మా ఫోన్లో అన్నీ ఉంటాయ్!!

Posted By: Prashanth

మా ఫోన్లో అన్నీ ఉంటాయ్!!

 

తన సరికొత్త స్మార్ట్‌ఫోన్ ఆవిష్కరణకు సంబంధించి సోనీ ఎరెక్సన్ ఓ ప్రకటనను విడుదల చేసింది. సోనీ ఎరెక్సన్ ఐయోన్ LT28 స్మార్ట్‌ఫోన్‌ను సోనీ Aobaగా డబ్ చేసి మార్కెట్లో ప్రవేశపెట్టనున్నట్లు సంస్థ ప్రకటించింది. ఆధునిక ఫీచర్లతో డిజైన్ కాబడిన సోనీ ఆబా వినియోగదారులను ఆకర్షస్తుందనటంలో ఎటువంటి సందేహం లేదు.

ఫీచర్లు:

4.6 అంగుళాల హెడెఫినిషన్ టచ్ స్ర్కీన్, గుగూల్ ఆండ్రాయిడ్ 2.3.7 ఆపరేటింగ్ సిస్టం, క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ MSM8260 చిప్‌సెట్, 1.5Ghz డ్యూయల్ కోర్ ప్రాసెసర్, ఆడిర్నో గ్రాఫిక్ ప్రాసెసింగ్ యూనిట్, 12 మెగా పిక్సల్ రేర్ కెమెరా, 0.3 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా, 1జీబి రోమ్, 14.9జీబి ర్యామ్, ఎక్సటర్నల్ స్టోరేజ్ 32జీబి, వై-ఫై, 3జీ, బ్లూటూత్, ఎడ్జ్, జీపీఆర్ఎస్, యూఎస్బీ, జీపీఎస్, ఆండ్రాయిడ్ బ్రౌజర్, నెట్‌వర్క్ సపోర్ట్ (2జీ,3జీ), ఆడియో ప్లేయర్, వీడియో ప్లేయర్, ఎఫ్ఎమ్ రేడియో, గేమ్స్, బ్యాటరీ స్టాండ్‌బై 400గంటలు. ఈ ఫోన్ ద్వారా సోనీ ఎంటర్‌టైన్‌మెంట్ నెట్‌వర్క్ అదేవిధంగా ఆండ్రాయిడ్ మార్కెట్ అప్లికేషన్‌లను యాక్సిస్ చేసుకోవచ్చు. నేటితరం కోరకుంటున్న అన్ని సదుపాయాలను ఈ

హ్యాండ్‌సెట్‌లో కల్పించారు. ధర ఇతర వివరాలు తెలియాల్సి ఉంది.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot