లీకైన 'సోనీ ఎరిక్సన్ హెచ్‌డి' మొబైల్ ఫీచర్స్..

Posted By: Prashanth

లీకైన 'సోనీ ఎరిక్సన్ హెచ్‌డి' మొబైల్ ఫీచర్స్..

 

సోనీ ఎరిక్సన్ రాబోయే కాలంలో మార్కెట్లోకి విడుదల చేయనున్న 'సోనీ ఎక్స్‌పీరియా ఆర్క్ హెచ్‌డి' స్మార్ట్ ఫోన్‌కి సంబంధించిన సమాచారం నెటిజన్లుకు తెలియకుండా చేయడం పెద్ద కష్టంగా మారింది. ఎందుకంటే 'సోనీ ఎక్స్‌పీరియా ఆర్క్ హెచ్‌డి' స్మార్ట్ ఫోన్‌ చెందిన మరి కొంత సమాచారం ఇంటర్నెట్లో హాల్ చల్ చేయడమే కాకండా ఈ స్మార్ట్ ఫోన్ ఫీచర్స్ కోసం ప్రతి ఒక్క మొబైల్ ప్రేమికుడు అన్వేషించడం మొదలుపెట్టాడు.

ఈ స్మార్ట్‌ఫోన్ కోడ్ నేమ్ 'నోజోమి' ఇంటర్నెట్‌లో హాల్ చల్ చేస్తుంది.స్మార్ట్ ఫోన్ ఫెర్పామెన్స్ ఫాస్టుగా ఉండేందుకు గాను 1.5 GHz డ్యూయల్ కోర్ ప్రాసెసర్‌ని నిక్షిప్తం చేయడం జరిగింది. మొబైల్‌తో పాటు ఇంటర్నల్‌గా 32జిబి మెమరీ లభిస్తుండగా ఇందులో మైక్రో ఎస్‌డి కార్డు లేక పోవడం విశేషం. పవర్ పుల్ బ్యాటరీ బ్యాక్‌అప్‌ని అందించేందు గాను ఇందులో 1750 mAh బ్యాటరీని నిక్షిప్తం చేయడం జరిగింది. 1GB RAM ప్రత్యేకం. యూజర్స్‌కు చక్కని విజువల్ ఎక్స్ పీరియన్స్‌ని అందించేందుకు గాను దీని స్కీన్ సైజు 4.3 ఇంచ్‌లుగా రూపొందించడం జరిగింది. మొబైల్ వెనుక భాగాన ఉన్న 12 మెగా ఫిక్సల్ కెమెరా సహాయంతో ఫోటోలను తీయడమే కాకుండా, 720p ఫార్మెట్లో వీడియోలను తీయవచ్చు

ఇంటర్నెట్లో లీకైన కొన్ని ఇమేజిలను వన్ ఇండియా మొబైల్ పాఠకుల కోసం ప్రత్యేకంగా అందించడం జరుగుతుంది. పైన చిత్రంలో మీరు చూస్తున్న ఇమేజిలు 'సోనీ ఎక్స్‌పీరియా ఆర్క్ హెచ్‌డి' స్మార్ట్ ఫోన్‌కి చెందినవి. 'సోనీ ఎక్స్‌పీరియా ఆర్క్ హెచ్‌డి' స్మార్ట్ ఫోన్‌ జనవరి 10 - 13 తారీఖులలో జరగనున్న CES 2012లో ప్రమోట్ చేయనున్నారు. 2012వ సంవత్సరంలో మొబైల్ రంగంలో విడుదల కానున్న 'సోనీ ఎక్స్‌పీరియా ఆర్క్ హెచ్‌డి' స్మార్ట్ ఫోన్‌ మార్కెట్లో హాట్ టాఫిక్‌గా మారనుందని సమాచారం.

'సోనీ ఎక్స్‌పీరియా ఆర్క్ హెచ్‌డి' స్మార్ట్ ఫోన్‌ ప్రత్యేకతలు:

ప్రాసెసర్:dual-core CPU 1.5 GHz

బ్యాటరీ:1750 mAh

మెమరీ కార్డు:32 GB

RAM:1GB of RAM

కెమెరా:12 megapixel

వీడియో రికార్డింగ్:720p

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot