సోనీ అమ్ముల పొది నుండి అధ్బుతమైన ఫోన్

Posted By: Staff

సోనీ అమ్ముల పొది నుండి అధ్బుతమైన ఫోన్

ఇండియన్ మొబైల్ మార్కెట్లో డ్యూయల్ కోర్ ప్రాసెసర్ పవర్ హ్యాండ్ సెట్స్‌కి గిరాకీ అంతా ఇంతా కాదు. దీనిని ఆసరాగా తీసుకొని సోనీ ఎరిక్సన్ మొబైల్స్ త్వరలో మొబైల్ మార్కెట్లోకి డ్యూయల్ కోర్ ప్రాసెసర్ కలిగిఉన్న నోజిమి స్మార్ట్ ఫోన్‌ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తుంది. సోనీ ఎరిక్సన్ నోజిమి స్మార్ట్ ఫోన్‌ని హై ఎండ్ ఫీచర్స్‌తో అట్టహాసంగా విడుదల చేయడానికి సోనీ ఎరిక్సన్ సన్నాహాలు చేస్తుంది. ఐఫోన్ 4, శ్యామ్‌సంగ్ గెలాక్సీ 2లకు సోనీ ఎరిక్సన్ నోజిమి గట్టి పోటీని ఇస్తుందని తెలియజేస్తున్నారు.

సోనీ ఎరిక్సన్ నోజిమి స్మార్ట్ ఫోన్‌ని వచ్చే సంవత్సరం విడుదల చేసే విధంగా ప్రణాళికలను రూపోందిస్తున్నారు. ఒక్కసారి నోజిమి స్మార్ట్ ఫోన్ మార్కెట్లోకి విడుదలైన తర్వాత అందరి చూపు దానివైపుకి ఆటోమేటిక్‌గా మరలుతుందని అంటున్నారు. అందుకు కారణం సోనీ ఎరిక్సన్ నోజిమిలో ఉన్న ఫీచర్స్. స్వతహాగా క్యాండీ బార్ మోడల్‌కి చెందిన నోజిమి స్మార్ట్ ఫోన్ 1280 x 720 ఫిక్సల్ రిజల్యూషన్‌తో పాటు, 16M కలర్ సపోర్ట్‌ని చేస్తుంది. ఆపిల్ కొత్త ఐప్యాడ్ రెటినా డిస్ ప్లే కంటే కూడా నోజిమి డిస్ ప్లే బ్రహ్మండంగా ఉంటుందని అంటున్నారు. నోజిమి స్మార్ట్ ఫోన్ కోసం సోనీ‌ఎరిక్సన్ 1.5 GHz డ్యూ యల్ కోర్ ప్రాసెసర్‌ని ఉపయోగించినట్లు సమాచారం.

సిపియుకి సంబంధించిన విషయాలు ఇంకా మార్కెట్లో వెల్లడవలేదు. RAM సైజు మాత్రం సుమారుగా 1జిబి వరకు ఉండవచ్చునని అంచనా. ఇక నెట్ వర్క్ విషయానికి వస్తే 2జీ, 3జీ రెండింటిని కూడా సపోర్ట్ చేస్తుంది. నోజిమి స్మార్ట్ ఫోన్ ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్‌తో రన్ అవుతుంది. అది కూడా ఆండ్రాయిడ్ ఐస్ క్రీమ్ శాండి విచ్ లేదా జింజర్ బ్రెడ్ ఆపరేటింగ్ సిస్టమ్ అవుతుందని నిపుణుల అభిప్రాయం. 12 మెగా ఫిక్సల్ కెమెరాని నిక్షిప్తం చేయడం జరిగిందని సమాచారం. కెమెరాతో పాటు ఆటోఫోకస్, ఎల్‌ఈడి లాంటి ఫీచర్స్ ప్రత్యేకం.

హై డెఫినేషన్ వీడియో రికార్డింగ్‌కి కూడా సపోర్ట్ చేస్తుంది. కనెక్టివిటీ, కమ్యూనికేషన్ ఫీచర్స్ విషయానికి వస్తే GPRS, EDGE, 802.11 WiFiలతో పాటు బ్లూటూత్ A2DP 2.1 వర్సన్‌ని కూడా సపోర్ట్ చేస్తుంది. వీటితో పాటు అదనంగా NeoReader barcode scanner, Wisepilot navigation, Track ID music recognition, HDMI port, TV out, A-GPS లాంటి మరెన్నో ఫీచర్స్ అదనం. ఎంటర్టెన్మెంట్ విషయంలో కూడా యూజర్స్‌ని నిరాశకు గురిచేయదు. మొబైల్ మార్కెట్లో లభించే అన్ని రకాల ఆడియో, వీడియో ఫార్మెట్లను సపోర్ట్ చేస్తుంది.

సోనీ‌ఎరిక్సన్ నోజిమి మార్కెట్లో నలుపు, తెలుపు కలర్స్‌లలో లభ్యమవుతుంది. మొబైల్‌తో పాటు విస్తరించుకునే అవకాశం లేకుండా 32జిబి మొమొరీని ఒకేసారి ఇవ్వడం జరుగుతుంది. ఇండియన్ మొబైల్ మార్కెట్లో ఇప్పటి వరకు దీని ధరను విడుదల చేయకపోయినప్పటికీ పలు టెక్నాలజీ బ్లాగులు వెల్లడించిన దాని ప్రకారం సుమారుగా రూ 29,000 వరకు ఉండవచ్చునని అంచనా..

Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting