ఎండే ఆహారం!

మైక్రోమాక్స్ సోలార్ చార్జింగ్ పై పనిచేసే శక్తివంతమైన డ్యూయల్ సిమ్ ఫోన్‌ను డిజైన్ చేసింది. పేరు మైక్రోమాక్స్ ఎక్స్259. ఫోన్ వెనుక భాగంలో అమర్చిన సోలార్ ప్యానెల్ సూర్యరసిమి ద్వారా శక్తిని గ్రహించుకుంటుంది. సోలార్ ప్యానల్ ద్వారా డివైజ్ మూడు గంటల్లో సంపూర్ణ చార్జ్ అవుతుంది. ఈ ఛార్జింగ్ 1.5గంటల టాక్‌టైమ్ నిస్తుంది. నిత్యం విద్యుత్ అంతరాయాలతో ఇబ్బందులను ఎదుర్కొనే గ్రామీణ ప్రాంత ప్రజలకు ఈ ఫోన్ మరింత ఉపయుక్తంగా నిలుస్తుంది.
మైక్రోమ్యాక్స్ ఎక్స్259 కీలక ఫీచర్లు:
2.4 అంగుళాల డిస్ ప్లే, (రిసల్యూషన్ 240 x 320పిక్సల్స్),
డ్యూయల్ సిమ్ సపోర్ట్,
1.3మెగా పిక్సల్ కెమెరా,
బ్లూటూత్, జీపీఆర్ఎస్,
మై-జోన్/మై-స్టోర్ లోకి ప్రవేశించే సౌలభ్యత,
1000ఎమ్ఏహెచ్ బ్యాటరీ,
ధర రూ.2,499.


Click it and Unblock the Notifications







