ఆ విషయంలో చరిత్ర పునారవృతమవుతుందా..?

Posted By: Prashanth

ఆ విషయంలో చరిత్ర పునారవృతమవుతుందా..?

 

సోనీ, ఎరెక్సన్ సంయుక్త ఆధ్వర్యంలో ఈ ఏడు నూతన ఆవిష్కరణలకు సంబంధించి పలు హ్యాండ్‌ సెట్లను, తాజాగా నిర్వహించిన ‘కన్స్యూమర్ ఎలక్ర్టానిక్ షో’లో ప్రదర్శించింది. 2010లో జూలీ ప్రాజెక్ట్ పేరుతో సోని ఎరెక్సన్ విండోస్ ఆపరేటింగ్ సిస్టం ఆధారితంగా రన్ అయ్యే ఓ కట్టింగ్ ఎడ్జ్ స్మార్ట్ ఫోన్‌ను డవలప్ చేస్తున్నట్లు వార్తలు వినిపించాయి. 4 అంగుళాల డిస్‌ప్లే, క్వర్టీ కీప్యాడ్, 1 GHz సింగిల్ కోర్ ప్రధాన ఫీచర్లుగా తెరకెక్కిన ఈ స్లైడర్ ఫోన్ ప్రాజెక్ట్ అనివార్య కారణాల వల్ల అటకెక్కింది.

తాజాగా విండస్, సోని ఎరెక్సన్ కలయకకు సంబంధించి పలు ఫోటోలు వెబ్‌లో దర్శనమిచ్చాయి. విండోస్ ఫోన్ 7.5 ఆపరేటింగ్ సిస్టం ఆధారితంగా పని చేసే స్మార్ట్ ఫోన్‌ను సోనీ ఎరెక్సన్ డవలెప్ చేస్తున్నట్లు పుకార్లు వ్యక్తమవుతున్నాయి. ఈ అంశానికి సంబంధించి సోనీ ఎరెక్సన్ వర్గాల ఏ విధమైన అధికారిక ప్రకటనా లేదు. విండోస్ ఆధారిత ఫోన్‌లను లాంఛ్ చేయబోమని ఇదివరుకే తేల్చి చెప్పిన సోనీ ఎరెక్సన్ వర్గాలు తాజాగా వ్యక్తమవుతున్న రూమర్ల పై ఏ విధంగా స్పందిస్తాయో వేచి చూడాలి మరి..!!!

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot