సోనీ నుంచి ‘యుగా సీ600ఎక్స్’.. సామ్‌సంగ్‌కు పెద్ద సవాల్!

Posted By: Prashanth

సోనీ నుంచి ‘యుగా సీ600ఎక్స్’.. సామ్‌సంగ్‌కు పెద్ద సవాల్!

 

ఈ ఏడాదిగాను ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌ల విభాగంలో సౌత్ కొరియన్ టెక్ దిగ్గజం సామ్‌సంగ్ తన గెలాక్సీ సిరీస్ స్మార్ట్‌ఫోన్‌లతో పూర్తిస్థాయి ఆధిపత్యాన్ని కొనసాగించింది. 2013కుగాను సామ్‌సంగ్ అధిపత్యానికి గండి కొట్టే ప్రయత్నంగా సోనీ ‘యుగా సీ600 ఎక్స్’ పేరుతో శక్తివంతమైన స్మార్ట్‌ఫోన్‌ను డిజైన్ చేస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఎక్స్‌పీరియా బ్లాగ్ నుంచి తాజాగా అందిన వివరాల మేరకు యుగా సీ600 ఎక్స్‌ను జనవరిలో నిర్వహించి కన్స్యూమర్ ఎలక్ట్రానిక్ షో (సీఈఎస్)లో ఆవిష్కరించనున్నారు. ఈ స్మార్ట్‌ఫోన్‌ను మరింత మార్కెట్ ఫ్రెండ్లీ చేసేందుకు ‘ఎక్ప్‌పీరియా జడ్’గా పిలవనున్నట్లు సదరు బ్లాగ్ పేర్కొంది. ఐపీ57 సర్టిఫికేషన్ పొందనున్న ఈ డివైజ్ పటిష్టమైన వాటర్ ఇంకా డస్ట్‌ప్రూఫ్ వ్యవస్థలను కలిగి ఉంటుంది.

ఇంటర్నెట్‌లో అందాల వేట.. వీరే టాప్-5 ముద్దుగుమ్మలు!

‘ఎక్ప్‌పీరియా జడ్’ స్పెసిఫికేషన్‌లు (అనధికారికంగా):

5 అంగుళాల డిస్ ప్లే, రిసల్యూషన్ 1080 పిక్సల్స్,

వాటర్ రెసిస్టెంట్ ఇంకా డస్ట్‌ప్రూఫ్,

క్వాల్కమ్ స్నాప్‌డ్రాగెన్ ఎస్4 ప్రో క్వాడ్‌కోర్ ప్రాసెసర్,

ఆండ్రాయిడ్ 4.1.1 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం,

12 లేదా 13 మెగా పిక్సల్ రేర్ కెమెరా (హైడెఫినిషన్ క్వాలిటీతో),

2జీబి ర్యామ్,

మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా మెమరీని పొడిగించుకునే సౌలభ్యత,

హెచ్‌డిఎమ్ఐ అవుట్.

సామ్‌సంగ్ గెలాక్సీ నోట్ 2కు పెద్ద సవాల్..?

ప్రతిష్టాత్మకంగా రూపుదిద్దుకుంటున్న సోనీ ఎక్ప్‌పీరియా జడ్, సామ్‌సంగ్ గెలాక్సీ నోట్2కు ప్రధాన సవాల్‌గా నిలవనుందని పలువురు విశ్లేషిస్తున్నారు. సామ్‌సంగ్ ఫాబ్లెట్‌ల విభాగంలో రెండవ తరం డివైజ్‌గా విడుదలైన గెలాక్సీ నోట్ 2, 60 రోజుల్లో 5 మిలియన్ యూనిట్లు అమ్ముడుపోయిన విషయం తెలిసిందే.

గెలాక్సీ నోట్2 స్సెసిఫికేషన్‌లు:

5.5 అంగుళాల సూపర్ ఆమోల్డ్ కెపాసిటివ్ టచ్‌స్ర్కీన్, రిసల్యూషన్ 1280 x 720పిక్సల్స్, ఆండ్రాయిడ్ 4.1 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం, 1.6గిగాహెడ్జ్ క్వాడ్‌కోర్ ప్రాసెసర్, 2జీబి ర్యామ్, మైక్రోఎస్డీ కార్డ్ స్లాట్ ద్వారా మెమరీని 332జీబికి పొడిగించుకునే సౌలభ్యత, 8 మెగా పిక్సల్ రేర్ కెమెరా, 1.9మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా, వై-పై 802.11 ఏ/బి/జి/ఎన్, బీఎల్ఎన్ఏ, వై-ఫై డైరెక్ట్, వై-ఫై హాట్ స్పాట్, బ్లూటూత్ విత్ ఏ2డీపీ, 3100 ఎమ్ఏహెచ్ లియోన్ బ్యాటరీ, మెమరీ కాన్ఫిగరేషన్స్ (16జీబి, 32జీబి, 64జీబి).

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot