ధర తక్కువ లేక నాణ్యమైన ఫీచర్సా మీరే ఎంచుకొండి..

Posted By: Super

ధర తక్కువ లేక నాణ్యమైన ఫీచర్సా మీరే ఎంచుకొండి..

వన్ టచ్ ఫేస్‌బుక్ బటన్, గ్రూప్ ఛాటింగ్, ఫాస్టెస్ట్, ఈజియస్ట్ వీడియో, ఫోటో అప్ లోడ్స్ మరియు షేరింగ్ ఇవన్నీ కలిసున్న మొబైల్ హెట్ చిసి చాచా. రౌండ్ ద క్లాక్ ప్రపంచంలో ఎప్పుడైనా, ఎక్కడైనా మీ స్నేహితులను ఎల్లప్పుడూ ఆన్‌లైన్‌లో టచ్‌లో ఉండాలనుకుంటే మీ చెంత చాచా ఉండాల్సిందేనని నిపుణులు అంటున్నారు. అన్ని హాంగులతో అందంగా తీర్చిదిద్దినటువంటి హెచ్ టిసి చాచాతో నేను పోటీ పడతానంటుంది సోనీ ఎరిక్సన్ టెక్ట్స్ ప్రో.

రెండు మొబైల్స్‌లలో కూడా ఒకే విధమైన ఫీచర్స్ ఉన్నప్పటికీ సోనీ ఎరిక్సన్‌లో కొన్నిఫీచర్స్‌ని యాడ్ చేయడం వల్ల కొత్త రూపురేఖలు దిద్దుకుంది. సోనీ ఎరిక్సన్‌లో యాడ్ చేసినటువంటి ఆ కొత్త ఫీచర్ ఏమిటంటే ఒకేసారి ఐదుగురు స్నేహితులకు సంబంధించిన ఫేస్‌బుక్, ట్విట్టర్ ఎకౌంట్ల యాక్టివిటీస్‌ మోనటరింగ్ చేయవచ్చు. అదే హెచ్ టిసిలో ఐతే మాత్రం గ్రూపింగ్ ఫంక్షన్ ద్వారా ఆన్ లైన్‌లో ఉన్న స్నేహితులను ఇట్టే పసిగేట్టేయవచ్చు.

రెండు మొబైల్స్ కూడా స్టాండర్డ్ క్వర్టీ కీబోర్డ్‌ని కలిగి ఉండడం వల్ల స్నేహితులకు మెసేజ్‌లను చాలా సులువుగా పంపే అవకాశం ఉంది. రెండు మొబైల్స్ కూడా చూడడానికి చక్కగా కటింగ్ ఎడ్జిని కలిగి ఉండడమే కాకుండా ఆన్‌లైన్ యాక్సెస్‌‌ని ఈజీగా చేయడం కోసం బ్లూటూత్ ఫెసిలిటీ ఉంది. ఇక కెమెరా విషయంలో సోనీ ఎరిక్సన్ టెక్ట్స్ ప్రో కంటే కూడా హెచ్ టిసి చాచా నే బెస్టు. హెచ్ టిసి చాచా 5 మెగా ఫిక్సల్ కెమెరాతో పాటు ఆటో ఫోకస్, ఎల్‌ఈడి ఫ్లాష్‌ని కలిగి ఉంది. ముందు భాగంలో ఉన్న కెమెరా సహాయంతో వీడియో కాలింగ్ ఫీచర్‌ని కూడా సపోర్ట్ చేస్తుంది.

అదే సోని ఎరిక్సన్ టెక్ట్స్ ప్రో మాత్రం యూజర్స్‌కు చక్కని విజువల్ ఎక్స్ పీరియన్స్‌ని అందించేదుకు, చక్కని ఇమేజిలను తీసేదుంకుగాను 3.2 మెగా ఫిక్సల్ కెమెరాని కలిగి ఉంది. హెచ్ టిసి మొబైల్స్ తయారీదారు ఇటీవల కాలంలో హెచ్ టిసి సెన్స్ అనే కొత్త ఫీచర్‌ని అందిస్తున్నారు. రెండు మొబైల్స్ కూడా జిఎస్‌ఎమ్ ఫ్రీక్వెన్సీని సపోర్ట్ చేయడమే కాకుండా, టచ్ స్క్రీన్ ఫీచర్స్, ఇమేజి జూమ్, వీడియో క్యాప్చరింగ్ లాంటి అరుదైన ఫీచర్స్‌ని కలిగి ఉన్నాయి. ఇక ఎంటర్టెన్మెంట్ విషయంలో యూజర్స్‌ని రెండు మొబైల్స్ నిరాశ పరచవు. అందుకు కారణం ప్రస్తుతం మార్కెట్లో ఉన్న అన్ని రకాల ఆడియో, వీడియో ఫార్మెట్లను ఈ రెండు మొబైల్స్ సపోర్ట్ చేయడమే.

ఇక కమ్యూనికేషన్, కనెక్టివిటీ టెక్నాలజీలు అయిన బ్లూటూత్, వై-పైలను సపోర్ట్ చేస్తాయి. యూజర్స్ చక్కని ఆడియో, వీడియో సాంగ్స్‌ని పర్సనల్ కంప్యూటర్ నుండి మొబైల్‌లోకి ప్రవేశపెట్టడం కోసం యుఎస్‌బి సింక్‌తో పాటు 3.5mm ఆడియో జాక్ ప్రత్యేకం. ఇక హెచ్ టిసి చాచా ధరని ఇండియన్ మార్కెట్లో రూ 14,700గా నిర్ణయించడమైంది. ఐతే మార్కెట్లో ఉన్న మరో రూమర్ ఏమిటంటే టాక్స్ గనుక యాడ్ ఐతే హెచ్ టిసి చాచా ధర రూ 15,200వరకు ఉండవచ్చునని అభిప్రాయపడుతున్నారు. సోనీ ఎరిక్సన్ మాత్రం ఎల్లప్పుడూ కస్టమర్స్‌ని దృష్టిలో పెట్టుకోని తక్కువ ధరకే అత్యంత నాణ్యమైన స్మార్ట్ ఫోన్స్‌ని మార్కెట్లోకి విడుదల చేస్తున్నాయి. అందుకే కాబోలు సోనీ ఎరిక్సన్‌ టెక్ట్స్ ప్రో ధరని కేవలం రూ 7,276గా నిర్ణియిండమైంది.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot