ఐఎఫ్ఎ 2014 : కొత్త స్మార్ట్‌ఫోన్‌లను ప్రదర్శించిన సోనీ

|

బెర్లిన్ వేదికగా మరికొద్ది గంటల్లో ప్రారంభంకానున్న ఐఎఫ్ఎ 2014 కన్స్యూమర్ ఎలక్ట్రానిక్స్ టెక్నాలజీ ట్రేడ్ ఎగ్జిబిషన్‌కు సోనీ మంచి శుభారంభాన్ని అందించింది. బుధవారం నిర్వహించిన ఐఎఫ్ఎ 2014 ప్రీ ఈవెంట్‌లో భాగంగా సోనీ మూడు సరికొత్త స్మార్ట్‌ఫోన్‌లతో పాటు ఓ టాబ్లెట్ పీసీ అలానే పలు స్మార్ట్‌వేర్ ఉత్పత్తులను ఆవిష్కరించింది. వాటి వివరాలు..

సోనీ ఎక్స్‌పీరియా జెడ్ 3 (స్మార్ట్‌ఫోన్),
సోనీ ఎక్స్‌పీరియా జెడ్ 3 కాంపాక్ట్ (స్మార్ట్‌ఫోన్),
సోనీ ఎక్స్‌పీరియా ఇ3 (స్మార్ట్‌ఫోన్),
సోనీ ఎక్స్‌పీరియా జెడ్ 3 టాబ్లెట్,
సోనీ స్మార్ట్‌వాచ్ 3,

సోనీ ఎక్స్‌పీరియా జెడ్ 3 స్మార్ట్‌ఫోన్ ప్రత్యేకతలు... 5.2 అంగుళాల డిస్‌ప్లే (పూర్తి హైడెఫినిషన్ రిసల్యూషన్ 1920x1080పిక్సల్స్), ఆండ్రాయిడ్ 4.4 కిట్‌క్యాట్ ఆపరేటింగ్ సిస్టం, క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 2.5గిగాహెట్జ్ క్వాడ్‌కోర్ ప్రాసెసర్, అడ్రినో 330 గ్రాఫిక్ ప్రాసెసింగ్ యూనిట్, 3జీబి ర్యామ్, 20.7 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా (ఆటో ఫోకస్, ఎల్ఈడి ఫ్లాష్. 4కే వీడియో రికార్డింగ్ సౌలభ్యత), 2.2 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా (1080 పిక్సల్ హైడెఫినిషన్ క్వాలిటీతో వీడియో కాలింగ్ నిర్వహించుకోవచ్చు అలానే సెల్ఫీలను చిత్రీకరించుకునేందుకు), 16జీబి ఇంటర్నల్ మెమెరీ, మైక్రోఎస్డీ కార్డ్‌‍స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 128జీబి వరకు విస్తరించుకునే అవకాశం, కనెక్టువిటీ ఫీచర్లు (4జీ ఎల్టీఈ, వై-ఫై, బ్లూటూత్, డీఎల్ఎన్ఏ, నియర్ ఫీల్డ్ కమ్యూనికేషన్ ఫీచర్, యూఎస్బీ కనెక్టువిటీ, మైక్రో యూఎస్బీ సపోర్ట్), 3100 ఎమ్ఏహెచ్ బ్యాటరీ. సోనీ ఎక్స్‌పీరియా జెడ్ 3 సింగిల్ ఇంకా డ్యూయల్ సిమ్ వేరియంట్‌లలో లభ్యంకానుంది. ఇండియన్ మార్కెట్లో విడుదలకు సంబంధించి పూర్తి వివరాలను అందాల్సి ఉంది.

సోనీ ఎక్స్‌పీరియా జెడ్ 3 కాంపాక్ట్ స్మార్ట్‌ఫోన్ ప్రత్యేకతలు... 4.5 అంగుళాల హైడెఫినిషన్ ట్రైలూమినస్ ఐపీఎస్ డిస్‌‍ప్లే (రిసల్యూషన్ 1280x720పిక్సల్స్), ఆండ్రాయిడ్ 4.4.4 కిట్‌క్యాట్ ఆపరేటింగ్ సిస్టం, 2.5గిగాహెట్జ్ స్నాప్‌డ్రాగన్ 801 క్వాడ్‌కోర్ ప్రాసెసర్, అడ్రినో 330 గ్రాఫిక్ ప్రాసెసింగ్ యూనిట్, 2జీబి ర్యామ్, 20.8 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా, 2.2 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా (1080 పిక్సల్ వీడియో రికార్డింగ్ సౌలభ్యతతో), 16జీబి ఇంటర్నల్ మెమెరీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 128జీబి వరకు విస్తరించుకునే అవకాశం, కనెక్టువిటీ ఫీచర్లు (4జీ ఎల్టీఈ, 3జీ, వై-ఫై, బ్లూటూత్, జీపీఎస్, గ్లోనాస్, ఎంహెచ్ఎల్, నియర్ ఫీల్డ్ కమ్యూనికేషన్), 2600 ఎమ్ఏహెచ్ బ్యాటరీ. ఫోన్ బరువు 129 గ్రాములు.

సోనీ ఎక్స్‌పీరియా ఇ3 స్మార్ట్‌ఫోన్ ప్రత్యేకతలు.... ఫోన్ బరువు 143.8 గ్రాములు, చుట్టుకొలత 137.1 x 69.4 x 8.5 మిల్లీ మీటర్లు, గూగుల్ ఆండ్రాయిడ్ 4.4 కిట్‌క్యాట్ ఆపరేటింగ్ సిస్టం, 1.2గిగాహెట్జ్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ క్వాడ్‌కోర్ ప్రాసెసర్, 4.5 అంగుళాల ఐపీఎస్ డిస్‌ప్లే (రిసల్యూషన్ 854 x 480పిక్సల్స్), 5 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా, వీజీఏ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, 1జీబి ర్యామ్, 4జీబి ఇంటర్నల్ మెమెరీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 32జీబి వరకు విస్తరించుకునే సౌలభ్యత, 2330 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

సోనీ ఎక్స్‌పీరియా జెడ్ 3 టాబ్లెట్ ప్రత్యేకతలు...

సోనీ ఎక్స్‌పీరియా జెడ్ 3 టాబ్లెట్ ప్రత్యేకతలు... 8 అంగుళాల పూర్తి హైడెఫినిషన్ ట్రైల్యూమినస్ డిస్‌ప్లే (రిసల్యూషన్ 1920 x 1080పిక్సల్స్, ఎక్స్ రియాలిటీ ఇంకా లైవ్ కలర్ ఎల్ఈడి టెక్నాలజీతో), ఆండ్రాయిడ్ 4.4 కిట్‌క్యాట్ ఆపరేటింగ్ సిస్టం, 2.5గిగాహెట్జ్ క్వాడ్‌కోర్ స్నాప్‌డ్రాగన్ 801 సీపీయూ, అడ్రినో 330 గ్రాఫిక్ ప్రాసెసింగ్ యూనిట్, 3జీబి ర్యామ్, 16జీబి ఇంటర్నల్ మెమరీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్, 8.1 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా, 2.2 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, కనెక్టువిటీ ఫీచర్లు (వై-ఫై, 4జీ ఎల్టీఈ), 4500 ఎమ్ఏహెచ్ బ్యాటరీ. వాటర్ ప్రూఫ్ ఇంకా డస్ట్ రెసిస్టెంట్ టెక్నాలజీ.

మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.

వివిధ మోడళ్ల స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.

Best Mobiles in India

English summary
Sony Announcenets At IFA 2014. Read more in Telugu Gizbot.......

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X