స్నాప్‌డీల్ సొంత స్మార్ట్‌ఫోన్ ‘ఆల్ఫా ఫెదర్’

|

ఫ్లిప్‌కార్ట్ తరాహాలోనే భారత్‌కు చెందిన మరో ప్రముఖ ఆన్‌లైన్ రిటైలర్ స్నాప్‌డీల్ ఆల్ఫా ఫెదర్ (Alpha Feather) పేరుతో సరికొత్త స్మార్ట్‌ఫోన్‌ను మార్కెట్లో విడుదల చేసింది. ధర రూ.12,999. స్నాప్‌డీల్ సొంత బ్రాండ్ నుంచి ఈ ఫోన్ విడుదల కావటం విశేషం. ఈ 5 అంగుళాల స్మార్ట్ మొబైలింగ్ డివైస్ Snapdeal వద్ద ఎక్స్‌‍క్లూజివ్‌గా లభ్యమవుతోంది. కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

స్నాప్‌డీల్ సొంత స్మార్ట్‌ఫోన్ ‘ఆల్ఫా ఫెదర్’

ఈ స్మార్ట్‌ఫోన్ కీలక స్పెసిఫికేషన్‌లను పరిశీలించినట్లయితే... ఆండ్రాయిడ్ 4.4 కిట్‌క్యాట్ ఆపరేటింగ్ సిస్టం, 5 అంగళాల ఐపీఎస్ డిస్‌ప్లే (రిసల్యూషన్ 1920 x 1080పిక్సల్స్). బరువు 125 గ్రాములు, ఫోన్ మందం 6.8 మిల్లీమీటర్లు. 1.3గిగాహెట్జ్ క్వాడ్‌కోర్ ప్రాసెసర్ పై ఫోన్‌లో ఏర్పాటు చేసారు. 2జీబి ర్యామ్, 4జీబి ఇంటర్నల్ మెమరీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని విస్తరించుకునే సౌలభ్యత, 13 మెగా పిక్సల్ రేర్ ఫేసిగ్ కెమెరా, 8 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా (వీడియో కాలింగ్ నిర్వహించుకునేందుకు), 2500 ఎమ్ఏహెచ్ బ్యాటరీ. ఫోన్ కనెక్టువిటీ ఫీచర్లను పరిశీలించినట్లయతే... డ్యూయల్ సిమ్, 3జీ, వై-ఫై, జీపీఎస్, ఏ-జీపీఎస్, ఎఫ్ఎమ్ రేడియో.

ఫ్లిప్‌కార్ట్ డిగీఫ్లిప్ ప్రో ఎక్స్‌టీ712

భారత దేశపు ప్రముఖ ఆన్‌లైన్ రిటైలర్ ఫ్లిప్‌కార్ట్ (Flipkart) తన సొంత బ్రాండ్ నుంచి తొలిసారిగా డిగీఫ్లిప్ ప్రో ఎక్స్‌టీ712 పేరుతో ఓ టాబ్లెట్ డివైస్‌ను మార్కెట్లో ఆవిష్కరించింది. దేశవాళీ మార్కెట్లో ఈ పోర్టబుల్ కంప్యూటిండ్ డివైస్ ధర రూ.9,999. డిగీఫ్లిప్ ప్రో సిరిస్ నుంచి తొలిగా విడదలైన ఈ ట్యాబ్లెట్ బ్లాక్ ఇంకా వైట్ కలర్ వేరియంట్‌లలో లభ్యమవుతోంది. సంవత్సరం వారంటతో లభ్యమవుతున్న ఈ ట్యాబ్లెట్ పై ఫ్లిప్‌కార్ట్ రూ.5,000 విలువ చేసే షాపింగ్ ప్రయోజనాలతో పాటు రూ.2000 విలువ చేసే ఇ-బుక్‌ను ఉచితంగా ఆఫర్ చేస్తోంది. ఇవే కాకుండా, డిగీఫ్లిప్ ప్రో ఎక్స్‌టీ712 ట్యాబ్లెట్ కొనుగోలుదారులు రూ.1,199 విలువ చేసే బ్లూటూత్ హెడ్‌సెట్‌ను ఉచితంగా పొందుతారు. అంతేకాకుండా, డిగీఫ్లిప్ బుక్ కవర్ కొనుగోలు పై 50% రాయితీ అలానే ఒకనెల ఉచిత సబ్‌స్ర్కీప్షన్ సర్వీసును పొందవచ్చు.

డిగీఫ్లిప్ ప్రో ఎక్స్‌టీ712 ట్యాబ్లెట్ కీలక స్పెసిఫికేషన్‌లను పరిశీలించినట్లయితే.... డ్యూయల్ సిమ్ కనెక్టువిటీ, 7 అంగుళాల ఐపీఎస్ డిస్‌ప్లే (రిసల్యూషన్ 1280x800పిక్సల్స్), ట్యాబ్లెట్ మందం 9.2 మిల్లీమీటర్లు, బరువు 285 గ్రాములు, 1.3గిగాహెట్జ్ మీడియాటెక్ ఎంటీకే8382 క్వాడ్ కోర్ ప్రాసెసర్, 1జీబి ర్యామ్, ఆండ్రాయిడ్ 4.2.2 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం, 16జీబి ఇంటర్నల్ మెమెరీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 32జీబి వరకు విస్తరించుకునే సౌలభ్యత, 5 మెగా పిక్సల్ రేర్ కెమెరా (ఆటో ఫోకస్), 2 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా (వీడియో కాలింగ్ నిర్వహించుకునేందుకు), కనెక్టువిటీ ఫీచర్లు (వై-ఫై, బ్లూటూత్ 4.0, జీపీఎస్), 3,000ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

Best Mobiles in India

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X