Home
Mobile

ఈ ఫోన్ ఖరీదు రూ. 72వేలకు పై మాటే, ఒకటే హైలెట్ ఫీచర్‌

ప్రముఖ ఎలక్ట్రానిక్స్ తయారీదారు సోనీ తన నూతన ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్ ఎక్స్‌పీరియా ఎక్స్‌జడ్2ను తాజాగా ఇండియాలో విడుదల చేసింది.

By Hazarath Aiah

ప్రముఖ ఎలక్ట్రానిక్స్ తయారీదారు సోనీ తన నూతన ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్ ఎక్స్‌పీరియా ఎక్స్‌జడ్2ను తాజాగా ఇండియాలో విడుదల చేసింది. కాగా బార్సిలోనాలో జరుగుతున్న మొబైల్ వరల్డ్ కాంగ్రెస్ (ఎండబ్ల్యూసీ) 2018 ప్రదర్శనలో ఈ ఫోన్‌ను ప్రదర్శించిన విషయం అందరికీ తెలిసిందే. కాగా ప్రపంచంలోనే తొలిసారిగా 4కే హెచ్‌డీఆర్‌ మూవీ రికార్డింగ్‌ ఫీచర్‌తో ఈ స్మార్ట్‌ఫోన్ ను కంపెనీ లాంచ్ చేసింది. ఇండియాలో అందుబాటులో ఉన్న తమ కంపెనీ స్మార్ట్‌ఫోన్లలో ఇదే అత్యంత ఖరీదైన మొబైల్‌గా సోనీ కంపెనీ పేర్కొంది.

సోనీ ఎక్స్‌పీరియా ఎక్స్‌జడ్2 ఫీచర్లు

సోనీ ఎక్స్‌పీరియా ఎక్స్‌జడ్2 ఫీచర్లు

5.7 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ ప్లస్ డిస్‌ప్లే, 2160 x 1080 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, గొరిల్లా గ్లాస్ 5 ప్రొటెక్షన్, ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగన్ 845 ప్రాసెసర్, 4 జీబీ ర్యామ్, 64 జీబీ స్టోరేజ్, 400 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 8.0 ఓరియో, డ్యుయల్ సిమ్, ఐపీ 68 వాటర్, డస్ట్ రెసిస్టెన్స్, 19 మెగాపిక్సల్ బ్యాక్ కెమెరా, 5 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, యూఎస్‌బీ టైప్ సి, ఫింగర్‌ప్రింట్ సెన్సార్, 4జీ వీవోఎల్‌టీఈ, డ్యుయల్ బ్యాండ్ వైఫై, బ్లూటూత్ 5.0, ఎన్‌ఎఫ్‌సీ, 3180 ఎంఏహెచ్ బ్యాటరీ, క్విక్ చార్జ్ 3.0, వైర్‌లెస్ చార్జింగ్.

ధర

ధర

ఈ ఫోన్‌ ధర రూ.72,990గా కంపెనీ నిర్ణయించింది. ఆగస్టు 1 నుంచి ఎంపిక చేసిన సోనీ సెంటర్లు, రిటైల్‌ స్టోర్లలో ఈ స్మార్ట్‌ఫోన్‌ అందుబాటులో ఉంటుందని సోనీ ఇండియా ప్రకటించింది.

5.7 ఇంచెస్ సైజ్ కలిగిన ఫుల్ వ్యూ డిస్‌ప్లే

5.7 ఇంచెస్ సైజ్ కలిగిన ఫుల్ వ్యూ డిస్‌ప్లే

5.7 ఇంచెస్ సైజ్ కలిగిన ఫుల్ వ్యూ డిస్‌ప్లేను ఏర్పాటు చేశారు. దీనికి గొరిల్లా గ్లాస్ ప్రొటెక్షన్ ఉంది. ఈ ఫోన్ 3డీ గ్లాస్ బాడీను కలిగి ఉంది. ప్రపంచంలోనే మొదటి సారిగా ఈ ఫోన్‌లో 4కె హెచ్‌డీఆర్ వీడియోలను తీసుకునే సాంకేతిక పరిజ్ఞానాన్ని ఏర్పాటు చేశారు.

సూపర్‌ స్లో మోషన్‌ వీడియో రికార్డింగ్‌

సూపర్‌ స్లో మోషన్‌ వీడియో రికార్డింగ్‌

6జిబి ర్యామ్, 64 జీబీ ఇంటర్నల్‌ మెమొరీని కలిగిన ఈ ఫోన్‌లో సూపర్‌ స్లో మోషన్‌ వీడియో రికార్డింగ్‌ సదుపాయం ఉంది. లిక్విడ్ బ్లాక్, లిక్విడ్ సిల్వర్, డీప్ గ్రీన్, యాష్ పింక్ రంగుల్లో ఈ ఫోన్ యూజర్లకు త్వరలో లభ్యం కానుంది.

Best Mobiles in India

English summary
Sony launches Xperia XZ2 with 4K HDR video recording at Rs 72,990 More news at Gizbot Telugu
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X