జపాన్‌లో భూకంపం కారణంగా..?

Posted By: Prashanth

జపాన్‌లో భూకంపం కారణంగా..?

 

సోని ఎరెక్సన్ ఇటీవల విడుదల చేసిన స్మార్ట్ ఫోన్ ‘ఎక్స్‌పీరియా నియో’ (Xperia Neo) మార్కెట్లో హిట్ టాక్ తెచ్చుకున్న విషయం తెలిసిందే. కొద్ది నెలల క్రితం జపాన్‌లో సంభవించిన పెను భూకంపం ఈ వర్షన్ స్మార్ట్‌ఫోన్ ఉత్పత్తి పై తీవ్ర ప్రభావం చూపింది. ఈ కారణంగా కెమెరా సెన్సార్ల కొరత ఏర్పడింది.

తొలత విడుదల చేసిన ఎక్స్‌పీరియా నియోలో 8 మెగా పిక్సల్ కమెరా సెన్సార్లను వినియోగించారు. కొరత ఏర్పడటంతో వాటి స్థానంలో 5 మెగా పిక్సల్ కెమెరా సెన్సార్లను ఏర్పాటు చేయాల్సి వచ్చింది. తక్కువ పిక్సల్ కెమెరా వర్షన్‌లో విడుదలవుతున్న ఈ స్మార్ట్ ఫోన్ వర్షన్ పేరు ‘ఎక్స్‌పీరియా నియో వీ’(Xperia Neo V).

స్సెసిఫికేషన్లను పరిశీలిస్తే 3.7 అంగుళాల డిస్‌ప్లే 480 x 854 రిసల్యూషన్ కలిగి ఉంటుంది. సోని మొబైల్ బ్రావియా గ్రాఫిక్ ఇంజన్‌ను ఫోన్లో నిక్షిప్తం చేశారు. శక్తివంతమైన 1 GHz Qualcomm MSM8255 స్కార్పియన్ కోర్ ప్రాసెసర్ అదే విధంగా Adreno 205 గ్రాఫిక్ చిప్ వ్యవస్థలను డివైజులో లోడ్ చేశారు. ఆండ్రాయిడ్ జింజర్ బోర్డ్ 2.3 ఆపరేటింగ్ వ్యవస్థ ఆధారితంగా స్మార్ట్ ఫోన్ స్మూత్ మోషన్‌లో రన్ అవుతుంది.

ఏర్పాటు చేసిన వై-ఫై, జీపీఎస్, బ్లూటూత్ వ్యవస్థలు కనెక్టువిటి సామర్ధ్యాన్ని మరింత బలోపేతం చేస్తాయి. ముందుగానే లోడ్ చేసిన స్టీరియో ఎఫ్ఎమ్ నిరంతరాయంగా వినోదాన్ని పంచుతుంది. ఉత్తమమైన స్మార్ట్ ఫోన్లలో ఎక్స్‌పీరియా నియో వీ ఒకటి ధర రూ.15,000.

Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting