ఇక రూ.10,000 ఫోన్‌లలోనూ 8జీబి ర్యామ్.?

ప్రముఖ స్మార్ట్‌ఫోన్‌ల చిప్‌సెట్‌ల తయారీదారు క్వాల్కమ్ (Qualcomm) మూడు సరికొత్త ప్రాసెసర్‌లను ఆవిష్కరించింది. స్నాప్‌డ్రాగన్ (Snapdragon) 600, 400 సిరీస్ క్రింద లాంచ్ కాబడిన ఈ ప్రాసెసర్‌లు వివరాలు స్నాప్‌డ్రాగన్ 653, 626, 427గా ఉన్నాయి. హాంకాంగ్‌‌లో నిన్న జరిగిన 4G/5G సమ్మిట్‌లో భాగంగా క్వాల్కమ్ ఈ ప్రాసెసర్‌లను లాంచ్ చేసింది.

Read More : Jio నెట్‌వర్క్‌లో బ్యాలన్స్, డేటా యూసేజ్ చెక్ చేసుకోవటం ఎలా..?

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

మార్కెట్లోకి ఎప్పుడు వస్తాయ్..?

స్నాప్‌డ్రాగన్ 653, 626 చిప్‌సెట్‌లు ఈ ఏడాది చివరి నుంచి మార్కెట్లోకి వస్తాయి. స్నాప్‌డ్రాగన్ 427 మోడల్ 2017 నుంచి అందుబాటులో ఉంటుంది.

వేగవంతమైన పనితీరు..

సరికొత్త ఫీచర్లతో వస్తోన్న ఈ శక్తివంతమైన ప్రాసెసర్లు మునుపటి వర్షన్‌లతో పోలిస్తే వేగవంతమైన పనితీరును కనబర్చగలవని క్వాల్కమ్ చెబుతోంది.

క్వాల్కమ్ క్లియర్ సైట్ టెక్నాలజీతో..

క్వాల్కమ్ క్లియర్ సైట్ టెక్నాలజీతో వస్తోన్న ఈ మూడు చిప్ సెట్స్ బడ్జెట్ ఫ్రెండ్లీ ఫోన్‌లలోనూ డ్యుయల్ కెమెరా సెటప్‌కు దోహదపడగలవని తెలుస్తోంది. నిన్నటి వరకు ఈ తరహా టెక్నాలజీ స్నాప్‌డ్రాగన్ 800 సిరీస్ ప్రాసెసర్‌లలో మాత్రమే అందుబాటులో ఉండేది. 

బడ్జెట్ ఫ్రెండ్లీ ఫోన్‌లలోనూ డ్యుయల్ కెమెరా సెటప్..

దీంతో ఖరీదైన ఫోన్‌లలో మాత్రమే డ్యుయల్ కెమెరా సెటప్ అందుబాటులో ఉంది. కొత్త క్వాల్కమ్  ప్రాసెసర్‌ల రాకతో డ్యుయల్ కెమెరా సెటప్ ఏ మాత్రం ఖరీదైనది కాదు. బడ్జెట్ ఫ్రెండ్లీ ఫోన్‌లలోనూ ఈ సెటప్ అందుబాటులోకి వచ్చేస్తుంది.

8జీబి ర్యామ్‌ సపోర్ట్..

క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 652 చిప్‌సెట్‌కు సక్సెసర్ వర్షన్ 653 చిప్‌సెట్ 8జీబి ర్యామ్‌ను కూడా సపోర్ట్ చేస్తుంది. ఇది చాలా మంచి పరిణామం. భవిష్యత్‌లో ఈ కొత్త చిప్‌సెట్‌తో లాంచ్ అయ్యే బడ్జెట్ ఫ్రెండ్లీ స్మార్ట్‌ఫోన్లు 8జీబి ర్యామ్‌తో లభ్యమయ్యే అవకాశాలు కూడా లేకపోలేదు!.

X9 LTE మోడెమ్‌తో ..

క్వాల్కమ్ లాంచ్ చేసిన మూడు కొత్త చిప్‌సెట్స్ అప్‌డేటెడ్ X9 LTE మోడెమ్‌తో వస్తున్నాయి. క్వాల్కమ్ ప్రొపైటరీ క్విక్‌ ఛార్జింగ్ 3.0 టెక్నాలజీని ఇవి సపోర్ట్ చేస్తాయి.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Snapdragon 653, 626, and 427 Unveiled: Brings 8GB RAM, Dual Camera Support To Mid-Range Smartphones. Read More in Telugu Gizbot....
Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting