సోనీ నుంచి మరో నాజూకు శ్రేణి స్మార్ట్‌పోన్ ‘సోనీ ఎక్స్‌పీరియా టీ3’

Posted By:

జపాన్‌కు చెందిన ప్రముఖ స్మార్ట్‌ఫోన్‌ల తయారీ కంపెనీ సోనీ ‘ఎక్స్‌పీరియా టీ3'(Xperia T3) మరో నాజూకు శ్రేణి స్మార్ట్‌పోన్‌ను మంగళవారం అంతర్జాతీయ మార్కెట్లో ఆవిష్కరించింది. ఈ మధ్య ముగింపు స్మార్ట్ మొబైలింగ్ డివైస్ కేవలం 7 మిల్లీమీటర్ల మందాన్ని కలిగి ఉంటుంది. బరువు 148 గ్రాములు, స్టెయిన్‌లెస్ స్టీల్‌ఫ్రేమ్‌ను ఈ సాగసరి స్మార్ట్‌ఫోన్‌కు ప్రత్యేకమైన ఆకర్షణగా నిలుస్తుంది. జూలై 2014లో ఈ ఫోన్‌లను అంతర్జాతీయంగా విడుదల చేసేందుకు సోనీ సన్నాహాలు చేస్తోంది. వైడ్, బ్లాక్ ఇంకా పర్పిల్ కలర్ వేరియంట్‌లలో ఫోన్ లభ్యమవుతోంది.

సోనీ నుంచి మరో నాజూకు శ్రేణి స్మార్ట్‌పోన్ ‘సోనీ ఎక్స్‌పీరియా టీ3’

సోనీ ఎక్స్‌పీరియా టీ3 5.3 అంగుళాల హైడెఫినిషన్ ట్రైల్యూమినస్ డిస్‌ప్లేను కలిగి ఉంటుంది (రిసల్యూషన్ సామర్థ్యం720x 1280పిక్సల్స్), ఆండ్రాయిడ్ 4.4 కిట్‌క్యాట్ ఆపరేటింగ్ సిస్టం పై ఫోన్ రన్ అవుతుంది. 1.4గిగాహెట్జ్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 400 ప్రాసెసర్, 1జీబి ర్యామ్, 8జీబి ఇంటర్నల్ మెమరీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 32జీబి వరకు విస్తరించుకునే సౌలభ్యత, 8 మెగా పిక్సల్ కెమెరా (ఆటో ఫోకస్ సోనీ ఎక్స్ మార్ సెన్సార్), 1.1 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా (వీడియో కాలింగ్ నిర్వహించుకునేందుకు). ఫోన్ వెనుక భాగంలో అమర్చిన 8 మెగా పిక్సల్ కెమెరా ద్వారా 720 పిక్సల్ క్వాలిటీ వీడియో రికార్డింగ్ సాధ్యమవుతుంది. కనెక్టువిటీ ఫీచర్లను పరిశీలించినట్లయితే... వై-ఫై, నియర్ ఫీల్డ్ కమ్యూనికేషన్, ఎల్టీఈ కనెక్టువిటీ, ఏ-జీపీఎస్ కనెక్టువిటీ, 2500 ఎమ్ఏహెచ్ బ్యాటరీ (స్టాండ్ బైటైమ్ 688 గంటలు, 12గంటలు).

మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.

వివిధ మోడళ్ల స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot