సోని ఎరెక్సన్ నుంచి మరో బ్లాక్ బస్టర్ మొబైల్!!

Posted By: Staff

సోని ఎరెక్సన్ నుంచి మరో బ్లాక్ బస్టర్ మొబైల్!!

 

ప్రపంచ ప్రఖ్యాత బ్రాండ్ సోని ఎరెక్సన్ నుంచి మరో బ్లాక్ బస్టర్ స్మార్ట్ మొబైల్ రాబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ‘సోనీ ఎరెక్సన్ ST25i కమ్ క్వాట్’గా వస్తున్న ఈ ఫోన్ తెలివైన సాఫ్ట్‌వేర్ వ్యవస్థను కలిగి పనితీరు విషయంలో నిక్కచ్చిగా వ్యవహరిస్తుందని విశ్లేషణలు స్పష్టం చేస్తున్నాయి.

ఇప్పటికే బహిర్గతమైన ఈ డివైజ్ స్పెసిఫికేషన్స్ ప్రపంచ వ్యాప్త సోనీ ఎరెక్సన్ అభిమానులను ఊరిస్తున్నాయి. హై ఎండ్ టెక్నాలజీకి మారు పేరుగా నిలిచిన ‘సోనీ ఎరెక్సన్’ఈ తాజా విడుదలతో మరిన్ని సంచలనాలు నమోదు చేయటం ఖాయమంటున్నారు టెక్ పండితులు.

ఫోన్ ఫీచర్లు:

* ఆండ్రాయిడ్ v2.3 జింజర్ బ్రెడ్ ఆపరేటింగ్ సిస్టం, * డ్యూయల్ కోర్ 1 GHz ప్రాసెసర్, * 3.5 అంగుళాల ఎల్‌సీడీ టచ్‌స్ర్కీన్, * 5 మెగా పిక్సల్ రేర్ కెమెరా (ఫ్లాష్, ఆటో ఫోకస్ సపోర్ట్), * వీజీఏ ఫ్రంట్ కెమెరా, * మన్నికైన రిసల్యూషన్‌తో వీడియోలు తీసుకునే సామర్ధ్యం, * ఫోన్ బుక్ స్టోరేజి అన్‌లిమిటెడ్, * కాల్ రికార్డ్ స్టోరేజి అన్‌లిమిటెడ్, * జీపీఆర్ఎస్ సపోర్ట్, ఎడ్జ్ సపోర్ట్ , 3జీ కనెక్టువిటీ, * వై-ఫై, బ్లూటూత్, యూఎస్బీ కనెక్టువిటీ, * 2జీ, 3జీ నెట్‌వర్క్ సపోర్ట్, * ఆడియో ప్లేయర్, వీడియో ప్లేయర్, ఎఫ్ఎమ్ రేడియో, గేమ్స్, * హెచ్టీఎమ్ఎల్, ఆడోబ్ ఫ్లాష్ బ్రౌజర్.......

తాజాగా వృద్థి చేసిన అప్లికేషన్‌లను ఈ హ్యాండ్‌‌సెట్‌లో నిక్షిప్తం చేశారు. ధర వివరాలు త్వరలోనే వెల్లడవుతాయి.

Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot