రాష్ట్రంలో 250కోట్ల వ్యాపారమే లక్ష్యం: సోనీ

Posted By:

ఎక్స్‌పీరియా సిరీస్ స్మార్ట్‌ఫోన్‌ల అమ్మకాలకు సంబంధించి 2013-14కుగాను రాష్ట్రంలో రూ.250కోట్ల మేర వ్యాపారమే లక్ష్యంగా ప్రణాళికలు రచిస్తున్నట్లు సోనీ ఇండియా మొబైల్ డివిజన్ హెడ్ సచిన్ తాపర్ శుక్రవారం హైదరాబాద్‌లో అన్నారు. సరికొత్త స్మార్ట్‌ఫోన్ సోనీ ఎక్స్‌పీరియా జడ్‌ను హైదరాబాద్‌లో ఆవిష్కరించిన సందర్భంగా తాపర్ పాత్రికేయులతో మాట్లాడుతూ సోనీ ఎక్స్‌పీరియా హ్యాండ్‌సెట్‌లకు సంబంధించి ప్రచారాల నిమిత్తం రూ. 21కోట్లను వెచ్చించనున్నట్లు తెలిపారు. ఎక్స్‌పీరియా ఫోన్‌ల దేశవ్యాప్త అమ్మకాలకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ వాటా 7 శాతంగా అంచనా వేస్తున్నట్లు ఆయన అన్నారు. దేశంలో తమ అవుట్ లెట్‌ల సంఖ్యను 350 నుంచి 550కి పెంచేందుకు నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.

రాష్ట్రంలో 250కోట్ల వ్యాపారమే లక్ష్యం: సోనీ

సోనీ ప్రతిష్టాత్మకంగా డిజైన్ స్మార్ట్‌ఫోన్ ‘ఎక్స్‌పీరియా జెడ్' స్పెసిఫికేషన్‌లు:

5 అంగుళాల హైడెఫినిషన్ కెపాసిటివ్ టచ్‌స్ర్కీన్ (రిసల్యూషన్ 1920 x 1080పిక్సల్స్), మొబైల్ బ్రావియా ఇంజన్ 2, క్వాడ్‌కోర్ 1.5గిగాహెట్జ్ స్నాప్‌డ్రాగెన్ ఎస్4 ప్రాసెసర్, ఆండ్రాయిడ్ 4.1 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం, 13 మెగా పిక్సల్ రేర్ కెమెరా, 2.2 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా (వీడియో కాలింగ్ నిర్వహించుకునేందుకు), 2జీబి ర్యామ్, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా మెమరీని 32జీబికి పొడిగించుకునే సౌలభ్యత, వై-ఫై, బ్లూటూత్, నియర్‌ఫీల్డ్ కమ్యూనికేషన్, 4జీ ఎల్టీఈ కనెక్టువిటీ, ధర 38,990.

మొబైల్ ఇంకా స్మార్ట్‌ఫోన్ గ్యాలరీల కోసం....

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot