Asusకు బ్రాండ్ అంబాసిడర్‌గా సోనాక్షి సిన్హా

By Sivanjaneyulu
|

తైవాన్‌కు చెందిన ప్రముఖ మొబైల్ ఫోన్‌ల తయారీ కంపెనీ ఆసుస్ (Asus), భారత్‌లో తమ స్మార్ట్‌ఫోన్‌ల వ్యాపారాన్ని మరింత ముందుకు తీసుకువెళ్లేందుకు బాలీవుడ్ సుందరి సోనాక్షి సిన్హాను బ్రాండ్ అంబాసిడర్‌గా నియమించుకుంది. మే 23న జరిగిన జెన్‌ఫోన్ మాక్స్ (2016 ఎడిషన్) స్మార్ట్‌ఫోన్ లాంచ్ ఈవెంట్‌లో భాగంగా ఆసుస్ ఈ వివరాలను వెల్లడించింది.

Asusకు బ్రాండ్ అంబాసిడర్‌గా సోనాక్షి సిన్హా

శక్తివంతమైన 5000 ఎమ్ఏహెచ్ బ్యాటరీతో వస్తోన్న జెన్‌ఫోన్ మాక్స్ కొత్త ఎడిషన్ స్మార్ట్‌ఫోన్‌ను మార్కెట్‌కు పరిచయం చేస్తూ సోనాక్షి సిన్హా నటించిన ప్రత్యేకమైన యాడ్‌ను మార్కెట్లో లాంచ్ చేసింది. #LiveUnplugged నినాదంతో విడుదలైన ఈ యాడ్ సోషల్ మీడియాలో ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యింది. ఈ ప్రకటనలో ఆసుస్ జెన్‌ఫోన్ మాక్స్ బ్యాటరీ సామర్థ్యాన్ని చక్కగా ఆవిష్కరించారు.

Read More: LeEco కంపెనీ నుంచి మరో 3 సూపర్ ఫోన్స్

ఆసుస్‌కు బ్రాండ్ అంబాసిడర్‌గా సోనాక్షి సిన్హా నటించిన మొదటి యాడ్ ఇదే

ఆసుస్‌కు బ్రాండ్ అంబాసిడర్‌గా సోనాక్షి సిన్హా నటించిన మొదటి జెన్‌ఫోన్ మాక్స్ (2016 ఎడిషన్) స్మార్ట్‌ఫోన్ యాడ్ ఇదే.

ఆసుస్ జెన్‌ఫోన్ మాక్స్ (2016) ఎడిషన్

ఆసుస్ జెన్‌ఫోన్ మాక్స్ (2016) ఎడిషన్

5000 ఎమ్ఏహెచ్ బ్యాటరీ సామర్థ్యంతో లభ్యమవుతోన్న జెన్‌ఫోన్ మాక్స్ (2016 ఎడిషన్) స్మార్ట్‌ఫోన్ ను సింగిల్ ఛార్జ్ పై 3 రోజులు వాడుకోవచ్చని చెబుతోంది. స్టాండ్ బై మోడ్ లో 38రోజులు పాటు పని చేసే ఈ ఫోన్ ద్వారా మరొక ఫోన్ ఛార్జ్ చేయవచ్చట. రెండు వేరియంట్ లలో ఈ ఫోన్‌ను అందుబాటులో ఉంచారు. 2జీబి ర్యామ్, 16జీబి ఇంటర్నల్ మెమరీ వేరియంట్ ధర రూ.9,999. 3జీబి ర్యామ్, 32జీబి ఇంటర్నల్ మెమరీ వేరియంట్ ధర రూ.12,999. అమెజాన్, స్నాప్‌డీల్, ఫ్లిప్‌కార్ట్‌లు ఈ స్మార్ట్‌ఫోన్‌లను విక్రయిస్తున్నాయి.

ఆసుస్ జెన్‌ఫోన్ మాక్స్ (2016) ఎడిషన్

ఆసుస్ జెన్‌ఫోన్ మాక్స్ (2016) ఎడిషన్

5.5 అంగుళాల డిస్‌ప్లే (రిసల్యూషన్1280x 720పిక్సల్స్) , కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 4 ప్రొటెక్షన్, ఆక్టా కోర్ స్నాప్‌డ్రాగన్ 615 ప్రాసెసర్ (క్లాక్ వేగం 1.5గిగాహెర్ట్జ్), అడ్రినో 405 గ్రాఫిక్ ప్రాసెసింగ్ యూనిట్, ఆండ్రాయిడ్ మార్ష్‌మల్లో 6.0.1 ఆపరేటింగ్ సిస్టం ఆధారంగా డిజైన్ చేసిన జెన్ యూజర్ ఇంటర్ ఫేస్ పై ఫోన్ రన్ అవుతుంది.

ఆసుస్ జెన్‌ఫోన్ మాక్స్ (2016) ఎడిషన్

ఆసుస్ జెన్‌ఫోన్ మాక్స్ (2016) ఎడిషన్

ర్యామ్ వేరియంట్స్  (2జీబి, 3జీబి), ఇంటర్నల్ స్టోరేజ్ వేరియంట్స్ (16జీబి, 32జీబి), మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 64జీబి వరకు విస్తరించుకునే అవకాశం, 13 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా, 5 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా,

ఆసుస్ జెన్‌ఫోన్ మాక్స్ (2016) ఎడిషన్

ఆసుస్ జెన్‌ఫోన్ మాక్స్ (2016) ఎడిషన్

5000 ఎమ్ఏహెచ్ నాన్ రిమూవబుల్ బ్యాటరీ, కనెక్టువిటీ ఫీచర్లు (4జీ ఎల్టీఈ, జీఎస్ఎమ్, జీపీఆర్ఎస్, జీపీఎస్, ఏజీపీఎస్, బ్లుటూత్, వై-ఫై, మైక్రోయూఎస్బీ).

Best Mobiles in India

English summary
Sonakshi Sinha's New Asus Zenfone Max Ad is going viral and it will make you buy one too!. Read More in Telugu Gizbot...

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X