దీపావళి సీజన్‌లో సోని లక్ష్యం రూ.2వేల కోట్ల అమ్మకాలు

Posted By: Staff

దీపావళి సీజన్‌లో సోని లక్ష్యం రూ.2వేల కోట్ల అమ్మకాలు

దేశంలో పండగల సీజన్‌కు ప్రధానమైన సెప్టెంబర్‌, అక్టోబర్‌ నెలల్లో రూ.2000 కోట్ల అమ్మకాలు చేయాలని సోనీ ఇండియా లక్ష్యంగా పెట్టుకుందని ఆ సంస్థ మార్కెటింగ్‌ జనరల్‌ మేనేజర్‌ టడాటో కిమురా వెల్లడించారు. శు క్రవారం హైదరాబాద్‌లో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ గతేడాది ఇదే సమయంలో రూ.1500 కోట్ల అమ్మకాలు నమోదయ్యాయని తెలిపారు. ప్రస్తుతం దీపావళి సీజన్‌ సమయంలో ఎట్టి పరిస్థితుల్లోనూ ధరలు పెంచే ఆలోచన తమ సంస్థకు లేదని, అయినా అనుకున్న లక్ష్యాన్ని చేరుకుంటామని చెప్పారు.

అమ్మకాల లక్ష్యాన్ని చేరుకోవడానికి ఈ సమయంలో రూ.100 కోట్ల మేర వ్యాపార ప్రకటనలకు ఖర్చు చేయనున్నట్లు చెప్పారు. ఈ రెండు నెలల కాలంలో ఆంధ్రప్రదేశ్‌లో రూ.125 కోట్ల విలువ చేసే సోనీ ఉత్పత్తులు అమ్మకాలు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామని, గతేడాదితో పోలిస్తే 56 శాతం వృద్ధి సాధించాలని నిర్దేశించుకున్నామని చెప్పారు. రాష్ట్ర మార్కెట్లో సోనీ 12 శాతం వాటా కలిగి ఉందని చెప్పారు. గతేడాది రాష్ట్రంలో 700 అవుట్‌లెట్స్‌ ఉన్నాయని, 2011లో వీటిని 1000కి పెంచుకోనున్నట్లు తెలిపారు. అంతే కాకుండా ఎటిఎల్‌, బిటిఎల్‌ మార్కెటింగ్‌ కోసం రూ.12 కోట్ల మేర పెట్టుబడి పెట్టనున్నట్లు చెప్పారు.

దీపావళి సీజన్‌ సందర్భంగా వివిధ అమ్మకాలపై డిస్కౌంట్లు, వివిధ ప్రమోషన్లు కల్పిస్తున్నట్లు తెలిపారు. బ్రేవియా, సైబర్‌షాట్‌, హ్యాడికామ్‌, హోం థియేటర్స్‌, వాయో ల్యాప్‌టాప్స్‌ అమ్మకాలపై పండగల సందర్భంగా ఆఫర్లను అందిస్తున్నట్లు చెప్పారు.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot