సోని తాజా సమాచారం!!

By Prashanth
|
Sony


మొబైల్ నిర్మాణ రంగంలో విశ్వసనీయ బ్రాండ్‌గా అంతర్జాతీయ గుర్తింపు పొందిన సోని తనకు అచ్చొచ్చిన ఎక్స్‌పీరియా (Xperia) వర్షన్‌లో కొత్త మోడల్ స్మార్ట్‌ఫోన్‌ను ప్రవేశపెట్టేందుకు సన్నాహాలు చేస్తుంది. సోని ఎక్స్‌పీరియా ‘ఇ డ్రీమ్ 6’ మోడల్‌లో డిజైన్ కాబుడుతున్న ఈ గ్యాడ్జెట్ స్పెసిఫికేషన్స్ మరియు ఫీచర్లు :

కీలక ఫీచర్లు:

గుగూల్ ఆండ్రాయిడ్ 4.0 ఆపరేటింగ్ సిస్టం పై మొబైల్ రన్ అవుతుంది. ప్రాసెసర్ పై ఖచ్చితమైన క్లారిటీ లేనప్పటికి క్లాక్ స్పీడ్ మాత్రం 1500 MHz, జీఎస్ఎమ్(GSM) 850 / 900 / 1800 / 1900 , యూఎమ్ టీఎస్(UMTS) 850 / 1900 / 2100 నెట్‌వర్క్‌లను మొబైల్ సపోర్ట్ చేస్తుంది. నిక్షిప్తం చేసిన జీపీఆర్ఎస్, ఎడ్జ్, హెచ్ఎస్ డీపీఏ వ్యవస్థలు నెట్ బ్రౌజింగ్‌ను మరింత సులభతరం చేస్తాయి.

డిస్‌ప్లే ఫీచర్లు:

ఫోన్ డిస్‌ప్లే 4.6 అంగుళాలు, స్ర్కీన్ రిసల్యూషన్ 720 x 1280 పిక్సల్స్, మల్టీ టచ్ సౌలభ్యతతో డివైజ్‌ను సులువుగా ఆపరేట్ చేయచ్చు.

కనెక్టువిటీ ఫీచర్లు:

మొబైల్లో నిక్ఫిప్తం చేసిన బ్లూటూత్ వర్షన్ 2.1, వైర్ లెస్ లాన్(LAN), అసిస్టడ్ జీపీఎస్ (GPS),యూఎస్బీ 2.0, మైక్రో యూఎస్బీ కనెక్టర్ తదితర అంశాలు వేగవంతమైన డేటా ట్రాన్స్‌ఫరింగ్‌కు దోహదపడతాయి. ర్యామ్ 1జీబి, ఫోన్ ఇంటర్నల్ మెమరీ 10 జీబి, 3.5mm ఆడియో జాక్, యాక్సిలరోమీటర్ సౌకర్యం.

కెమెరా స్పెసిఫికేషన్:

13.2 మెగా పిక్సల్ సామర్ధ్యం గల కెమెరాను మొబైల్‌లో లోడ్ చేశారు. ఆప్టికల్ జూమ్, ఆటో ఫోకస్ , ఎల్ఈడి ఫ్లాష్ వ్యవస్థలు అదనం. ఈ కెమెరా నాణ్యమైన వీడియోల పాటు ఫోటోలునందిస్తుంది. నిరంతరాయంగా వినోదాన్ని పంచే ఆడియో మరియు వీడియో ప్లేయర్ వ్యవస్థను గ్యాడ్జెట్‌లో లోడ్ చేశారు. అత్యాధునిక హంగులతో రూపుదిద్దుకుంటున్న సోని ఎక్స్‌పీరియా ‘ఇ డ్రీమ్ 6’ వచ్చే ఏడాది మార్చిలో వినియోగదారుల ముందుకు రానుంది.

Best Mobiles in India

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X