స్మార్ట్‌ఫోన్ ఫోటోగ్రఫీలో సరికొత్త శకం, సోనీ నుంచి 48 మెగా పిక్సల్ ఇమేజ్ సెన్సార్

జపాన్‌కు చెందిన ప్రముఖ కన్స్యూమర్ ఎలక్ట్రానిక్స్ బ్రాండ్ సోనీ, స్మార్ట్‌ఫోన్‌ల కోసం ఓ సరికొత్త కెమెరా సెన్సార్‌ను మార్కెట్లో అనౌన్స్ చేసింది.

|

జపాన్‌కు చెందిన ప్రముఖ కన్స్యూమర్ ఎలక్ట్రానిక్స్ బ్రాండ్ సోనీ, స్మార్ట్‌ఫోన్‌ల కోసం ఓ సరికొత్త కెమెరా సెన్సార్‌ను మార్కెట్లో అనౌన్స్ చేసింది. IMX586 పేరుతో ఈ సీఎమ్ఓఎస్ ఇమేజ్ సెన్సార్ అందుబాటులో ఉంటుంది. ఏకంగా 48 మెగా పిక్సల్ (8,000x6,000 రిసల్యూషన్) కౌంటింగ్‌తో వస్తోన్న ఈ 1/2 టైప్ (8.0 ఎమ్ఎమ్ డయాగనల్) యూనిట్‌ అన్ని స్మార్ట్‌ఫోన్‌లకు సూట్ అవుతుందట. ప్రస్తుత మార్కెట్లో లభ్యమవుతోన్న హై-రిసల్యూషన్ కెమెరా సెన్సార్ ఫోన్‌లను మనం పరిశీలించినట్లయితే.. హువావే పీ20 ప్రో 40 మెగా పిక్సల్ కెమెరా సెన్సార్‌తోనూ, నోకియా లుమియా 1020 మోడల్ 41 మెగా పిక్సల్ కెమెరా సెన్సార్‌లతో లభ్యమవుతున్నాయి. వీటిని అధిగమించేలా ఏకంగా 48 మెగా పిక్సల్ ఇమేజింగ్ సెన్సార్‌ను సోనీ అందుబాటులోకి తీసుకువచ్చింది. త్వరలో మార్కెట్లోకి రాబోతోన్న అన్ని హై-ఎండ్ స్మార్ట్‌ఫోన్‌లలో ఈ కెమెరా సెన్సార్‌ను నిక్షిప్తం చేసే అవకాశముంది.

 
Sony IMX586 Smartphone

శాంపిల్ షిప్‌మెంట్స్ సెప్టంబర్ నుంచి..
ఇప్పటి వరకు మార్కెట్లో అందుబాటులో ఉన్న కెమెరా సెన్సార్‌లతో పోలిస్తే సోనీ ఐఎమ్ఎక్స్ 585 సెన్సార్ హై-క్వాలిటీ స్మార్ట్‌ఫోన్ ఫోటోగ్రఫీని ఆఫర్ చేస్తుందని కంపెనీ చెబుతోంది. ఈ ఇమేజ్ సెన్సార్‌కు సంబంధించిన శాంపిల్ షిప్‌మెంట్స్ సెప్టంబర్ నుంచి ప్రారంభమవుతాయని కంపెనీ వెల్లడించింది. జపాన్ మార్కెట్లో ఈ సెన్సార్ ధర JPY 3,000 (ఇండియన్ కరెన్సీలో రూ.1,800)గా ఉంటుంది. ఇతర పన్నులతో కలుపుకుంటే ఈ ధర మరింతా పెరుగుతుంది.

 

బడ్జెట్ ధరలో ఈ వారం లాంచ్ అయిన స్మార్ట్‌ఫోన్లు ఇవే !బడ్జెట్ ధరలో ఈ వారం లాంచ్ అయిన స్మార్ట్‌ఫోన్లు ఇవే !

నాలుగు పిక్సల్స్‌ను కంభైన్ చేస్తూ ప్రత్యేకమైన టెక్నిక్..
ప్రత్యేకించి స్మార్ట్‌ఫోన్‌ల కోసం అభివృద్థి చేసిన ఈ కెమెరా సెన్సార్ 0.8 మైక్రాన్ పిక్సల్స్‌ను ఆఫర్ చేస్తుంది. ఈ మైక్రాన్ పిక్సల్ మరింత చిన్నగా ఉండటం వల్ల తక్కువ వెళుతురు కండీషన్స్‌లో ఇబ్బందులు తలెత్తే అవకాశముంది. ఇదే సమయంలో నాయిస్ అనేది కూడా ఎక్కువుగా ఉండే అవకాశముంది. ఈ సమస్యను దృష్టిలో ఉంచుకుని సోనీ, Huawei మాదిరిగానే నాలుగు పిక్సల్స్‌ను కంభైన్ చేస్తూ సెన్సిటివిటీని పెంచే ప్రయత్నం చేసింది. నాలుగు పిక్సల్స్ కంభైన్ చేయటం వల్ల 12 మెగా పిక్సల్ ఇమేజ్ డెలివరీ అవుతుంది.

Quad Bayer colour filter...
ఈ సెన్సార్ ద్వారా హై-సెన్సిటివిటీ షూటింగ్‌ను సాధ్యం చేసే క్రమంలో కంభైన్ చేసిన నాలుగు పిక్సల్స్ నుంచి ఒకటే కలర్ ప్రొడ్యూస్ అయ్యేందుకు Quad Bayer colour filterను సోనీ ఉపయోగించింది. ఇలా చేయటం వల్ల తక్కువ వెళుతుతు కండీషన్స్‌లో తీసేటపుడు నాలుగు సమీప పిక్సల్స్‌కు సంబంధించిన కలర్ యాడ్ అయి బ్రైట్నెస్ లెవల్స్ పెరుగుతాయి. ఇదే సమయంలో నాయిస్ అనేది కూడా తగ్గించబడుతుంది. ఈ ఇమేజింగ్ సెన్సార్ ద్వారా పగటి వెళుతురులో ఫోటోలను క్యాప్చుర్ చేసేటపుడు సెన్సార్‌లోని 48 ఎఫెక్టివ్ మెగా పిక్సల్ ఇమేజెస్ రియల్ టైమ్‌లో వర్క్ అవ్వటం ప్రారంభిస్తాయి.

Best Mobiles in India

English summary
Sony has announced a new image sensor for smartphones that features 48 effective megapixels (8,000x6,000 pixels). The new IMX586 stacked CMOS image sensor is touted to sport the industry's highest pixel count onto a 1/2-type (8.0 mm diagonal) unit, suitable for smartphones.

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X