సోనీ డ్యూయల్ 'కోర్ ప్రాసెసర్' మొబైల్

Posted By: Super

సోనీ డ్యూయల్ 'కోర్ ప్రాసెసర్' మొబైల్

ఇటీవలే సోనీ ఎరిక్సన్ కంపెనీని సోనీ కంపెనీ విలీనం చేసుకున్న సంగతి తెలిసిందే. ఇక మీదట మార్కెట్లోకి విడుదలయ్యే అన్ని సోనీ ఎరిక్సన్ మొబైల్స్ సోనీ పేరు మీద విడుదలవుతుండడం విశేషం. ఇటీవల మార్కెట్లోకి విడుదలయ్యే ఎక్కు స్మార్ట్ ఫోన్స్ గూగుల్ ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్ మీద రన్ అవుతున్నాయి. సోనీ కూడా మార్కెట్లోకి కొత్త కొత్త ఉత్పత్తులను ప్రవేశపెట్టడానికి మార్గాన్ని సుగమనం చేసుకుంది.

అందులో భాగంగానే డ్యూయల్ కోర్ ప్రాససెర్‌తో రన్ అయ్యేటటువంటి మొట్టమొదటి మొబైల్ ఫోన్‌ని మార్కెట్లోకి విడుదల చేస్తుంది. దీనికి సంబంధించిన ఫోటోలు ఇంటర్నెట్లో హాల్ చల్ చేస్తున్నాయి. సోనీ విడుదల చేయనున్న ఈ స్మార్ట్ ఫోన్ పేరు 'సోనీఎరిక్సన్ ఎక్స్ పీరియా ఆర్క్ హెచ్‌డి'. ఈ మొబైల్ ఫోన్ ఫీచర్స్ విషయానికి వస్తే యూజర్స్‌కు చక్కని విజువల్ ఎక్స్ పీరియన్స్‌ని అందించేందుకు గాను దీని యొక్క స్క్రీన్ సైజు 4.3 ఇంచ్‌గా రూపొందించడం జరిగింది.

ఇక మొబైల్ వెనుక భాగాన ఉన్న 12 మెగా ఫిక్సల్ కెమెరా సహాయంతో అందమైన ఫోటోలను తీయవచ్చు. మొబైల్ ఫెర్పామెన్స్ ఫాస్టుగా ఉండేందుకు గాను డ్యూయల్ కొర్ 1.5GHz ప్రాసెసర్, 1GB RAMని నిక్షిప్తం చేయడం జరిగింది. మొబైల్‌తో పాటు ఇంటర్నల్‌గా మెమరీ లభిస్తున్నప్పటికీ, ఇందులో ఉన్న మైక్రో ఎస్‌డి స్లాట్ ద్వారా మెమరీని 32జిబి వరకు విస్తరించుకొవచ్చు. సోనీఎరిక్సన్ ఎక్స్ పీరియా ఆర్క్ హెచ్‌డి మొబైల్‌ని ఉపయోగించి 720p ఫిక్సల్ రిజల్యూషన్‌ హైడేఫినేషన్ వీడియోని తీయవచ్చు.

సోనీ ఎరిక్సన్ కంపెనీని సోనీ విలీనం చేసుకున్న తర్వాత విడుదలవుతున్న మొట్టమొదటి మొబైల్ ఈ 'సోనీఎరిక్సన్ ఎక్స్ పీరియా ఆర్క్ హెచ్‌డి' కావడంతో దీనిపై అభిమానులు ఆశలు పెట్టుకొవడం జరిగింది.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot