రూటు మార్చిన సోనీ, వచ్చే ఏడాది సంచలనపు ఫోన్ !

Written By:

మార్కెట్లో ఇప్పుడు అంతా బెజిల్ లెస్ యుగం నడుస్తోంది. మొబైల్ కంపెనీలు వినియోగదారులను ఆకట్టుకునేందుకు బెజిల్ లెస్ డిస్ ప్లేతో తమ ఫోన్లను మార్కెట్లోకి వదులుతున్నాయి. అన్ని కంపెనీలు ఇప్పుడు పెద్ద డిస్‌ప్లే, సన్నని అంచుల తాకేతెరతో తమ స్మార్ట్‌ఫోన్లను తయారుచేస్తున్నాయి. ఇప్పుడు సోనీ కూడా అదే బాటలో నడుస్తోంది.

రెడ్‌మి5ఎకి దిమ్మతిరిగే షాక్ ఇవ్వనున్న భారత్ 5

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

థిక్‌ బెజల్స్‌తోనే

సోనీ ఇప్పటిదాకా థిక్‌ బెజల్స్‌తోనే తన ఫోన్లను మార్కెట్లోకి తీసుకువచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు సోనీ కన్ను బెజల్లెస్‌ డిస్‌ప్లే మీద పడినట్లు తెలుస్తోంది. బెజల్లెస్‌ డిస్‌ప్లేతో ఓ మొబైల్‌ను రూపొందిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి.

కెమెరా నాణ్యత, స్పష్టమైన డిస్‌ప్లేతో..

వాస్తవానికి మంచి కెమెరా నాణ్యత, స్పష్టమైన డిస్‌ప్లేతో రూపొందే సోనీ మొబైల్స్‌ వినియోగదారులను అమితంగా ఆకట్టుకుంటున్నప్పటికీ అత్యధిక మంది సోనీ వినియోగదారులు బెజల్లెస్‌ డిస్‌ప్లే ఫోన్లు కావాలని కోరుతున్నారని సమాచారం.

తన నిర్ణయాన్ని మార్చుకుని..

వినియోగదారుల నుంచి అలాంటి పరిస్థితులు ఎదురవుతుండటంతో సోనీ తన నిర్ణయాన్ని మార్చుకుని బెజల్లెస్‌ డిస్‌ప్లే వైపు అడుగులు వేస్తుందని సమాచారం.

హెచ్‌8451 మోడల్‌ నెంబర్‌తో..

ఈ నేపథ్యంలోనే సోనీ హెచ్‌8451 మోడల్‌ నెంబర్‌తో ఓ మొబైల్ ని మార్కెట్లోకి తీసుకువస్తోంది. వచ్చే ఏడాది స్పెయిన్‌లో జరిగే మొబైల్‌ వరల్డ్‌ కాంగ్రెస్‌లో ఈ కొత్త మోడల్‌ను ఆవిష్కరిస్తామని సమాచారం.

 

5.7 అంగుళాల 4కే హెచ్‌డీఆర్‌ డిస్‌ప్లే..

ప్రస్తుతం లీక్‌ అయిన వాటి ప్రకారం 5.7 అంగుళాల 4కే హెచ్‌డీఆర్‌ డిస్‌ప్లేతో ఉండే మోడల్‌కు గొరిల్లా గ్లాస్‌ 5ను అమర్చనున్నట్లు తెలుస్తోంది. స్నాప్‌డ్రాగన్‌ 835 ప్రాసెసర్‌ ఉండే అవకాశం ఉంది.

4జీబీ ర్యామ్‌

4జీబీ ర్యామ్‌, 64 జీబీ అంతర్గత మెమొరీ, 3420 ఎంఏహెచ్‌ బ్యాటరీ ఉంటాయి. ఆండ్రాయిడ్‌ 8.0 ఓరియో వెర్షన్‌తో విడుదల చేయబోతున్నారని రూమర్స్ వినిపిస్తున్నాయి.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Sony could finally ditch its boxy design and launch a bezel-less phone next year More News at Gizbot Telugu
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot