ఈ ఏడాది కొత్త ఫీచర్లతో తళుక్కుమన్న క్రేజీ స్మార్ట్‌ఫోన్‌లు ఇవే!

|

స్మార్ట్‌ఫోన్ ప్రపంచంలో విప్లవాత్మక మార్పులకు వేదికగా నిలిచిన 2017 చరిత్రపుటల్లో నిలిచిపోతుంది. నోకియా, యాపిల్, ఎల్‌జి, మోటరోలా వంటి బ్రాండ్‌లు విప్లవాత్మక ఫీచర్లతో కూడిన స్మార్ట్‌ఫోన్‌లను మార్కెట్లో ఆవిష్కరించాయి. నేటి ప్రత్యేక కథనంలో భాగంగా విభిన్నమైన ఫీచర్లతో మార్కెట్లో లాంచ్ అయి 2017కుగాను ప్రత్యేకమైన హోదాను దక్కించుకున్న 5 ప్రత్యేకమైన స్మార్ట్‌ఫోన్‌ల వివరాలను మీతో షేర్ చేసుకుంటున్నాం..

 

నోకియా 8 - బోతీ ఫీచర్

నోకియా 8 - బోతీ ఫీచర్

హెచ్‌ఎండి గ్లోబల్ నంచి లాంచ్ అయిన మొట్టమొదటి Carl Zeiss optics స్మార్ట్‌ఫోన్‌గా నోకియా 8 గుర్తింపు తెచ్చుకుంది. ఇదే సమయంలో ఈ డివైస్‌కు Bothie ఫీచర్ మరో ప్రధానమైన హైలైట్‌గా నిలుస్తుంది. బోతీ అంటే డ్యుయల్ సైట్ అని అర్థం. ఈ డ్యుయల్ సైట్ ఫీచర్ ద్వారా ఫోటోలతో పాటు వీడియోలను ఒకేసారి ముందు వెనుకా కెమెరాల నుంచి క్యాప్చుర్ చేసుకునే వీలుంటుంది.

ఈ మధ్యనే మార్కెట్లో లాంచ్ అయిన ఇన్ ఫోకస్ విజన్ 3 స్మార్ట్‌ఫోన్‌లో కూడా డ్యుయల్ ఫై పేరుతో ఇదే తరహా ఫీచర్‌ను ఆఫర్ చేస్తున్నారు. భవిష్యత్‌లో విడుదల కాబోయే ఇతర నోకియా స్మార్ట్‌ఫోన్‌లలో కూడా ఈ బోతీ ఫీచర్ ప్రధాన హైలైట్‌గా నిలిచే అవకాశం ఉంది.

యాపిల్ ఐఫోన్ ఎక్స్ - యానిమోజీ
 

యాపిల్ ఐఫోన్ ఎక్స్ - యానిమోజీ

ఐఫోన్ సంస్థ 10వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని యాపిల్ ఐఫోన్ ఎక్స్ పేరుతో ఓ స్పెషల్ ఎడిషన్ డివైస్‌ను అందుబాటులోకి తీసుకువచ్చిన విషయం తెలిసిందే. ఓఎల్ఈడి డిస్‌ప్లే, ట్రూ డెప్త్ సెన్సార్, ఫేస్ ఐడీ ఫేషియల్ రికగ్నిషన్ టెక్నాలజీ వంటి విప్లవాత్మక ఫీచర్లతో లాంచ్ అయిన ఈ డివైస్‌కు యానిమోజీ ఫీచర్ మరో ప్రధాన హైలైట్‌గా నిలిచింది.

ట్రూడెప్త్ కెమెరాతో వర్క్ అయ్యే ఈ ఎమోజీ ఫీచర్ యూజర్‌కు సంబంధించిన ఫేషియల్ ఎక్స్‌ప్రెషన్స్‌తో పాటు వాయిస్‌ను ఖచ్చితమైన టైమింగ్‌తో రీడ్ చేయగలుగుతుంది. ఈ ఫీచర్ ద్వారా మీకు నచ్చిన యానిమేటెడ్ క్యారక్టర్‌ను సెలక్ట్ చేసుకుని మీ వాయిస్‌తో మెసేజ్‌లను పంపుకునే వీలుంటుంది.

అదిరే ఫీచర్లతో హానర్ 9 లైట్ వచ్చేసింది !అదిరే ఫీచర్లతో హానర్ 9 లైట్ వచ్చేసింది !

ఎల్‌జీ కే7ఐ - మస్కిటో రిపెల్లింగ్ టెక్నాలజీ

ఎల్‌జీ కే7ఐ - మస్కిటో రిపెల్లింగ్ టెక్నాలజీ

అల్ట్రా సోనిక్ మస్కిటో రిపెల్లింగ్ టెక్నాలజీతో లాంచ్ అయిన మొట్టమొదటి స్మార్ట్‌ఫోన్‌గా LG K7i గుర్తింపు తెచ్చుకుంది. ఈ స్మార్ట్‌ఫోన్ నుంచి విడుదలయ్యే ప్రత్యేకమైన శబ్ధ తరంగాలు దోమలను మీకు దూరంగా ఉంచుతాయి. స్మార్ట్‌ఫోన్‌లో ఈ టెక్నాలజీని పరీక్షించి చూసినపుడు దాదాపుగా 72.32 శాతం దోమలు ఫోన్ చుట్టుపక్కల ఉన్న వారికి దగ్గరికి రాలేదని ఎల్‌జీ తెలిపింది.

మోటో ఎక్స్4 - ప్రాజెక్ట్ ఫై

మోటో ఎక్స్4 - ప్రాజెక్ట్ ఫై

ఐఎఫ్ఏ 2017 టెక్నాలజీ ట్రేడ్‌షోలో భాగంగా మోటరోలా లాంచ్ చేసిన మోటో ఎక్స్4 స్మార్ట్‌ఫోన్ ద్వారా విప్లవాత్మక ప్రాజెక్ట ఫై ఫీచర్‌ను గూగుల్ పరిచయం చేసింది. ఈ ప్రాజెక్ ఫై అనేది ఓ వైర్‌లెస్ వర్చువల్ మొబైల్ నెట్‌వర్క్. ఈ నెట్‌వర్క్ కాల్ డ్రాప్స్ అనేవే లేకుండా చేస్తుంది. స్లో ఇంటర్నెట్ కనెక్షన్ సమస్యలు కూడా ఉండవు. ఈ నెట్‌వర్క్ పరిధిలో ఏమైనా ఉచిత సెక్యూర్ వై-ఫై హాట్ స్పాట్స్ అందుబాటులో ఉన్నట్లయితే వెంటనే ఈ ఫీచర్ కనెక్ట్ అయిపోతోంది. దీంతో మీ మొబైల్ డేటా కూడా ఆదా అవుతుంది.

రేజర్ ఫోన్ - 120Hz రీఫ్రెష్ రేట్

రేజర్ ఫోన్ - 120Hz రీఫ్రెష్ రేట్

గేమింగ్ హార్డ్‌వేర్ బ్రాండ్ నుంచి లాంచ్ అయిన రేజర్ ఫోన్ గేమింగ్ ప్రియులకు చక్కటి ఆప్షన్‌గా చెప్పుకోవచ్చు. 5.72 అంగుళాల IGZO ఎల్‌సీడీ డిస్‌ప్లేతో వస్తోన్న ఈ స్మార్ట్‌ఫోన్ ఏకంగా 120Hz హై రీఫ్రెష్ రేటును కలిగి ఉండటం విశేషం. ఈ స్మార్ట్‌ఫోన్ స్ర్కీన్ సెకనుకు 120 సార్లు రీఫ్రెష్ అవ్వటం వల్ల పిక్షర్ క్వాలిటీ మరింత క్వాలిటీతో ఉంటుంది. హై-ఎండ్ గేమింగ్‌కు ఈ డివైస్‌ను బెస్ట్ ఆప్షన్‌గా నిలుస్తుంది.

Best Mobiles in India

English summary
Nokia 8 with Bothie aka Dual Sight feature, the tenth-anniversary edition dubbed Apple iPhone X with Animoji, Razer phone with a high refresh rate of 120Hz, Moto X4 with Google’s Project Fi, and LG K7i with the mosquito repelling feature are some of the unique smartphones those were launched so far in 2017.

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X