ఇక పై మొబైల్ ఫోన్ నుంచి తెలుగు ఎస్ఎంఎస్‌లు!!

Posted By:

ఇక పై మొబైల్ ఫోన్ నుంచి తెలుగు ఎస్ఎంఎస్‌లు!!

తెలుగు ప్రజానీకానికి శుభవార్త. మొబైల్ ఫోన్‌ల నుంచి సంక్షిప్త సందేశాలు (ఎస్ఎంఎస్)లను తెలుగులో పంపేందుకు కొత్త అప్లికేషన్ అందుబాటులోకి రాబోతోంది. దేశంలోనే మొట్టమొదటి సారిగా తెలుగు భాషలోనే తెలుగు కీబోర్డుతో ఎస్ఎంఎస్‌లను పంపుకొనే అవకాశాన్ని రాష్ట్ర సమాచార శాఖ కల్పిస్తోంది. ‘తెలుగు మాట'పేరుతో ఈ అప్లికేషన్‌ను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సర్కార్ ఈ నెల 30న అధికారికంగా అందుబాటులోకి తీసుకురాబోతోంది. వినియోగదారులు ఈ యాప్‌ను  teluguvijayam.org వెబ్‌సైట్ ద్వారా ఉచితంగా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు కొత్త అప్లికేషన్‌లో ఒత్తులు,గుణింతాలు అందుబాటులో ఉంచారు. ఆంగ్లం నుంచి సలువుగా తెలుగులోకి మార్చుకునే విధానం కూడా అందుబాటులో ఉంది.

ఇన్స్‌స్టాల్ చేసుకునే విధానం:

తెలుగు మాట అప్లికేషన్ ఆండ్రాయిడ్ ఇంకా ఐవోస్ (యాపిల్) ప్లాట్‌ఫామ్‌ల కోసం అందుబాటులో ఉంచారు. ఒత్సాహికులు teluguvijayam.org  వెబ్‌సైట్‌లోకి ప్రవేశించి ఈ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకుని ఆ తరువాత ఇన్స్‌స్టాల్ చేసుకోవాలి.

ఇన్స్‌స్టాలింగ్ ప్రక్రియ పూర్తిఅయిన వెంటనే ‘తెలుగు మాట' అప్లికేషన్ మీ ఫోన్‌లో ప్రత్యేక్షమవుతుంది. తెలుగు మాట ఆప్షన్‌ను ఆన్ చేసుకున్న వెంటనే యాప్ పనిచేయటం ప్రారంభిస్తుంది.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot