సోనీ ఎక్స్‌పీరియా స్మార్ట్‌ఫోన్‌లకు ఆండ్రాయిడ్ జెల్లీబీన్ అప్‌డేట్!

|

సోనీ ఎక్స్‌పీరియా సిరీస్ స్మార్ట్‌ఫోన్‌లను వినియోగిస్తున్న యూజర్లకు శుభవార్త. ఎంపిక చేయబడిన ఎక్స్‌పీరియా సిరీస్ హ్యాండ్‌సెట్‌లకు సంబంధించి సోనీ, ఆండ్రాయిడ్ 4.3 జెల్లీబీన్ అప్‌డేట్‌ను విడుదల చేసింది. ఈ అప్‌డేట్‌లు నేటి నుంచే అమల్లోకి రానున్నాయి.

సోనీ ఎక్స్‌పీరియా స్మార్ట్‌ఫోన్‌లకు ఆండ్రాయిడ్ జెల్లీబీన్ అప్‌డేట్!

దీంతో ఎక్స్‌పీరియా జెడ్, ఎక్స్‌పీరియా జెడ్ఎల్, ఎక్స్‌పీరియా జెడ్‌ఆర్, ఎక్స్‌పీరియా టాబ్లెట్ జెడ్ యూజర్లు పూర్తిస్థాయి ఆండ్రాయిడ్ జెల్లీబీన్ అనుభూతులను ఆస్వాదించవచ్చు. ఎక్స్‌పీరియా యూజర్లు ఈ అప్‌డేట్‌ను అందుకోవటం ద్వారా కొత్త ఫీచర్లతో కూడిన యూజర్ ఇంటర్‌ఫేస్‌ను ఆస్వాదించవచ్చు. గ్రాఫికల్ వ్యవస్థ మరింత మెరుగుపడుతుంది. సోనీ స్మార్ట్‌ సోషల్ కెమెరా అదనంగా జతవుతుంది. ఇంకా మరెన్నో అనుభూతులను ఈ కొత్త ప్లాట్‌ఫామ్ అందిస్తుంది.

సోనీ ఎక్స్‌పీరియా జెడ్ ప్రధాన స్పెసిఫికేషన్‌లు:

5 అంగుళాల హైడెఫినిషన్ కెపాసిటివ్ టచ్‌స్ర్కీన్ (రిసల్యూషన్ 1920 x 1080పిక్సల్స్), మొబైల్ బ్రావియో ఇంజన్ 2, క్వాడ్ కోర్ 1.5గిగాహెట్జ్ స్నాప్‌డ్రాగెన్ ఎస్4 ప్రాసెసర్, ఆండ్రాయిడ్ 4.1 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం, 13 మెగా పిక్సల్ కెమెరా, 2.2 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా (వీడియో కాలింగ్ నిర్వహించుకునేందుకు), 16జీబి ఇంటర్నల్ స్టోరేజ్, 2జీబి ర్యామ్, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా మెమరీని 32జీబికి పొడిగించుకునే సౌలభ్యత, వై-ఫై, బ్లూటూత్, నియర్ ఫీల్డ్ కమ్యూనికేషన్ ఫీచర్, 4జీ ఎల్‌టీఈ కనెక్టువిటీ, 2,330 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

సోనీ ఎక్స్‌పీరియా జెడ్ఎల్:

5 అంగుళాల ఎల్‌సీడీ కెపాసిటివ్ టచ్‌స్ర్కీన్, ఆండ్రాయిడ్ 4.1.2 ఆపరేటింగ్ సిస్టం, 13 మెగా పిక్సల్ రేర్ కెమెరా, ఫ్రంట్ కెమెరా ఫీచర్, 1.5గిగాహెట్జ్ క్రెయిట్ ప్రాసెసర్, 2జీబి ర్యామ్, అడ్రినో 320 గ్రాఫిక్ ప్రాసెసింగ్ యూనిట్, 16జీబి ఇంటర్నల్ మెమెరీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 32జీబికి విస్తరించుకునే సౌలభ్యత్, 3జీ, హెచ్ఎస్‌పీఏ+, ఎల్టీఈ, జీపీఎస్, వై-ఫై, నియర్ ఫీల్డ్ కమ్యూనికేషన్, 2370 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

సోనీ ఎక్స్‌పీరియా జెడ్‌ఆర్:

4.6 అంగుళాల హైడెఫినిషన్ స్ర్కీన్ (రిసల్యూషన్720x 1280పిక్సల్స్), ఆండ్రాయిడ్ 4.1 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం, 1.5గిగాహెట్జ్ క్వాడ్‌కోర్ ప్రాసెసర్, 2జీబి ర్యామ్, 8జీబి ఇంటర్నల్ మెమరీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 32జీబికి విస్తరించుకనే సౌలభ్యత, 13 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా, వీజీఏ ఫ్రంట్ కెమెరా, 3జీ, వై-ఫై, బ్లూటూత్, జీపీఎస్, నియర్ ఫీల్డ్ కమ్యూనికేషన్, 2300ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.

వివిధ మోడళ్ల స్మార్ట్ ఫోన్ లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.

Best Mobiles in India

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X