మార్కెట్లోకి సోనీ ఎక్స్‌పీరియా సీ3 సెల్ఫీ ఫోన్

Posted By:

బలోపేతమైన ఫ్రంట్ కెమెరా వ్యవస్థతో రూపుదిద్దుకునన్న సెల్ఫీ స్మార్ట్‌ఫోన్ ‘ఎక్స్‌పీరియా సీ3’ని సోనీ, సోమవారం ఇండియన్ మార్కెట్లో ప్రకటించింది. ధర రూ.23,990. సెప్టంబర్ 1వ తేదీ నంచి మార్కెట్లో లభ్యమవుతుంది. వైట్ ఇంకా మింట్ కలర్ వేరియంట్‌లలో ఫోన్ అందుబాటులో ఉంటుంది.

మార్కెట్లోకి సోనీ ఎక్స్‌పీరియా సీ3 సెల్ఫీ ఫోన్

ఈ సొగసరి డ్యూయల్ సిమ్ ఫోన్ సాఫ్ట్ ఫ్లాష్ ఫీచర్‌తో కూడిన 5 మెగా పిక్సల్ వైడ్-యాంగిల్ ఫ్రంట్ కెమెరా వ్యవస్థను కలిగి ఉంది. ఈ ఫ్రంట్ కెమెరా ద్వారా సెల్ఫీలను సౌకర్యవంతంగా అలానే ఉత్తమ క్వాలిటీతో చిత్రీకరించుకోవచ్చని సోనీ తెలిపింది. ప్రోర్ట్రెయిట్ రీటచ్, ఏఆర్ ఎఫెక్ట్ వంటి ప్రత్యేకమైన సెల్ఫీ కెమెరా అప్లికేషన్‌లను ఫోన్‌లో ముందుగానే లోడ్ చేసారు. ఫోన్ వెనుక భాగంలో అమర్చిన 8 మెగా పిక్సల్ రేర్ కెమెరా ద్వారా వీడియోలను హైడెఫినిషన్ క్వాలిటీతో చిత్రీకరించుకోవచ్చు.

సోనీ ఎక్స్‌పీరియా సీ3 కీలక స్పెసిఫికేషన్‌లు:

5 మెగా పిక్సల్ వైడ్-యాంగిల్ ఫ్రంట్ కెమెరా (సెల్ఫీలను చిత్రీకరించుకునేందుకు),
5.5 అంగుళాల హైడెఫినిషన్ ట్రైలూమినస్ డిస్‌ప్లే (రిసల్యూషన్720x 1280పిక్సల్స్),
ఆండ్రాయిడ్ 4.4 కిట్‌క్యాట్ ఆపరేటింగ్ సిస్టం,
1.2గిగాహెట్జ్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ క్వాడ్‌కోర్ ప్రాసెసర్,
1జీబి ర్యామ్,
8జీబి ఇంటర్నల్ మెమరీ,
మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 32జీబి వరకు విస్తరించుకునే అవకాశం,
8 మెగా పిక్సల్ రేర్ కెమెరా (సోనీ ఎక్స్‌మార్ సెన్సార్, ఎల్ఈడి ఫ్లాష్ సపోర్ట్),
ఈ కెమెరా ద్వారా హైడెఫినిషన్ క్వాలిటీ రికార్డింగ్ సాధ్యమవుతుంది,
2500 ఎమ్ఏహెచ్ బ్యాటరీ (24 గంటల టాక్‌టైమ్, 1071 గంటల స్టాండ్ బై టైమ్‌తో),
కనెక్టువిటీ ఫీచర్లు (4జీ ఎల్టీఈ, 3జీ, వై-ఫై, బ్లూటూత్).

మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.

వివిధ మోడళ్ల స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot