'సోనీ పెప్పర్' ని ట్రై చేయండి.. !

Posted By: Staff

 'సోనీ పెప్పర్' ని ట్రై చేయండి.. !

 

ఎలక్ట్రానిక్స్ రంగంలో తనకంటూ ఓ ప్రత్యేకతను సంపాదించుకున్న సోనీ ఎరిక్సన్ గత జనవరిలో కనిపించి కనిపించకుండా 'సోనీ ఎమ్‌టి 27ఐ పెప్పర్' స్మార్ట్ ఫోన్‌కు సంబంధించిన ఇమేజిలు మార్కెట్లోకి వచ్చిన సంగతి తెలిసిందే. ఐతే ఇప్పుడు సోనీ అధికారకంగా 'సోనీ ఎమ్‌టి 27ఐ పెప్పర్'‌కు సంబంధించిన ఇమేజిలను విడుదల చేసింది.

'సోనీ ఎమ్‌టి 27ఐ పెప్పర్' స్మార్ట్ ఫోన్ నియర్ ఫీల్డ్ కమ్యూనికేషన్‌ని సపోర్ట్ చేయనుంది. ఇక ఈ మొబైల్ ప్రత్యేకతలను గమనించినట్లేతే 1GHz dual-core సిపియుతో పాటు NovaThor U8500 ఛిప్ సెట్ దీని సొంతం. యూజర్స్‌కు చక్కని విజువల్ ఎక్స్ పీరియన్స్‌ని అందించేందుకు గాను దీని స్కీన్ సైజు 3.7 ఇంచ్‌లుగా రూపొందించడం జరిగింది. స్క్రీన్ రిజల్యూషన్ 480x854 ఫిక్సల్స్. యూజర్స్ కోసం ఇందులో 5 మెగా ఫిక్సల్ కెమెరాని నిక్షిప్తం చేశారు. 'సోనీ ఎమ్‌టి 27ఐ పెప్పర్' స్మార్ట్ ఫోన్‌కి సంబంధించిన మరిన్ని వివరాలు సంక్షిప్తంగా అందజేసేందుకు సిద్దంగా ఉన్నాం.

Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot