గేమింగ్ ఎక్స్ పీరియన్స్ కావాలంటే 'ఎక్స్ పీరియా ప్లే' కొనాల్సిందే

Posted By: Staff

గేమింగ్ ఎక్స్ పీరియన్స్ కావాలంటే 'ఎక్స్ పీరియా ప్లే' కొనాల్సిందే

మొబైల్స్‌లలో గేమ్స్ ఆడడం అనేది ప్రయాణాలలో చాలా ఆసక్తిగా ఉంటుంది. అందుకే కాబోలు మొబైల్ కంపెనీలు కూడా గేమ్స్ కోసం ప్రత్యేకంగా మొబైల్స్‌ని తయారు చేస్తూ ఉంటారు. అందులో భాగంగానే మొబైల్ రంగంలో నెంబర్ వన్‌గా కొనసాగుతున్న సోనీ ఎరిక్సన్ గేమ్స్ కోసం ప్రత్యేకంగా ఎక్స్ పీరియా ప్లేని విడుదల చేసింది. ఇప్పటికే మార్కెట్లోకి విడుదలైన ప్రతిచోటా మంచి స్పందన రావడంతో సోనీ ఎరిక్సన్ ఎక్స్ పీరయా ప్లే విషయంలో ఓ నిర్ణయం తీసుకుంది.

సోనీ ఎరిక్సన్ లో మరికొన్ని గేమ్స్‌ని లోడ్ చేసి మరలా మార్కెట్లోకి విడుదల చేయాలని నిర్ణయం తీసుకుంది. అందులో భాగంగానే సోనీ ఎరిక్సన్ ఎక్స్ పీరియా ప్లే 20 కొత్త గేమ్స్‌ని విడుదల చేయనుంది. వాటిల్లో 10 గేమ్స్ మాత్రం హ్యాండ్ సెట్స్ ఫెర్పామెన్స్ కోసం ప్రత్యేకంగా రూపోందించడం జరిగింది. సోనీ ఎరిక్సిన్ విడుదల చేయనున్న వీడియో గేమ్స్ యొక్క పాపులర్ టైటిల్స్ షాడో వ్యాన్ గార్డ్, బ్యాటిల్ ఫీల్డ్ బ్యాడ్ కంపెనీ 2, మొజాంగ్ మైన్ క్రాఫ్ట్, ఐస్ బ్రేకర్, డిజర్డ్ విండ్స్ లాంటి ఎంతో ముఖ్యమైన గేమ్స్ ని ఇందులో పోందుపరచడం జరిగింది. ఇందులో ఇమడింపచేసినటువంటి అన్ని రకాల గేమ్స్ కూడా యూజర్స్‌కు చక్కని గేమింగ్ ఎక్స్ పీరియన్స్‌ని అందించనున్నాయి.

అంతేకాకుండా మొబైల్‌ని టివికి కనెక్ట్ చేసుకొని కూడా యాజర్స్ ప్లే చేసేటటువంటి వెసులుబాటు కూడా కల్పించడం జరిగింది. మొత్తం 150 గేమ్స్ వరకు సోనీ ఎరిక్సన్ ఎక్స్ పీరియా ప్లే కోసం విడుదల చేయనున్నామని తెలిపారు. ఇంకో ముఖ్యమైన విషయం ఏమిటంటే ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్‌ మొబైల్స్‌లలో ఉండేటటువంటి రేసింగ్ గేమ్ రెక్ లెస్ గేట్ వే కూడా ఇందులో ఇమడింపజేయడం జరిగింది. అన్ని రకాల అత్యాదునికమైన గేమ్స్ మాత్రమే కాకుండా సోషల్ నెట్ వర్కింగ్ వెబ్ సైట్స్ అయిన ఫేస్ బుక్, ట్విట్టర్ లాంటి వాటిని కూడా హ్యాండ్ సెట్‌లో ఇంటిగ్రేడ్ చేయడం జరిగింది. దీని ప్రత్యేకత ఏమిటంటే మీరు గేమ్స్ చేసినటువంటి అత్యధిక స్కోర్, మంచి మూమెంట్స్ అన్నింటిని కూడా మీ స్నేహితులకు స్క్రీన్ షాట్స్ ద్వారా ఫేస్ బుక్‌లో అప్ లోడ్ చేసేటటువంటి అవకాశం ఉంది.

సోనీ ఎరిక్సన్ ఎక్స్ పీరియా ప్లే ఇంతగా మార్కెట్లో క్లిక్ అవడానికి కారణం మొబైల్‌తో పాటు ఇచ్చేటటువంటి ఎక్స్ పీరియన్స్ ప్యాకే కారణం అని అంటున్నారు నిపుణులు. ఎక్స్ పీరియన్స్ ప్యాక్‌లో D300 Multimedia Dock, pocket USB cables ద్వారా యూజర్స్ గేమింగ్ ఎక్స్ పీరియన్స్‌ని పోందుతున్నారు. అందుకే సోనీ ఎరిక్సన్ ఎక్స్ పీరియా ప్లే మొబైల్‌ని 'ప్లే స్టేషన్ మొబైల్' అని అన్నారు. ఇక దీని ధర కూడా కేవలం రూ 29,000 మాత్రమే.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot