ఎయిర్‌సెల్‌తో సోనీఎరెక్స‌న్ ఒప్పందం వెనక మర్మం..?

By Super
|
Sony Ericsson


ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ సోనీ‌ఎరెక్సన్ తన ప్రచారస్త్రంలో భాగంగా ఎయిర్‌సెల్‌తో ఒప్పందం కుదుర్చుకుంది. ‘సోనీ ఎరెక్సన్ లైవ్ విత్ వాక్‌మెన్’ మోడల్‌లో స్మార్ట్ ఫోన్‌ను సోనీ ఎరెక్సన్ ఇండియన్ మార్కెట్లో అధికారికంగా విడుదల చేయునుంది.

సోనిఎరెక్సన్, ఎయిర్‌సెల్ సంయుక్త ఆధ్వర్యంలో లభ్యం కానున్న ఈ స్మార్ట్ ఫోన్ కోనుగోలు పై ఆశాజనకమైన ఆఫర్లను ప్రవేశపెట్టారు. ఈ డివైజ్ కోనుగోలుతో 20 సినిమా పాటలు పూర్తి నిడివి డౌన్‌లోడ్‌తో పాటు, సోని మ్యూజిక్ నుంచి 2జీబి కంటెంట్‌ను ఉచితంగా పొందవచ్చు. ఈ ఆఫర్ కాల పరిమితి 30 రోజులు మత్రమే.

* 3.2 అంగుళాల టీఎఫ్టీ టచ్‌స్ర్కీన్, * 5మెగా పిక్సల్ రేర్ కెమెరా (రిసల్యూషన్ 2592x1944 పిక్సల్స్) , * వీడియో ఛాటింగ్ కోసం ఫ్రంట్ కెమెరా, * 720 పిక్సల్ హై రిసల్యూషన్‌తో క్వాలిటీ వీడియో రికార్డింగ్ , * అన్ లిమిటెడ్ ఫోన్‌బుక్, * అన్ లిమిటెడ్ కాల్ రికార్డ్స్, * ఇంటర్నల్ మెమెరీ 320 ఎంబీ, * 512ఎంబీ ర్యామ్, * మైక్రో ఎస్డీ‌కార్డ్ స్లాట్ ద్వారా 32జీబి వరకు ఎక్సటర్నల్ స్టోరేజ్, * 3జీ కనెక్టువిటీ సపోర్ట్, * జీపీఆర్ఎస్, ఎడ్జ్, WLAN, బ్లూటూత్, యూఎస్బీ, జీపీఎస్ వంటి పటిష్టమైన డేటా కనెక్టువిటీ వ్యవస్థలు.

జీఎస్ఎమ్, హెచ్ఎస్ డీపీఏ (HSDPA) నెట్‌వర్క్‌లను డివైజ్ సపోర్ట్ చేస్తుంది. * అన్ని ఫార్మాట్లలోని ఆడియో, వీడియో ఫైళ్లు ప్లే అయ్యేందుకు మల్టీ ఫార్మాట్ ప్లేయర్‌ను ఫోన్‌లో దోహదం చేశారు. * గేమ్స్ అదేవిధంగా ఎఫ్ఎమ్ రేడియో అప్లికేషన్‌లను

ఇన్‌బుల్ట్ చేశారు. బ్యాటరీ స్టాండ్ బై 400 గంటలు.

యూజర్ ఫ్రెండ్లీ స్వభావం కలిగిన గుగూల్ లేటెస్ట్ వర్షన్ ఆండ్రాయిడ్ v2.3 ఆపరేటింగ్ సిస్టం‌ను ఫోన్‌లో లోడ్ చేశారు. నిక్షిప్తం చేసిన స్నాప్‌డ్రాగన్ 1 GHz ప్రాసెసర్ డివైజ్ పనితీరును వేగిరతం చేస్తుంది. ఏర్పాటు చేసిన హెచ్టీఎమ్‌ఎల్, ఆడోబ్ ఫ్లాష్ బ్రౌజర్‌లు నెట్ బ్రౌజింగ్‌ను సులభ తరం చేస్తాయి. అన్ని ప్రముఖ గ్యాడ్జెట్ స్టోర్‌లలో ఈ హ్యాండ్ సెట్ ధర రూ.15,000.

Best Mobiles in India

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X