మనసులను డాష్.. డాష్ చేసేస్తుంది!!

Posted By: Super

మనసులను డాష్.. డాష్ చేసేస్తుంది!!

 

భారత్ మొబైల్ ఫోన్‌ల విపణిలో లభ్యమవుతున్న చవక ధర వాక్‌మెన్ ఫోన్‌ సోనీ ఎరెక్సన్ W205 వినోద ప్రియులను మరింత ఆకట్టుకుంటుంది. ఈ ఉత్తమ మల్టీ మీడియా ఫోన్ అత్యుత్తమ మ్యూజిక్ అనుభూతులను  చేరువ చేస్తుంది. మార్కెట్లో ఖచ్చితమైన ధర రూ.4,000. స్లైడర్ డిజైన్‌లో  ఫోన్‌ను రూపొందించారు. ఈ డిజైనింగ్ ఆకర్షణీయమైన లుక్‌ను కలిగి ఉంటుంది. పూర్తి స్థాయి వినోద సంబంధిత ఫీచర్లను  హ్యాండ్‌సెట్‌లో నిక్షిప్తం చేశారు. మీకు నచ్చిన ట్యూన్‌లను ఫ్రెండ్స్‌తో షేర్ చేసుకునే విధంగా స్పీకర్ ఫోన్ వ్యవస్థను డివైజ్‌లో ఏర్పాటు చేశారు.

ఫోన్ ఇతర టెక్నికల్ స్పెసిఫికేషన్‌లు, ఫీచర్లు:

- 1.3 మెగా పిక్సల్ కెమెరా (2.2x డిజిటల్ జూమ్, వీడియో రికార్డింగ్),

- వాక్‌మెన్ ప్లేయర్,

- 1.8 అంగుళాల టీఎఫ్‌టి స్ర్కీన్,

- 2జీబి మెమెరీ కార్డు,

- బ్యాటరీ బ్యాకప్ 435 గంటల స్టాండ్ బై, 9 గంటల టాక్ టైమ్,

- ఓపెరా మినీ వెబ్ బ్రౌజర్,

- రేడియో రికార్డ్ ఫీచర్,

- బ్లూటూత్,

- యూఎస్బీ,

- బుల్ట్ ఇన్ టార్చ్,

- ఫోన్ బరువు 96 గ్రాములు.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot