటర్నల్మెమెరీ, 7జీబి స్కై డ్రైవ్ క్లౌడ్ స్టోరేజ్ వ్యవస్థ, 2000 ఎమ్ఏహెచ్ బ్యాటరీ, బ్లూటూత్, వై-ఫై, జీపీఎస్, యూఎస్బీ, ఎన్ఎఫ్‌సీ కనెక్టువిటీ.

 

విప్లవాత్మక స్మార్ట్‌ఫోన్‌లు...

ఎల్‌జి జీ2

ఎల్‌జి జీ2, బ్యాక్ కెమెరా బటన్ కలిగి ఉన్న ప్రపంచపు మొట్టమొదటి స్మార్ట్‌ఫోన్‌గా చరిత్రకెక్కింది.

ఫోన్ ప్రధాన ఫీచర్లను పరిశీలించినట్లయితే:

13 మెగా పిక్సల్ రేర్ కెమెరా విత్ ఓఐఎస్, 5.2 అంగుళాల పూర్తి హైడెఫినిషన్ ఐపీఎస్ డిస్‌ప్లే, ఆండ్రాయిడ్ 4.2.2 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం, 2.26గిగాహెట్జ్ క్వాడ్‌కోర్ ప్రాసెసర్, 2జీబి ర్యామ్, ఇంటర్నల్ మెమెరీ (16జీబి,32జీబి), మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని విస్తరించుకునే సౌలభ్యత, 2.1 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా ఫీచర్, 3జీ, ఎల్టీఈ, యూఎస్బీ, వై-ఫై, జీపీఎస్, జీపీఆర్ఎస్, బ్లూటూత్ కనెక్టువిటీ, 3000 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

 

విప్లవాత్మక స్మార్ట్‌ఫోన్‌లు...

లెనోవో పీ780

లెనోవో పీ780 ప్రపంచపు మొట్టమొదటి శక్తివంతమైన 4000ఎమ్ఏహెచ్ బ్యాటరీ వ్యవస్థను కలిగిన స్మార్ట్‌ఫోన్‌గా చరిత్రకెక్కింది.


ఫోన్ స్పెసిఫికేషన్‌లు:

5 అంగుళాల ఐపీఎస్ ఎల్‌సీడీ డిస్‌ప్లే (రిసల్యూషన్ 720 x 1280పిక్సల్స్, 294 పీపీఐ), ఎంటీకే 6589 చిప్ సెట్, 1.2గిగాహెట్జ్ క్వాడ్‌కోర్ ప్రాసెసర్, 1జీబి ర్యామ్, పవర్ వీఆర్‌ఎస్ జిఎక్స్544 గ్రాఫిక్ ప్రాసెసింగ్ యూనిట్, ఆండ్రాయిడ్ వీ4.2 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం, 8 మెగా పిక్సల్ రేర్ కెమెరా (ఆటో ఫోకస్, ఎల్ఈడి ఫ్లాష్), 1.2 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, 4జీబి ఇంటర్నల్ మెమరీ, మైక్రోఎస్డీ కార్డ్ స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 32జీబికి విస్తరించుకునే సౌలభ్యత

 

 

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Smartphones With Revolutionary Features. Read more in Telugu Gizbot.....
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot