స్మార్ట్రాన్ నుంచి సరికొత్త ఉత్పత్తులు

|

స్మార్ట్రాన్ T-ఫోన్ లాంచ్ చేసిన తర్వాత, భారతదేశ మార్కెట్ లో ఈ సంవత్సరo జనవరి లో P- ఫోన్ ను కూడా లాంచ్ చేసింది. స్మార్ట్రాన్, భారతదేశపు మొట్టమొదటి గ్లోబల్ టెక్నాలజీ OEM కంపెనీ మరియు IoT(ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్) బ్రాండ్ అయిన స్మార్ట్రాన్ ఈ నెల చివరిలోగా 4 నూతన పరికరాలను తీస్కునిరాబోతుంది. అసలు ఎటువంటి ఉత్పత్తులను తీసుకుని రాబోతుంది అన్న ప్రశ్నకి సంస్థకు సంబంధించిన కొందరు నమ్మదగిన అధికారిక మూలాల ప్రకారం, T-బుక్ , T -బ్యాండ్ , T-ఫోన్ లో గోల్డెన్ వేరియంట్, P-ఫోన్ మరియు T-బైక్ అనే ఉత్పత్తులు రానున్నాయి. T-బైక్ తప్ప మిగిలిన అన్నీ ఉత్పత్తులు ఫ్లిప్కార్ట్ లో లభ్యం కానున్నాయి. T-బైక్ మాత్రం స్మార్ట్రాన్ సొంత వెబ్ సైట్ లో లభ్యం కానుందని తెలుస్తూ ఉంది.

 
స్మార్ట్రాన్ నుంచి సరికొత్త ఉత్పత్తులు

స్మార్ట్రాన్ తన SRT ఫోన్లకు ఆండ్రాయిడ్ ఒరియో అప్డేట్ కూడా ఇచ్చింది. గత సంవత్సరం మే లో స్మార్ట్రాన్ తన SRT ఫోన్ ను నౌగట్ అప్డేట్ తో, 32జి‌బి ఇంటర్నల్ మెమొరీతో 12,999 రూపాయలకు., మరియు64 GB ఇంటర్నల్ మెమొరీ ఉన్న ఫోన్ ను 13,999 రూపాయలకు విడుదల చేసింది. కానీ ఇప్పుడు ఈ రెండు ఫోన్లు 7,300 మరియు 8,999 రూపాయలకే లభ్యమవుతున్నాయి. అత్యధిక ఫీచర్లను బడ్జెట్ లో ప్రవేశపెట్టినా కూడా, పోటీ దృష్ట్యా కొన్ని నష్టాలు తప్పలేదు. నిజానికి ఆక్టాకోర్ ప్రాసెసర్, 32 , 64 జి‌బి ఇంటర్నల్ మెమొరీ, ఒరియో అప్డేట్, గొరిల్లా స్క్రీన్, 5.5 ఇంచ్ డిస్ప్లే, 4 జి‌బి రామ్ మరియు 13 రేర్ మరియు 5 ఫ్రంట్ కెమరా వంటి ఫీచర్లనే కాకుండా అత్యధిక బాటరీ బాకప్ కలిగిన మొబైల్ గా ఈ స్మార్ట్రాన్ ఉంది. సచిన్ రమేశ్ టెండూల్కర్ పేరు మీద SRT గా విడుదల చేసిన ఈ ఫోన్ బెస్ట్ బడ్జెట్ మొబైల్స్ లో ఒకటి అని చెప్పవచ్చు.

గత సంవత్సరం స్మార్ట్రాన్ సంస్థ tronXTM, మరియు tronX lifeTM లను ఆవిష్కరించింది. ఇవి పర్యావరణ స్నేహితులుగా అత్యుత్తమ సామర్ధ్యం కలిగి, పరికరాలను అనుసంధానం చేయుటకు ఉపయోగపడగా., tronX, స్మార్ట్రాన్ సంస్థ యొక్క ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత అనుసంధాన కర్తగా వ్యవహరిస్తుంది.తద్వారా రాబోవు స్మార్ట్రాన్ సరికొత్త పరికరాలలో అంతర్గతంగా మానవ జీవన శైలికి సహాయపడేలా కొన్ని ప్రత్యేకమైన ఫీచర్లను పొందుపరచనున్నారు. ఇందులో భాగంగా, tronX పర్సనల్, tronX హెల్త్, tronXహోమ్ మరియు tronX ఇన్ఫ్రా అను ఫీచర్లు ఉండనున్నాయి. ఇందులో tronX పర్సనల్, వ్యక్తిగతీకరించిన మరియు స్థానికీకరించబడి వినియోగదారులకు ఎంతగానో సహాయపడేలా, ప్రయాణం, షాపింగ్ ,కార్యక్రమాలు, కమ్యూనికేషన్, ఆర్ధిక, ఆరోగ్య సంబంధిత అంశాలకు సహకారం అందించేలా రూపొందించారు. TronX హెల్త్ ద్వారా ఆరోగ్య సంబంధిత అంశాలను పొందుపరచడం ద్వారా, సూచనలు సలహాలు ఇచ్చేలా రూపొందించబడింది.

శాంసంగ్ 20-20 కార్నివాల్, డిస్కౌంట్లు, ముంబై ఇండియన్స్‌ జెర్సీ మీ సొంతం !శాంసంగ్ 20-20 కార్నివాల్, డిస్కౌంట్లు, ముంబై ఇండియన్స్‌ జెర్సీ మీ సొంతం !

TronX హోం, గూగుల్ హోమ్ వలె సార్ట్ హోమ్ ఫీచర్లను కలిగి ఉంటుంది. తద్వారా ఇంట్లోని స్మార్ట్ పరికరాలను అనుసంధానించే ఆప్షన్లను కలిగి ఉంటుంది. అంటే కాకుండా సెక్యూరిటీ అప్డేట్స్ , లాకింగ్ మెకానిజం, గృహోపకరణాలు, వాటర్ బిల్, కరెంట్ బిల్ వంటి పేమెంట్ చర్యలు మొదలైన అనేక అంశాలను వాయిస్ కమాండ్స్ ద్వారా నియంత్రించుకునే వెసులుబాటు కల్పిస్తుంది.

 
స్మార్ట్రాన్ నుంచి సరికొత్త ఉత్పత్తులు

చివరిగా TronX ఇన్ఫ్రా , ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తో BMS, సెక్యూరిటీ, లైటింగ్, వాతావరణం, బిల్డింగ్స్ కై ట్రాకింగ్ మరియు కనెక్టివిటీ, కోల్డ్ స్టోరేజ్, లాజిస్టిక్స్, రవాణా మొదలైన అంశాల గురించి పర్యవేక్షిస్తుంది. ఈ కొత్త పరికరాలు మార్కెట్లోకి ఎప్పుడు రానున్నాయో ఏమో కానీ, మంచి ఆఫర్లతో ముందుకు వస్తే మాత్రం అమ్మకాలు గణనీయoగా పెరిగే అవకాశాలు లేకపోలేదు.

Best Mobiles in India

English summary
Exclusive: Smartron to launch t-band, golden variant of t.Phone P, t-Bike and new version of t-book

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X