సోనీ ఎక్స్‌పీరియా సిరీస్ నుంచి రెండు కొత్త ఫోన్‌లు

Posted By:

బుధవారం కొత్తఢిల్లీలో ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో సోనీ ఇండియా తన ఎక్స్‌పీరియా సిరీస్ నుంచి రెండు స్మార్ట్‌ఫోన్‌లతో పాటు ఒక ట్యాబ్లెట్ పీసీని దేశీయ విపణికి పరిచయం చేసింది. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ప్రముఖ బాలివుడ్ నటి కత్రీనా కైఫ్ ‘ఎక్స్‌పీరియా జడ్', ‘ఎక్స్‌పీరియా జడ్ఎల్' స్మార్ట్‌ఫోన్‌లతో పాటు ఎక్స్‌పీరియా ట్యాబ్లెట్ జడ్‌ను ఆవిష్కరించారు. ఎక్స్‌పీరియా జడ్ ఇంకా జడ్‌ఎల్ స్మార్ట్‌ఫోన్‌లు నేటి నుంచి ప్రీఆర్డర్ పై లభ్యమవుతున్నాయి. వచ్చే వారం నుంచి ఈ హ్యాండ్‌సెట్‌లు రిటైల్ మార్కెట్లో లభ్యమవుతాయి. ఎక్స్‌పీరియా ట్యాబ్లెట్ జడ్ మేలో విడుదల కానుంది. ధరలను పరిశీలించినట్లయితే ఎక్స్‌పీరియా జడ్ రూ.38,990. మరో ఫోన్ ఎక్స్‌పీరియా జడ్ఎల్ రూ.36,990. ట్యాబ్లెట్ ధరకు సంబంధించి పూర్తి వివరాలు అందాల్సి ఉంది. కీలక స్పెసిఫికేషన్‌లు......

మొబైల్, స్మార్ట్‌ఫోన్‌ ఇంకా ల్యాప్‌టాప్‌లకు సంబంధించి మరిన్నిఫోటో గ్యాలరీల చూసేందుకు క్లిక్ చేయండి:

ఎక్ప్‌పీరియా జడ్ (Xperia Z):

5 అంగుళాల హైడెఫినిషన్ కెపాసిటివ్ టచ్‌స్ర్కీన్ (రిసల్యూషన్ 1920 x 1080పిక్సల్స్), మొబైల్ బ్రావియా ఇంజన్ 2, క్వాడ్‌కోర్ 1.5గిగాహెట్జ్ స్నాప్‌డ్రాగెన్ ఎస్4 ప్రాసెసర్, ఆండ్రాయిడ్ 4.1 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం, 13 మెగా పిక్సల్ రేర్ కెమెరా, 2.2 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా (వీడియో కాలింగ్ నిర్వహించుకునేందుకు), 2జీబి ర్యామ్, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా మెమరీని 32జీబికి పొడిగించుకునే సౌలభ్యత, వై-ఫై, బ్లూటూత్, నియర్‌ఫీల్డ్ కమ్యూనికేషన్, 4జీ ఎల్టీఈ కనెక్టువిటీ, ధర 38,990.
ఈ హ్యాండ్‌సెట్‌ను ఆన్‌లైన్ ద్వారా బుక్ చేసుకోవలనుకుంటన్నారా, అయితే క్లిక్ చేయండి:

సోనీ ఎక్స్‌పీరియా సిరీస్ నుంచి రెండు కొత్త ఫోన్‌లు

ఎక్స్‌పీరియా జడ్ఎల్ (Xperia ZL):

ఎక్స్‌పీరియా జడ్‌తో పోలిస్తే చిన్నదైన form factor, 5 అంగుళాల హైడెఫినిషన్ కెపాసిటివ్ టచ్‌స్ర్కీన్ (రిసల్యూషన్ 1920 x 1080పిక్సల్స్), మొబైల్ బ్రావియా ఇంజన్ 2, క్వాడ్ కోర్ 1.5గిగాహెట్జ్ స్నాప్ డ్రాగెన్ ఎస్4 ప్రాసెసర్, ఆండ్రాయిడ్ 4.1 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం, 13 మెగా పిక్సల్ రేర్ కెమెరా, 2.2 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా (వీడియో కాలింగ్ నిర్వహించుకునేందుకు), 2జీబి ర్యామ్, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా మెమరీని 32జీబికి పొడిగించుకునే సౌలభ్యత, వై-ఫై, బ్లూటూత్, నియర్ ఫీల్డ్ కమ్యూనికేషన్, 4జీ ఎల్టీఈ కనెక్టువిటీ, ధర రూ. 36,990. ఈ హ్యాండ్ సెట్ ను ఆన్ లైన్ ద్వారా బుక్ చేసుకోవలనుకుంటన్నారా, అయితే క్లిక్ చేయండి:

ఎక్స్‌పీరియా ట్యాబ్లెట్ జడ్ (Xperia Tablet Z):

10.1 అంగుళాల రియాల్టీ డిస్‌ప్లే, పూర్తిస్థాయి హైడెఫినిషన్ స్ర్కీన్ రిసల్యూషన్ (1920 x 1080పిక్సల్స్), మొబైల్ బ్రావియా ఇంజన్ 2, 1.2గిగాహెట్జ్ క్వాడ్‌కోర్ ప్రాసెసర్, ఆండ్రాయిడ్ 4.1 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం, 8 మెగా పిక్సల్ ఎక్సినోస్ ఆర్‌ రేర్ కెమెరా, 2 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా (వీడియో కాలింగ్ నిర్వహించుకునేందుకు), ఆన్‌బోర్ట్ స్టోరేజ్ 16జీబి/32జీబి, 2జీబి ర్యామ్, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా మెమరీని పొడిగించుకునే సౌలభ్యత, వై-ఫై, బ్లూటూత్, నియర్ ఫీల్డ్ కమ్యూనికేషన్ (ఎన్ఎఫ్‌సీ), 3జీ కనెక్టువిటీ, 6000ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot