సోనీ ఎరిక్సిన్ మొబైల్ ఫోన్స్ ఇప్పుడు మరింత భద్రం

ఇప్పుడు ఈ సెక్యూరిటీ గురించి ఇదంతా ఎందుకు చెబుతున్నానని అనుకుంటున్నారా.. సోనీ ఎరిక్సన్ ఎక్స్ పీరియా మిని ఫ్రో అనే స్మార్ట్ పోన్‌లో మెకాఫీకి సంబంధించిన సెక్యూరిటీ సాప్ట్ వేర్‌ని ఇనిస్టాల్ చేయడం జరుగుతుందన్నమాట. ఈ సెక్యూరిటీ సాప్ట్ వేర్‌ని మొబైల్‌లో ఇనిస్టాల్ చేయడం వల్ల ఇంటర్నెట్ బ్రౌజర్‌ని అన్ని రకాల వైరస్‌ల నుండి కాపాడుతుందని అన్నారు. ఇందులో ఉన్న మరికొన్ని ఫీచర్స్ ఐతే కేవలం బ్రౌజర్‌నే కాకుండా మొబైల్‌ని కూడా సంరక్షించడానికి ఉపయోగపడతాయి. అంతేకాకుండా ఇందులో ఉన్న లోకేషన్ ట్రాకర్ సహాయంతో వైరస్‌లను పూర్తిగా తీసివేయడంతో పాటు అలారమ్ సహాయంతో ఎప్పటికప్పుడు తెలియజేస్తుంది.
వీటితో పాటు మీ మొబైల్‌లో ఉన్న సురక్షిత సమాచారం అంతా వేరే వారి నుండి కాపాడడం కోసం రిమోట్ లాక్ అనే ఫీచర్‌ని రూపోందిచడం జరిగింది. ఎప్పుడైనా మొబైల్‌ని పోగొట్టుకున్నా లేక దొంగతనం చేయబడ్డా కూడా ఎటువంటి డేటాని పూర్తిగా తీసివేసే వెసులుబాటు ఉంది. సాధారణంగా వైరస్‌లు మనం ఏదైనా కంటెంట్‌ని ఇంటర్నెట్ నుండి డౌన్ లోడ్ చేసేటప్పుడు లేదా మెయిల్స్ డౌన్ లోడింగ్, ఛాటింగ్ వాటి ద్వారా మొబైల్‌కి రావడం జరుగుతుంది. ఇలాంటి వాటన్నింటికి కూడా మెకాఫీ సెక్యూరిటీ సాప్ట్ వేర్ రానివ్వకుండా అడ్డుపడుతుంది. ఈ సందర్బంలో మెకాఫీ ప్రెసిడెంట్ టోడ్ గీబార్ట్ మాట్లాడుతూ మొబైల్‌లో డేటాని పరిరక్షించడం కోసం మేము రూపోందించిన ఈ సాప్ట్ వేర్ నిజంగా మైల్ స్టోన్ లాంటిదని అన్నారు.


Click it and Unblock the Notifications








