సీఈఎస్ 2014లో ‘సోనీ స్మార్ట్‌వాచ్ 3’

Posted By:

ఇప్పటికే  రెండు వర్షన్‌లలో స్మార్ట్‌‍వాచ్‌లను విడుదల చేసి మార్కెట్‌లను ఆకట్టుకోలేకపోయిన సోనీ ఈ జనవరిలో నిర్వహించే సీఈఎస్ 2014 ఎగ్జిబిషన్‌లో సోనీ స్మార్ట్‌వాచ్ 3ని ఆవిష్కరించే అవకాశముందని వార్తలు వినిపిస్తున్నాయి.ప్రపంచానికి మొట్టమొదటిగా స్మార్ట్‌వాచ్‌ను పరిచయం చేసిన కంపెనీలలో జపాన్‌కు చెందిన సోనీ ఎలక్ట్రానిక్స్ ఒకటి.

సీఈఎస్ 2014లో ‘సోనీ స్మార్ట్‌వాచ్ 3’

సోనీ తన మొదటివర్షన్ స్మార్ట్‌వాచ్‌ను 2012లో విడుదల చేసింది.ధరించదిగన కంప్యూటింగ్ పరికరాలకు అప్పుడప్పుడే ఆదరణ పెరుగుతున్న రోజులవి. గడిచిన రెండు సంవత్సరాల కాలంలో సోనీ రెండు వర్షన్‌లలో స్మార్ట్‌వాచ్‌‍లను విడుదల చేసింది. దురదృష్టవశాత్తూ ఆశించిన ఫలితాలను సోనీ రాబట్టలేకపోయింది.

సోనీ స్మార్ట్‌వాచ్ 2లో ఎన్‌ఎఫ్‌సీ, బ్లూటూత్ వంటి అత్యాధునిక కనెక్టువిటీ ఫచర్లు ఉన్నప్పటికి బుల్ట్-ఇన్ కాలింగ్ కార్యాచరణ లోపించటాన్ని ప్రధాన లోపంగా మీడియా ఎత్తిచూపింది. ఈ రెండు పరాజయాలను ఛాలెంజ్‌గా తీసుకున్న సోనీ స్మార్ట్‌వాచ్3 (SWR10 BT)తో ముందుకు రాబోతున్నట్లు పలు అంతర్జాతీయ వెబ్‌సైట్‌లు పేర్కొన్నాయి.

మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.

వివిధ మోడళ్ల స్మార్ట్ ఫోన్ లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot