సోని ఎరిక్సన్ కొత్త మొబైల్ ఎక్స్ పీరియా డుయో

Posted By: Staff

సోని ఎరిక్సన్ కొత్త మొబైల్ ఎక్స్ పీరియా డుయో

ప్రస్తుతం మొబైల్ మార్కెట్‌కి సంబంధించి రాబోయే మొబైల్స్ అన్ని ఇంటర్నెట్‌లో దర్శమిస్తున్నాయి. అఫీసియల్‌గా మొబైల్స్ విడుదల తేదీని ప్రకటించక ముందే ఇంటర్నెట్లో వాటికి సంబంధించిన సమాచారం అంతా పెడుతున్నారు. ఇటీవల కాలంలో సోనీ ఎరిక్సన్ త్వరలో విడుదల చేయనున్నటువంటి మొబైల్‌కి సంబంధించిన సమాచారం ముందుగానే లీక్ అవ్వడం జరిగింది. దీని పూర్తి సమాచారం మీకోసం...

సోనీ ఎరిక్సన్ త్వరలో విడుదల చేయనున్నటువంటి మొబైల్ పేరు సోనీ ఎరిక్సన్ ఎక్స్ పీరియా డుయో. దీనికి సంబంధించిన పిక్చర్స్, ఇన్పర్మేషన్ అంతా లీక్ అయినప్పటికీ ప్రస్తుతం ఈ మొబైల్ మొదటి స్టేజిలో ఉందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. మొబైల్ మార్కెట్లోకి వచ్చినటువంటి రూమర్స్ ప్రకారం ఈ మొబైల్ కొన్ని మంచి ఫీచర్స్‌ని కలిగి ఉందని చెబుతున్నారు. ఇందులో ఉన్న లెటేస్ట్ కొత్త ఫీచర్ ఏమిటంటే ప్రెస్ ఫోటో షూట్. ఇది వినడానికి కొంచెం ఆశ్చర్యం అనిపించినప్పటికీ ఇది నిజం.

సోనీ ఎరిక్సన్ కొత్తగా రూపోందిస్తున్నటువంటి మోడల్స్‌‌లలో ప్రెస్ ఫోటోగ్రఫీని కొత్త ఫీచర్‌గా జత చేస్తున్నారు. అంతేకాకుండా డ్యూయల్ కోర్ Qualcomm ప్రాసెసర్‌తో పాటు 1.4 GHz స్పీడ్‌తో రన్ అవుతుంది. స్పీడ్ రేటింగ్స్‌లో గనుక దీనికి రేటింగి ఇస్తే సోనీ ఎరిక్సన్ ఇప్పటి వరకు రూపోందినటువంటి మొబైల్స్‌లలో ఇది నెంబర్ వన్‌గా నిలుస్తుంది. డ్యూయల్ కోర్ ప్రాసెసర్ ఉండడం వల్ల ఇది మల్టీ టాస్కింగ్ పనులను చాలా వేగవంతంగా చేస్తుంది. వీటితో పాటు సోనీ ఎరిక్సన్ ఎక్స్ పీరియా డుయో 4.5 ఇంచ్ టచ్ స్క్రీన్ సైజుని కలిగి ఉంది. ఈ డిస్‌ప్లే వల్ల హైడెఫినేషన్ రిజల్యూషన్‌ని పోందవచ్చు.

ఇక సోనీ ఎరిక్సన్ ఎక్స్ పీరియో డుయో ఆండ్రాయిడ్ జింజర్‌బ్రెడ్ ఆపరేటింగ్ సిస్టమ్‌తో రన్ అవుతుంది. ఇక ఈ మొబైల్ మార్కెట్లోకి సెప్టెంబర్ లోకి విడుదల అవుతుందని అంటున్నారు.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot